MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Feature
  • Facts : గడియారం ముల్లులు కుడివైపే ఎందుకు తిరుగుతాయి? ఎడమవైపు ఎందుకు తిరగవు?

Facts : గడియారం ముల్లులు కుడివైపే ఎందుకు తిరుగుతాయి? ఎడమవైపు ఎందుకు తిరగవు?

మనం ప్రతిరోజూ టైం తెలుసుకునేందుకు గడియారం చూస్తాం. ఈ సమయంలో గడియారం ముల్లులు ఎప్పుడూ ఎడమ నుంచి కుడికి తిరగడం చూస్తాం. ఇలాగే ఎందుకు తిరుగుతాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ చిన్న ప్రశ్నకు వెనుక పెద్ద చరిత్ర, సైన్స్ ఉన్నాయి.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 07 2026, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గడియారం ముల్లులు కుడివైపు ఎందుకు తిరుగుతాయి?
Image Credit : Gemini AI

గడియారం ముల్లులు కుడివైపు ఎందుకు తిరుగుతాయి?

ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ లో, స్మార్ట్ వాచ్ లో టైమ్ చూసే కల్చర్ వచ్చింది… కానీ గతంలో ఇళ్లలో గోడ గడియారాలు, చేతికి సాధారణ వాచ్ లు ఉండేవి. ఇప్పటికీ కొందరు సాధారణ గడియారాలనే వాడుతున్నారు… వాటితో మనిషికి విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అయితే స్మార్ట్ వాచ్ అయినా, నార్మల్ వాచ్ అయినా టైమ్ చూడాలంటే ఇప్పటికీ ఎవరి కళ్ళయినా గడియారం వైపే వెళతాయి.

టైమ్ చూసేటప్పుడు మీరు ఓ విషయం గమనించారా? గడియారం ముల్లులు ఎప్పుడూ ఎడమ నుంచి కుడికే తిరుగుతాయి… ఇలాగే ఎందుకు? కుడి నుంచి ఎడమకు ఎందుకు తిరగవు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ప్రాచీన కాలానికి వెళ్లాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రపంచంలో మొదటి గడియారం ఎక్కడ వాడారు?
Image Credit : Getty

ప్రపంచంలో మొదటి గడియారం ఎక్కడ వాడారు?

క్రీ.పూ. 1500 ప్రాంతంలో బాబిలోన్‌ (ఇప్పటి ఇరాన్) లో మొదటిసారి సూర్య గడియారాన్ని వాడారని చరిత్ర చెబుతోంది. సూర్యరశ్మి, దాని స్థానం ఆధారంగా ఈ గడియారం పగటిపూట సమయాన్ని చెప్పేది. 

ఈ సూర్య గడియారంలో ఒక బల్లపరుపు పలకపై సమయాన్ని సూచించే గుర్తులు పెట్టేవారు. దానిపై 'నోమన్' (Gnomon) అనే కర్రను నిలువుగా పెట్టేవారు. సూర్యరశ్మి పడినప్పుడు ఆ నోమన్ నీడ పలకపై కదిలేది. ఆ నీడ ఉన్న స్థానాన్ని బట్టి సమయాన్ని చెప్పేవారు. 

చాలా సులభంగా ఈ సూర్య గడియారాన్ని తయారు చేయవచ్చు. ఖాళీ ప్రదేశంలో ఒక కర్రను పాతి, దాని చుట్టూ గంటల గుర్తులు పెడితే చాలు… సూర్యుడు తూర్పున ఉదయించాక కర్ర నీడ నెమ్మదిగా తిరగడం మొదలవుతుంది. ఆ నీడను చూసి సమయాన్ని చెప్పేవారు. దీన్ని ఆకాలంలో విరివిగా వాడేవారు. అయితే ఇది కేవలం పగలు మాత్రమే పనిచేసేది… అందుకే తర్వాత మెకానికల్ గడియారాలు తయారుచేశారు.

Related Articles

Related image1
Interesting Facts : ప్రపంచంలో ప్రధానిగానీ, అధ్యక్షుడు గానీ లేని దేశాలేవో తెలుసా?
Related image2
Facts : విమానం విండోస్ రౌండ్ షేప్ లోనే ఎందుకుంటాయి? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా?
34
గడియారం ఎడమ నుండి కుడికే ఎందుకు?
Image Credit : Getty

గడియారం ఎడమ నుండి కుడికే ఎందుకు?

ఇక అసలు ప్రశ్నకు సమాధానం చూద్దాం. భూమి తన అక్షం మీద పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. దీనివల్ల ఉత్తరార్ధగోళంలో ఉన్న మనకు సూర్యుడు తూర్పు నుంచి దక్షిణానికి కదిలి, పడమరలో అస్తమిస్తున్నట్లు కనిపిస్తాడు. అందుకే సూర్య గడియారంలోని కర్ర నీడ కూడా ఎడమ నుంచి కుడి వైపుకు కదులుతుంది.

ఈ సూర్య గడియారం ఆధారంగానే తర్వాత మెకానికల్ గడియారాలు తయారు చేశారు. ఇందులోనూ సూర్య గడియంలో పద్ధతిని పాటించారు… అంటే ముల్లులు ఎడమ నుండి కుడికి తిరిగేలా రూపొందించారు. అదే పద్దతిని తర్వాత కొనసాగించారు… అందుకే ఇప్పటికీ గడియారం ముల్లులు ఎడమ నుంచి కుడికే తిరుగుతాయి.

44
అలాగైతే గడియారం కుడి నుండి ఎడమకు తిరిగేదేమో..!
Image Credit : freepik

అలాగైతే గడియారం కుడి నుండి ఎడమకు తిరిగేదేమో..!

ఒకవేళ మొదటి గడియారాన్ని దక్షిణార్ధగోళంలో కనిపెట్టి ఉంటే, సూర్యుడి కదలిక వల్ల నీడ వ్యతిరేక దిశలో కదిలేది. అంటే కుడి నుండి ఎడమకు తిరిగేది. అప్పుడు బహుశా ఇప్పటి గడియారాల్లో ముల్లులు కూడా కుడి నుంచి ఎడమకు తిరిగేవేమో.

సింపుల్‌గా చెప్పాలంటే ఉత్తరార్ధగోళంలో సూర్య గడియారాలను మొదట వాడారు… సూర్యుడి కదలికను అనుసరించారు. అందుకే  ఎడమ నుండి కుడికి తిరిగేలా గడియారాన్ని రూపొందించారు… ఇప్పటికీ గడియారం ముల్లులు క్లాక్‌వైజ్‌లో తిరుగుతున్నాయి. ఇదే నేటి గడియారాల క్లాక్ వైజ్ వెనకున్న రహస్యం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ లీక్ కాకుండా ఉండాలంటే.. ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేయండి
Recommended image2
న‌మ్మ‌క ద్రోహం మ‌హా పాపం.. త‌ప్పు చేసి త‌ప్పించుకోవ‌డం అసాధ్యమ‌ని చెప్పే క‌థ
Recommended image3
IRCTC గోదావరి టెంపుల్ టూర్: అంతర్వేది, అన్నవరం, ద్రాక్షారామ క్షేత్రాల దర్శనం.. బడ్జెట్‌లో ఇవి ఫ్రీ
Related Stories
Recommended image1
Interesting Facts : ప్రపంచంలో ప్రధానిగానీ, అధ్యక్షుడు గానీ లేని దేశాలేవో తెలుసా?
Recommended image2
Facts : విమానం విండోస్ రౌండ్ షేప్ లోనే ఎందుకుంటాయి? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved