- Home
- Life
- Hyderabad Monthly Expenses: హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం వస్తున్నారా? మొదటి నెలలో వచ్చే ఖర్చులివే..
Hyderabad Monthly Expenses: హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం వస్తున్నారా? మొదటి నెలలో వచ్చే ఖర్చులివే..
Hyderabad Monthly Expenses: చాలా మంది ఉద్యోగం కోసం, ఉపాధి కోసం హైదరాబాదే వచ్చేస్తుంటారు. ఇక్కడ కెరీర్ ఉంటుందని అనుకుంటారు. అయితే జాబ్ దొరకడం ఒకెత్తైతే..నెలవారీ ఖర్చులు మెయింటైన్ చేయడం మరో ఎత్తు. అసలు మొదటి నెల ఖర్చు ఎంత అవుతుందో తెలుసా?

మొదటి నెలలో వచ్చే ఖర్చులివే...
చాలా మంది ఉద్యోగం కోసం, బతకడం కోసం హైదరాబాదే వచ్చేస్తుంటారు. ఇక్కడ కెరీర్ ఉంటుందని అనుకుంటారు. అయితే జాబ్ దొరకడం ఒకెత్తైతే..నెలవారీ ఖర్చులు మెయింటైన్ చేయడం మరో ఎత్తు. ముఖ్యంగా బయట ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చేవారికి ఇల్లు, ఫుడ్, జర్నీ, డిపాజిట్ ఖర్చులు..ఒక్కసారిగా భారంగా అనిపించవచ్చు. అందుకే ఉద్యోగంలో చేరే ముందు కనీసం మొదటి నెల బడ్జెట్ పై ఒక అంచనా ఉండటం మంచిది.
ఇంటి అద్దె, అడ్వాన్స్
హైదరాబాద్ లో మొదటి ఖర్చు వసతి. ఒంటరిగా ఇల్లు తీసుకుంటే అద్దెతో పాటు అడ్వాన్స్, మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. అయితే ఉద్యోగులు ఎక్కువగా పీజీ, హాస్టల్, షేరింగ్ ఎంచుకుంటారు. ఏరియా బట్టి పీజీకి నెలకు సుమారు రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకూ ఖర్చు అవుతుంది. సింగిల్ రూమ్ లేదా మంచి సదుపాయాలు ఉండే రూం అయితే ఇంకా ఖర్చు ఎక్కువ. మొదటి నెలలో అడ్వాన్స్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి వస్తే ఖర్చు ఒక్కసారిగా పెరిగిపోతుంది.
ఫుడ్ ఎంత
పీజీలో భోజనం అందుబాటులో లేకపోయినా, బాగా లేకపోయినా బయట తినాల్సిందే. మళ్లీ అదో ఖర్చు. రోజుకు మూడు పూటలు బయటే అంటే ఇంకా పెరిగిపోతుంది. దాదాపు రూ.9వేలకు అవుతుంది. ఇంట్లో వండుకోవడం లేదా టిఫిన్, మీల్స్ వాడుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చు.ఆఫీస్ లో క్యాంటీన్ సదుపాయం ఉంటే పొదుపు చేసుకోవచ్చు.
మొదటి నెల బడ్జెట్ ఎంత?
బట్టలు, వ్యక్తిగత అవసరాలు, మందులు, బయట టీ లేదా కాఫీ, వీకెండ్ ఖర్చులు, అత్యవసర పరిస్థితులు వంటి వాటిని కూడా బడ్జెట్‌లో ఉంచాలి. వీటి కోసం కనీసం రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ప్రత్యేకంగా కేటాయించుకోవడం ఉపయోగకరం.
మొదటి నెల బడ్జెట్ ఎంత?
అద్దె లేదా పీజీ రూ.8 వేలు, ఫుడ్ రూ.7 వేలు, ట్రాన్స్‌పోర్ట్ రూ.2,500, మొబైల్-ఇంటర్నెట్ రూ.1,000, ఇతర ఖర్చులు రూ.3 వేలుగా తీసుకుంటే నెలవారీ ఖర్చు సుమారు రూ.21,500 అవుతుంది. అయితే ఇది ఏరియా, లైఫ్ స్టైల్, వసతి సదుపాయాలను బట్టి మారవచ్చు.
ప్రయాణ ఖర్చులు
ఆఫీసు ప్రయాణం
హైదరాబాద్ లో ప్రయాణ ఖర్చు...మీరు ఉండే ఏరియా, ఆఫీసుకు వెళ్లే దూరం, బస్సు లేదా వెహికల్ ఖర్చు మీ బట్టి ఉంటుంది. మెట్రో, బస్సు అయింతే నెలలవారీ ఖర్చు తగ్గించుకోవచ్చు. సొంత వెహికల్ అయితే పెట్రోల్ కే అయిపోతుంది. క్యాబ్, ఆటోలు అయితే బడ్జెట్ పెరుగుతుంది. దగ్గరదగ్గర ప్రయాణానికే రూ.2వేల నుంచి రూ.4వేల వరకూ అవుతుంది.
మొబైల్, ఇంటర్నెట్..
ఫోన్ రీచార్జ్, ఇంటర్నెట్, ఇతర డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ల కోసం నెలకు మరో రూ.500 నుంచి రూ.1,500 వరకు ఖర్చు కావచ్చు. పీజీలో వైఫై అందుబాటులో ఉంటే ఈ ఖర్చు కొంత తగ్గుతుంది.
ముఖ్యంగా మొదటి నెలలో అడ్వాన్స్, డిపాజిట్, ఇంటి సామాన్లు, ప్రయాణం వంటి అదనపు ఖర్చులు రావచ్చు. అందుకే ఉద్యోగంలో చేరే ముందు సాధారణ నెలవారీ ఖర్చులతో పాటు అత్యవసరంగా ఉపయోగపడే కొంత మొత్తాన్ని కూడా చేతిలో ఉంచుకోవడం మంచిది. ఇలా ముందుగానే బడ్జెట్ వేసుకుంటే హైదరాబాద్‌లో కొత్త జీవితాన్ని ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్రారంభించవచ్చు.

