MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Insect: ప్రపంచంలోనే అందమైన పురుగు... ఇది కనిపిస్తే ఎక్కువ సంతోషించేది ఎవరో తెలుసా?

Insect: ప్రపంచంలోనే అందమైన పురుగు... ఇది కనిపిస్తే ఎక్కువ సంతోషించేది ఎవరో తెలుసా?

Insect: పురుగులు అనగానే ఒక జుగుప్సాకరమైన ఫీలింగ్ ఉంటుంది. కానీ, ఈ పురుగు మాత్రం చూడటానికి చాలా క్యూట్ గా, ముద్దుగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన పురుగు ఇది. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 05 2026, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈ పురుగు గురించి మీకు తెలుసా?
Image Credit : Geminiai

ఈ పురుగు గురించి మీకు తెలుసా?

వర్షాకాలం వస్తే చాలు.. చాలా రకాల పురుగులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని పురుగులను చూస్తే.. కొందరికి భయం వేస్తుంది. మరి కొందరికి అసహ్యం వేస్తుంది. కానీ, ఒక పురుగును చూస్తే మాత్రం ఎవరికీ అలాంటి ఫీలింగ్ రాదు. అంతేకాదు.. చూసే కొద్దీ మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది. అదే ఆరుద్ర పురుగులు. వీటిని Red Velvet Mites అని కూడా పిలుస్తారు. చూడటానికి చాలా చిన్నగా ఉన్నా... చాలా ముద్దుగా కనిపిస్తూ కనివిందు చేస్తాయి. ఈ పురుగులు.. వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రైతులకు వరం...
Image Credit : Geminiai

రైతులకు వరం...

ఈ ఆరుద్ర పురుగుల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తారు. ముఖ్యంగా.. ఇవి నేల మీద కనిపించగానే రైతులు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే, వర్షాలు సకాలంలో కురుస్తున్నాయని, వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అని ఆరుద్ర పురుగులు రైతులకు పరోక్షంగా సంకేతం ఇస్తాయి. మంచి పంటల సీజన్ మొదలైందనే భరోసాను ఇవి కల్పిస్తాయి. అంతేకాదు.. ఈ పురుగుల వల్ల పంటలకు కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే, ఇవి పంటలకు నష్టం కలిగించే హానికర కీటకాల గుడ్లను, చిన్నపాటి క్రిములను తినేస్తాయి. ఎలాంటి రసాయనాలు, మందులు వాడకుండానే పంటలను రక్షించే సహజసిద్ధమైన సైనికులుగా ఇవి పని చేస్తాయి.

నేలలో తిరిగే ఈ పురుగులు భూమి గుల్లబారేలా చేస్తాయి. దీని వల్ల మొక్కల వేర్లకు గాలి, నీరు తేలికగా అంది పంటలు ఆరోగ్యంగా, కళకళలాడుతూ ఎదుగుతాయి. అందుకే, ఈ పురుగులు కనిపిస్తే రైతులు ఎక్కువగా సంతోషిస్తారు.

33
ఆరుద్ర పురుగుల జీవన విధానం...
Image Credit : Geminiai

ఆరుద్ర పురుగుల జీవన విధానం...

ట్రాంబిడిడే కుటుంబానికి, సాలీడు జాతికి చెందిన ఈ పురుగుల లైఫ్ స్టైల్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రుతుపవనాలు ప్రారంభమయ్యే తొలకరి కాలంలో మాత్రమే ఇవి నేలపై ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. మిగిలిన సమయాల్లో నేలలో పొడిగా ఉండే భాగాల్లో లేదా భూమి లోపల సుప్తావస్థలో గడుపుతాయి. ఈ పురుగులు వర్షాకాలంలో గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి వచ్చే లార్వా దశలోని చిన్న పురుగులు.. చెదపురుగులు, లేదా మొక్కలకు హాని చేసే ఇతర చిన్న క్రిముల మీద ఆధారపడి జీవిస్తాయి. పెద్దయ్యాక మాత్రం ఇవి స్వతంత్రంగా మారి నేలలోని సేంద్రియ పదార్థాలను తింటూ జీవనాన్ని సాగిస్తాయి.

ఆయుర్వేదంలోనూ ప్రత్యేక స్థానం...

కేవలం వ్యవయసాయ పరంగానే కాకుండా, ఆయుర్వేద, సాంప్రదాయ వైద్యంలోనూ ఆరుద్ర పురుగులకు మంచి గుర్తింపు ఉంది. కొన్ని సంప్రదాయ వైద్య విధానాలలో వీటిని ప్రత్యేక పద్ధతిలో శుద్ధి చేసి నూనెల తయారీకి ఉపయోగిస్తారు. పూర్వకాలంలో నరాల బలహీనత వంటి సమస్యలకు సంబంధించిన మందుల తయారీలోనూ వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
4F Crisis : ఇండియాకు 4F సంక్షోభం తప్పదా..? ఇంతకీ ఏమిటీ క్రైసిస్, దీనివల్ల నష్టాలేంటి?
Recommended image2
ప్రపంచంలోని ఏ దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ? ఇక భారత స్థానం ఎంతంటే..!
Recommended image3
Coffee Capital: మనదేశంలో కాఫీ రాజధానిగా పిలిచే సిటీ ఏదో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు
Related Stories
Recommended image1
Dal: కంది పప్పుకీ, ఎర్ర కంది పప్పుకీ తేడా ఏంటి? రెండింటిలో ఏది తింటే మంచిది?
Recommended image2
Custard Apple: సీతాఫలం గింజలు తీయడం కష్టంగా ఉందా? 10సెకన్లలో గింజలు తొలగించే ట్రిక్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved