MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Success Story : స్విగ్గీ డెలివరీ బాయ్ నుండి కోటీశ్వరుడిగా.. తన చేతిరాతతో తలరాతనే మార్చుకున్న ఓ యువకుడి సక్సెస్ స్టోరీ

Success Story : స్విగ్గీ డెలివరీ బాయ్ నుండి కోటీశ్వరుడిగా.. తన చేతిరాతతో తలరాతనే మార్చుకున్న ఓ యువకుడి సక్సెస్ స్టోరీ

స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేసిన యువకుడు పట్టుదలతో శ్రమించి కోటిశ్వరుడిగా ఎదిగాడు. ఇలా ఆర్థిక కష్టాలను అధిగమించి అందనంత ఎత్తుకు ఎదిగిన ఆ యువ కెరటం స్పూర్తిధాయకమైన లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 24 2026, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇది కదా సక్సెస్ అంటే..
Image Credit : Screenshot to Pocket FM

ఇది కదా సక్సెస్ అంటే..

Inspiring Story : ఒకప్పుడు స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేసిన యువకుడు ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యాడు. ఇతడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్థిక కష్టాలు, వ్యక్తిగత సమస్యలను దాటుకుని సక్సెస్ ఫుల్ రచయితగా ఎదిగిన ఫరీదాబాద్ వాసి అజిత్ కుమార్ కథ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. కుటుంబాన్ని పోషించడానికి ఒకప్పుడు స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తూ భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసిన అతను... ఇప్పుడు కోటీశ్వరుడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అయ్యో పాపం... ఎన్ని కష్టాలో..
Image Credit : Screenshot to Pocket FM

అయ్యో పాపం... ఎన్ని కష్టాలో..

ఇన్వెస్టర్ రాహుల్ మాథుర్ పాకెట్ ఎఫ్ఎంలో వచ్చిన అజిత్ ఇంటర్వ్యూను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ కు చెందిన నిరుపేద యువకుడు అజిత్ స్పూర్తిధాయకమైన స్టోరీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది... దీంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. ఇందులో తన జీవితం ఎలా మారింతో అజిత్ వివరించాడు.

కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత కుటుంబంలో ఆర్థిక సమస్యలు పెరిగాయని అజిత్ చెప్పుకొచ్చాడు. దీంతో కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి ఉద్యోగం వెతుక్కోవడం మొదలుపెట్టానని తెలిపాడు. జీవితంలో ఒక దశలో అంతా అయిపోయింది అనుకునట్లు మారింది. కుటుంబ పోషణ బాధ్యతలు మీదపడటంతో ఇబ్బంది పడాల్సి వచ్చిందని... ఆదాయం లేకపోవడంతో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా కూడా పనిచేసినట్లు తెలిపాడు. అంతేకాదు డబ్బుల కోసం అమ్మాయిలకు మెహెందీ పెట్టడం, పెళ్లికూతుళ్ళకు మేకప్ కూడా చేయడం చేసేవాడట. ఇలా అనేక రకాల పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు అజిత్.

కష్టపడి కుటుంబాన్ని నడిపిస్తూనే భవిష్యత్తు కోసం కొత్త అవకాశాల గురించి నిరంతరం వెతికేవాడు అజిత్. ఈ సమయంలో అతడు ప్రమాదానికి గురయ్యాడు... దీంతో అంతా అయిపోయిందనిపించిందట. యాక్సిడెంట్ తర్వాత మంచానికే పరిమితం అయ్యాడు... వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు, లోన్లు తీసుకున్నాడు. ఇలా అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు.

Related Articles

Related image1
Success Story : మూడుసార్లు ఫెయిల్.. శత్రువుల వల్లే నాలుగోసారి సివిల్స్ ర్యాంక్ : ఓ తెలుగు ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
Related image2
Inspiring Story : పగలు ఉద్యోగం, రాత్రి బైక్ ట్యాక్సీ, కంటెంట్ క్రియేషన్.. వీటి మధ్యలో పీహెచ్‌డీ : ఈ కుర్రాడు అదుర్స్
34
పేదరికం నుండి కోటీశ్వరుడిగా..
Image Credit : Screenshot to Pocket FM

పేదరికం నుండి కోటీశ్వరుడిగా..

యాక్సిడెంట్ కారణంగా మంచానికే పరిమితం అయిన సమయంలోనే అనుకోకుండా అదృష్టం అజిత్ తలుపుతట్టింది. సరిగ్గా అప్పుడే పాకెట్ ఎఫ్ఎం నుంచి యాడ్ వీడియో స్క్రిప్ట్ కోసం ఒక ప్రకటన వచ్చింది... ఇది అజిత్ చూశాడు. అప్పటికే అతడికి స్క్రిప్ట్ రైటింగ్ పై అవగాహన ఉండటంతో పాకెట్ ఎఫ్ఎం కోసం మొదట యాడ్ రాశాడు... ఇది అతడి జీవితాన్నే మార్చేసింది.

యాడ్స్ కోసం స్క్రిప్ట్ రాసే స్థాయినుండి కథలు రాయడం ప్రారంభించాడు అజిత్. ఇలా అతడు రాసిన మొదటి కథకు రూ.20,000 అందుకున్నాడు. ఆ తర్వాత నిరంతరం కథలు రాస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో అజిత్ రాసిన ఒక ఆడియో సిరీస్ ప్లాట్‌ఫామ్‌లో నంబర్ 1 స్థానం సంపాదించింది. దానికి ప్రతిఫలంగా రూ.52,000 లభించాయి. ఇలా కథలు రాయడం ద్వారా ఆదాయం పొందాడు... ఓ దశలో అతడు నెలకు రూ.6.29 లక్షల మొత్తాన్ని కూడా సంపాదించాడు.

అజిత్ కుమార్ ను కోటీశ్వరుడిగా పేర్కొంటూ ఇన్వెస్టర్ రాహుల్ మాథుర్ ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. "ఫరీదాబాద్‌కు చెందిన ఓ స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్, పాకెట్ ఎఫ్ఎంలో కథలు రాయడం మొదలుపెట్టాక కోటీశ్వరుడు అయ్యాడు. పాకెట్ ఎఫ్ఎంలో అత్యంత విజయవంతమైన సిరీస్‌లలో ఒకదానికి అజిత్ కుమార్ రచయిత. దీని రాయల్టీ ద్వారా కోట్లు సంపాదించే అవకాశం ఉంది'' అని మాథుర్ వివరించారు.

"16.8 కోట్ల ప్లేయ్స్ తో దూసుకుపోతున్న "బ్రహ్మయోధ్: ది డిస్ట్రాయర్" సిరీస్‌కు అజిత్ కుమార్ ప్రధాన రచయిత. ఈ సిరీస్ ప్లేయ్స్ 4.16 కోట్ల నుంచి 4 రెట్లు పెరిగాయి.. ఎపిసోడ్ల సంఖ్య 1300 దాటింది. ఈ ఏడాది అతని షో రూ.100 కోట్లకు పైగా ఆదాయం సంపాదించనుంది. దీంతో అజిత్ కు కోట్లాది రూపాయలు లభించనున్నాయి" అని మాథుర్ జోడించారు. 2026 జనవరిలో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌కు అజిత్ ను స్పీకర్‌గా ఆహ్వానించారు.. ఇది అతడి జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా రాహుల్ మాథుర్ పేర్కొన్నారు.

A Swiggy delivery partner from Faridabad has become a crorepati after he started writing for Pocket FM.

Ajit Kumar had to abandon his medical studies because of lack of funds when the lockdown disrupted his family’s livelihood. He began delivering food on his bicycle, working… pic.twitter.com/WMe0lh5CuP

— Rahul Mathur (@Rahul_J_Mathur) July 24, 2026

44
జీవితం నేర్పిన అతిపెద్ద పాఠం
Image Credit : Screenshot to Pocket FM

జీవితం నేర్పిన అతిపెద్ద పాఠం

విజయం వెనుక అదృష్టం మాత్రమే కాదు, నిరంతర ప్రయత్నం, ఓటమిల నుంచి పాఠాలు నేర్చుకోవడం కూడా ఉందని అజిత్ స్పష్టం చేస్తున్నాడు. కష్టాలు ఎదురైనప్పుడు ఆశ కోల్పోకుండా ముందుకు సాగడమే జీవితం నేర్పిన అతిపెద్ద పాఠమని అతను అంటున్నాడు. ఇబ్బందుల మధ్య కూడా కొత్త నైపుణ్యాలను పెంచుకుని, అవకాశాలను గుర్తించడమే తన జీవితాన్ని మార్చివేసిందని అతను చెప్పాడు.

అజిత్ జీవితానుభవం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, చాలామంది అతన్ని అభినందిస్తున్నారు. చిన్న పనులను ఎప్పుడూ తక్కువగా చూడకూడదని, ఆత్మవిశ్వాసం, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే జీవితంలో పెద్ద విజయాలు సాధించవచ్చనే సందేశాన్ని అతని ప్రయాణం ఇస్తోందని చాలామంది అభిప్రాయపడ్డారు. పరిమిత పరిస్థితుల నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన అతని కథ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Facts: లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు పెడతారు? ముఖం చూసుకోవడానికి మాత్రమే కాదు!
Recommended image2
నలుపు, తెలుపు, నీలం.. ఇంటికి ఏ రంగు వాటర్ ట్యాంక్ మంచిది? కొనేముందు ఇవి తెలుసుకోండి
Recommended image3
Coldest Place: భారత్‌లో అత్యంత చల్లని ప్రాంతం ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
Success Story : మూడుసార్లు ఫెయిల్.. శత్రువుల వల్లే నాలుగోసారి సివిల్స్ ర్యాంక్ : ఓ తెలుగు ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
Recommended image2
Inspiring Story : పగలు ఉద్యోగం, రాత్రి బైక్ ట్యాక్సీ, కంటెంట్ క్రియేషన్.. వీటి మధ్యలో పీహెచ్‌డీ : ఈ కుర్రాడు అదుర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved