MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Feature
  • Miss India 2026: ఆ ఎమ్మెల్యే కూతురే మిస్ ఇండియా 2026, 7 భాషలు మాట్లాడే బ్యూటీ క్వీన్

Miss India 2026: ఆ ఎమ్మెల్యే కూతురే మిస్ ఇండియా 2026, 7 భాషలు మాట్లాడే బ్యూటీ క్వీన్

Miss India 2026: మనదేశానికి కొత్త మిస్ ఇండియా ఎంపిక అయింది. ఆ అందగత్తే తండ్రి రాజకీయాల్లో ఉన్నారు. కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే సతీష్ సైల్ కుమార్తె సాధ్వి సైల్ 'ఫెమినా మిస్ ఇండియా 2026' కిరీటాన్ని గెలుచుకున్నారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 20 2026, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫెమినా మిస్ ఇండియా 2026
Image Credit : Femina

ఫెమినా మిస్ ఇండియా 2026

భారత్‌కు కొత్త అందాల రాణి వచ్చేసింది. ఆమె సాధ్వి సతీష్ సైల్. ప్రస్తుతం ఈమె పేరు మనదేశంలో ట్రెండవుతోంది.  భువనేశ్వర్లో  జరిగిన ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 పోటీలో ఆమె విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది. సాధ్వి  గోవా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఆమె విజయం ఆ రాష్ట్రానికి కూడా గర్వకారణంగా మారింది. ఇప్పుడు ఆమె భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో జరిగే మిస్ వరల్డ్ పోటీలో 2027లో పాల్గొనబోతోంది. ఈమె తండ్రి కర్ణాటకలోని కార్వార్ ఎమ్మేల్యే సతీస్ సైల్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
30 మందిని ఓడించి
Image Credit : Asianet News

30 మందిని ఓడించి

భువనేశ్వర్‌లోని KIITలో జరిగిన పోటీలో అన్ని రాష్ట్రాల నుంచి 30 మంది పోటీదారులను ఓడించింది సాధ్వి సైల్. సాధ్వి సతీష్ సైల్ చదువులో కూడా ముందుంటుంది. ఆమె ఎకానామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో డబుల్ మాస్టర్స్ డిగ్రీ సాధించింది. ఆమెకు భాషలపై కూడా మంచి పట్టు ఉంది. మొత్తం ఏడు భాషలు మాట్లాడగలదు. విదేశాల్లో చదువుకుంటూ ఆమె ఇప్పటికే పది దేశాలు సందర్శించింది. ఈ అనుభవం ఆమె వ్యక్తిత్వాన్ని మరింత బలంగా తీర్చిదిద్దింది. అందం మాత్రమే కాకుండా తెలివితేటలు కూడా కలిసిన వ్యక్తి సాధ్వి. 

34
తండ్రి ఆనందం
Image Credit : Asianet News

తండ్రి ఆనందం

కూతురు మిస్ ఇండియా కావడంతో ఎమ్మెల్యే సతీష్ సైల్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. కేవలం మూడు నెలల ప్రిపరేషన్‌తోనే తన కూతురు ఈ ఘనత సాధించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సాధ్వి గోవాలోని పనాజీలో పుట్టడంతో ఆమె ఆ రాష్ట్రం తరుపునే పోటీ పడ్డారు. కానీ కార్వార్‌లోని స్కూల్లో చదివారు. బెంగళూరు, కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు.

44
గోవా నుంచి తొలి మహిళ
Image Credit : Asianet News

గోవా నుంచి తొలి మహిళ

మోడలింగ్‌తో పాటు సాధ్వి సామాజిక సేవలో కూడా  పాల్గొంటుంది. ముఖ్యంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేస్తూ ఉంటుంది.  సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అంతేకాకుండా వ్యాపార రంగంలో కూడా ఆమె ఆసక్తి చూపుతోంది. ఈ విధంగా ఒకే సమయంలో పలు రంగాల్లో తన ప్రతిభను చూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. గోవా నుంచి మిస్ ఇండియా అయిన తొలి మహిళగా సాధ్వి రికార్డు స్థాపించింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snake Venom Medicines: ప్రాణాలు తీసే పాముల విషమే ఇప్పుడు సంజీవని !
Recommended image2
Rainbow : ఇంద్రధనుస్సు ఎప్పుడూ వంగే ఎందుకు కనిపిస్తుంది? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Recommended image3
Psychology: ఒక వ్యక్తిని మర్చిపోవడం ఎందుకు అంత కష్టం? సైకాలజీ ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Train Speed: పగటిపూటతో పోలిస్తే రాత్రిపూట రైళ్లు ఎందుకు స్పీడ్‌గా వెళ్తాయి? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే
Recommended image2
Venus Blessings: శుక్రుడి దయతో ఈ 4 రాశులవారికి ధన యోగం మొదలు, ఆరోజు వరకు వీరికి తిరుగే ఉండదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved