MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Success Story : ఇది కదా సక్సెస్ అంటే.. పదో తరగతి కూడా పాస్ కాలేదు, ఇంగ్లీష్ రాదు.. ఒకప్పటి క్యాబ్ డ్రైవర్ నేడు టెక్ కంపెనీ హెడ్

Success Story : ఇది కదా సక్సెస్ అంటే.. పదో తరగతి కూడా పాస్ కాలేదు, ఇంగ్లీష్ రాదు.. ఒకప్పటి క్యాబ్ డ్రైవర్ నేడు టెక్ కంపెనీ హెడ్

డిగ్రీలు, పీజిలు చేసినవారికే ఉద్యోగాలు లభించని ఈ కాలంలో కనీసం పదో తరగతి కూడా పాస్ కాని ఓ వ్యక్తి, సాధారణ క్యాబ్ డ్రైవర్ ఓ కంపెనీ హెడ్ గా మారాడు. అతడి సక్సెస్ స్టోరీ నేటి యువతకు స్పూర్తిధాయకం.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 08 2026, 09:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇది కదా సక్సెస్ అంటే..
Image Credit : linkedin/ Sravanth Gajula

ఇది కదా సక్సెస్ అంటే..

Success Story : పదేళ్ల క్రితం హైదరాబాద్ వీధుల్లో సాగిన ఒక సాధారణ ట్యాక్సీ ప్రయాణం.. ఒక వ్యక్తి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే పెద్ద డిగ్రీలు, ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడే సత్తా, ఆకట్టుకునే రెజ్యూమ్ ఉండాలనేది సాధారణ నమ్మకం… కానీ ఈ మూస ధోరణికి భిన్నంగా ఆలోచించారు హైదరబాద్ కు చెందిన టెక్ సంస్థ ‘అడోన్‌మో’ (AdOnMo) సహ వ్యవస్థాపకుడు, మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి శ్రవంత్ గాజుల. ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్‌లోని టాలెంట్ ను, నిజాయితీని గుర్తించి తన కంపెనీలో మొదటి ఉద్యోగిగా చేర్చుకున్నారు. నేడు ఆ నిర్ణయం ఎంతటి గొప్ప మార్పుకు నాంది పలికిందో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్యాబ్ డ్రైవర్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
10వ తరగతి కూడా పాస్ కాకున్నా అద్భుతమైన జాబ్..
Image Credit : linkedin/Sravanth Gajula

10వ తరగతి కూడా పాస్ కాకున్నా అద్భుతమైన జాబ్..

"10వ తరగతి కూడా పూర్తి చేయలేదు, ఇంగ్లీష్ రాదు, కార్పొరేట్ అనుభవం అసలే లేదు. ఏ హెచ్‌ఆర్ మేనేజర్ కూడా కనీసం పరిగణనలోకి తీసుకోని ప్రొఫైల్ అది" అని శ్రవంత్ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో గుర్తుచేసుకున్నారు. కానీ ఆయన ఆ డ్రైవర్‌ను ఉద్యోగిగా ఎంచుకోవడానికి కారణం దయాదాక్షిణ్యాలు కావు... అది ఒక నమ్మకం. ఆ ట్యాక్సీ డ్రైవర్ లో నేర్చుకోవాలనే కసి, నిజాయితీ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని అధిగమించాలనే తపన శ్రవంత్‌ను ఆకర్షించాయి. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి ఒక మనిషిలోని నిజమైన ప్రతిభను నమ్మారు.

కేవలం ఉద్యోగం ఇచ్చి చేతులు దులుపుకోలేదు అడోనోమో యాజమాన్యం. ఆయన నమ్మకానికి తగినట్లుగా ఆ డ్రైవర్‌కు అవసరమైన అన్ని వసతులను కల్పించారు. ముందుగా అతడికి ‘స్పోకెన్ ఇంగ్లీష్’ కోర్సుల్లో చేర్పించారు. కేవలం పేరుకే ఉద్యోగం ఇచ్చి ఉద్దరించినట్లు బిల్డప్ ఇవ్వకుండా కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించే అత్యంత బాధ్యతాయుతమైన పనులను అప్పగించారు. "ఆయన కచ్చితంగా ఎదుగుతారనే నమ్మకంతోనే మేము చూశాం. ఆ నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోవడమే కాదు, ఊహించని రీతిలో ఎదిగారు" అని శ్రవంత్ సగర్వంగా ప్రకటించారు.

34
ట్యాక్సీ డ్రైవర్ నుంచి పాన్-ఇండియా హెడ్‌గా..
Image Credit : Getty

ట్యాక్సీ డ్రైవర్ నుంచి పాన్-ఇండియా హెడ్‌గా..

2016లో ప్రారంభమైన డిజిటల్ అడ్వర్టైజింగ్ సంస్థ ‘అడోనోమో’ లో మొదటి ఉద్యోగిగా చేరిన ఆనాటి డ్రైవర్, పదేళ్ల కాలంలో తన కష్టంతో, ప్రతిభతో అద్భుతాలు సృష్టించారు. నేడు ఆయన సంస్థలోని అత్యంత కీలకమైన ప్రోక్యూర్మెంట్ (Procurement) విభాగ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన పని పరిధి దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఒకప్పుడు సరైన క్వాలిఫికేషన్స్ లేక అవకాశాలకు దూరమైన ఆ వ్యక్తి, నేడు కంపెనీలోనే అత్యంత నమ్మకమైన, ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా స్థానం సంపాదించుకోవడం ఒక అరుదైన విజయగాథ.

44
నిజమైన నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం
Image Credit : linkedin/Sravanth Gajula

నిజమైన నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం

కంపెనీల విలువలు, 'పీపుల్ ఫస్ట్' సంస్కృతి గురించి పుస్తకాల్లో చెప్పడం చాలా సులభం. కానీ ఆచరణలో చూపించడమే అసలైన నాయకత్వం. సమాజం పక్కనపెట్టిన ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వడం, ఆయన పూర్తిగా సిద్ధంగా లేకపోయినా ఆయన భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడం, సముచిత స్థానం కల్పించడమే నిజమైన విజయం. "మీ బృందంపై మీరు ఎంతటి నమ్మకం ఉంచుతారో, వారు అంతటి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కాబట్టి పెద్దగా ఆలోచించండి, నమ్మకాన్ని పెంచండి" అంటూ శ్రవంత్ నేటి యువ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

ఈ స్పూర్తిదాయకమైన కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కేవలం కాగితాలపై ఉండే డిగ్రీలను మాత్రమే కాకుండా, మనుషుల్లోని ప్రతిభను గుర్తిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. సరైన మార్గదర్శకత్వంతో పాటు నమ్మకం తోడైతే, ఒక ట్యాక్సీ డ్రైవర్ కూడా కార్పొరేట్ దిగ్గజంగా మారగలడని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
ఉద్యోగాలు, కెరీర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఖాళీ గ‌దిలో రీసౌండ్ ఎందుకొస్తుంది.? వ‌స్తువులుంటే ఆ సౌండ్ ఏమ‌వుతుంది.?
Recommended image2
Longest Train Journey: ఏకంగా 9 రాష్ట్రాల మీదుగా వెళ్లే రైలు.. ఇదే మనదేశంలో లాంగెస్ట్ ట్రైన్ జర్నీ
Recommended image3
రోడ్డుపై ఎప్పుడైనా ఈ సింబల్‌ని గ‌మ‌నించారా.? చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Related Stories
Recommended image1
Success Story : స్విగ్గీ డెలివరీ బాయ్ నుండి కోటీశ్వరుడిగా.. తన చేతిరాతతో తలరాతనే మార్చుకున్న ఓ యువకుడి సక్సెస్ స్టోరీ
Recommended image2
Success Story : పాములు పట్టేవారికి పద్మశ్రీ పురస్కారం.. ఇది కదా సక్సెస్, వీళ్లు కదా రియల్ హీరోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved