MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Pink Dolphins: పింక్ డాల్ఫిన్లు కనిపించే ఏకైక నది ఏదో తెలుసా?

Pink Dolphins: పింక్ డాల్ఫిన్లు కనిపించే ఏకైక నది ఏదో తెలుసా?

Pink Dolphins: డాల్ఫిన్లను సముద్రంలో చూస్తూనే ఉంటాయి. కానీ నదుల్లో జీవించే ఈ డాల్ఫిన్లు గురించి మీకు తెలుసా? ఇవి చూడటానికి చాలా విచిత్రంగా, ప్రత్యేకంగా ఉంటాయి. ఇంతకీ ఇవి ఏ నదిలో ఉంటాయో తెలుసా? వీటికి..సముద్రంలో ఉన్న డాల్ఫిన్లకు మధ్య తేడా ఏంటీ?

2 Min read
Author : Nandini Arava
Published : Sep 23 2026, 06:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పింక్ డాల్ఫిన్లు కనిపించే ఏకైక నది ఏదో తెలుసా?
Image Credit : gemini ai

పింక్ డాల్ఫిన్లు కనిపించే ఏకైక నది ఏదో తెలుసా?

డాల్ఫిన్స్‌ సముద్రంలో మాత్రమే ఉంటాయనుకుంటాం. కానీ చాలా మందికి నదుల్లో ఉండే డాల్ఫిన్లు గురించి తెలియదు. వీటిని మరెక్కడా చూడరు కూడా. అసలు ఇవి ఎక్కడ ఉంటాయి? వీటికి..సముద్రంలో ఉన్న డాల్ఫిన్లకు మధ్య తేడా ఏంటీ?

వీటిని పింక్ డాల్ఫిన్స్ అంటారు. ఇవి దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో కనిపిస్తాయి. వీటిని అమెజాన్ రివర్ డాల్ఫిన్ లేదా బోటో అని పిలుస్తారు. సముద్రాల్లో కాకుకండా మంచినీటి నదులు, ఉపనదులు, వరదల సమయంలో ఏర్పడే నీటి ప్రాంతాలు, సరస్సుల్లో జీవిస్తాయి. బ్రెజిల్ లోని అమెజాన్ బేసిన్ లోనూ వీటి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా పెరూ, కొలంబియా, బొలీవియా, ఈక్వెడార్ ప్రాంతాల్లోని నదీ వ్యవస్థల్లో కూడా ఇవి కనిపిస్తాయి. వర్షాకాలంలో నదుల్లో నీటి మట్టం పెరిగినప్పుడు అడవుల్లోని వరద ప్రాంతాలకు కూడా ఇవి చేరుకుంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇవి పుట్టుకతోనే పింక్ గా ఉంటాయా?
Image Credit : gemini ai

ఇవి పుట్టుకతోనే పింక్ గా ఉంటాయా?

పింక్ డాల్ఫిన్స్ గురించి ఉన్న ఆసక్తికరమైన విషయం వాటి రంగు. ఇవి పుట్టినప్పటి నుంచే పూర్తిగా గులాబీ రంగులో ఉండవు. చిన్న డాల్ఫిన్లు సాధారణంగా బూడిద రంగులో కనిపిస్తాయి. వయసు పెరిగే కొద్దీ వాటి చర్మం రంగులో మార్పులు వస్తాయి. వాటి చర్మం పలుచగా ఉండటం వల్ల లోపల ఉన్న రక్తనాళాల ప్రభావం బయటకు కనిపిస్తుంది. ముఖ్యంగా వయసు పెరిగిన కొన్ని డాల్ఫిన్లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అవి పింక్ లేదా గులాబీ రంగులో కనిపిస్తాయి. అయితే ప్రతి అమెజాన్ రివర్ డాల్ఫిన్ ఒకే రకమైన పింక్ రంగులో ఉండదు. కొన్ని యాష్, గులాబీ, గోధుమ రంగు మిక్సింగ్ లో కనిపిస్తాయి.

34
సముద్ర డాల్ఫిన్స్ కు భిన్నంగా ఉంటాయి
Image Credit : gemini ai

సముద్ర డాల్ఫిన్స్ కు భిన్నంగా ఉంటాయి

అమెజాన్ రివర్ డాల్ఫిన్స్ కు సముద్ర డాల్ఫిన్స్ తో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. వీటి ముక్కు పొడవుగా, సన్నగా ఉంటుంది. మెడ భాగం కూడా సముద్ర డాల్ఫిన్స్ తో పోలిస్తే ఎక్కువగా కదిలే సామర్థ్యం కలిగి ఉంటుంది. నదుల్లో చెట్లు, కొమ్మలు, మరేదైనా అడ్డం వచ్చినప్పుడు...బయటకు రాగలవు. వీటి ఆహారం...చేపలు, జలచరాలు, క్రస్టేసియన్స్ ను ఎక్కువగా తింటాయి. వీటికి నీటిలో ఆహారాన్ని గుర్తించే ఎకోలోకేషన్ వంటి ప్రత్యేక సామర్థ్యం కూడా ఉంది.

44
అమెజాన్‌లో వీటికి ఎదురవుతున్న సమస్యలు
Image Credit : our own

అమెజాన్‌లో వీటికి ఎదురవుతున్న సమస్యలు

నదుల్లో జీవించే ఈ డాల్ఫిన్స్‌కు వాటి ప్రాంతాల్లో మార్పులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. నదుల్లో కాలుష్యం, చేపల వేటలో ఉపయోగించే వలలు, మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడే శబ్దం, ఆనకట్టలు వంటి అంశాలు వీటి జీవన విధానాన్ని ప్రభావితం చేయగలవు. అమెజాన్ నదీ వ్యవస్థలో ఇవి కీలకమైన జలచరాల్లో ఒకటిగా భావిస్తారు. అందుకే వాటి నివాస ప్రాంతాలను, నదీ పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడం ముఖ్యమైన విషయం.

అందుకే పింక్ డాల్ఫిన్ అంటే కేవలం గులాబీ రంగులో కనిపించే అరుదైన జంతువు మాత్రమే కాదు. అమెజాన్ నదుల ప్రత్యేక పర్యావరణానికి ప్రతీకగా నిలిచే అద్భుతమైన జీవి. నదులు ఆరోగ్యంగా ఉంటేనే ఇలాంటి ప్రత్యేక జలచరాలు కూడా మనుగడ సాగించగలవు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snake Village: మనుషులతో కలిసి తిరిగే నాగుపాములు.. భారత్‌లోని ఈ స్నేక్ విలేజ్ గురించి మీకు తెలుసా?
Recommended image2
Monkeys Control : మీ ప్రాంతంలో కోతుల బెడద ఉందా..! ఈ ట్రిక్స్ ఫాలో అయ్యారో మీ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడవు
Recommended image3
Vande Bharat vs Amrit Bharat: వందే భారత్ vs అమృత్ భారత్ రైళ్ల మధ్య తేడాలు ఏంటి? బడ్జెట్ జర్నీకి ఏది బెస్ట్?
Related Stories
Recommended image1
Hyderabad Monthly Expenses: హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం వస్తున్నారా? మొదటి నెలలో వచ్చే ఖర్చులివే..
Recommended image2
Snakes: వానాకాలంలో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సూపర్ ట్రిక్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved