MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • Dancing Girl: ఆ డ్యాన్సర్ కోసం భారత్‌తో గొడవకు దిగిన పాకిస్థాన్.. ఎవరా నాట్యకారిణి?

Dancing Girl: ఆ డ్యాన్సర్ కోసం భారత్‌తో గొడవకు దిగిన పాకిస్థాన్.. ఎవరా నాట్యకారిణి?

Dancing Girl: భారత్, పాక్ మధ్య కేవలం ఒక డ్యాన్సింగ్ గర్ల్ కోసం తీవ్రంగా పోరాటం జరిగింది. ఆ డ్యాన్సర్ ఎవరు? ఆమె కోసం పాకిస్తాన్ భారత్ తో ఎందుకు గొడవకు దిగింది? ఈ గొడవంతా ఎప్పుడు జరిగింది? ఈ ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 06 2026, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
డ్యాన్సర్ కోసం గొడవ పడ్డ పాకిస్థాన్
Image Credit : Gemini AI

డ్యాన్సర్ కోసం గొడవ పడ్డ పాకిస్థాన్

స్వాతంత్య్రం వచ్చాక 1947లో భారత్, పాకిస్థాన్ విడిపోయాయి. ఆ సమయంలో చాలా ఆస్తులను పంచుకున్నాయి. భూమి, నదులు, ఇతర ఆస్తులను కూడా పంచుకున్నాయి. అయితే దేశానికి సంబంధించిన పురావస్తు వస్తువులను కూడా షేర్ చేసుకున్నాయి. అయితే వీటిని పంచుకోవడం అప్పట్లో ఒక పెద్ద సవాలుగా మారింది. సింధు లోయ నాగరికతకు చెందిన ఎన్నో వస్తువులు అప్పటికే బయటపడ్డాయి. వాటి కోసం కూడా భారత్, పాక్ మధ్య పోరాటం జరిగింది. వాటిలో సుప్రసిద్ధ ‘డ్యాన్సింగ్ గర్ల్’ కాంస్య విగ్రహం ఒకటి. దీని కోసం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్రమైన వాదనలు జరిగాయి. ఈ విగ్రహం మొహెంజొదారోలోని తవ్వకాల్లో దొరికింది. దేశ విభజన తరువాత ఆ ప్రాంతం పాకిస్థాన్‌లోకి వెళ్లడంతో ఆ విగ్రహం తమదేనని పాక్ వాదించింది. అయితే, అప్పటి భారత దౌత్యవేత్తలు, పురావస్తు నిపుణులు తెలివిగా వ్యవహరించి ఈ అరుదైన విగ్రహాన్ని భారతదేశానికి చెందేలా చేశారు. దేశ విభజన తరువాత పాకిస్థాన్, భారత్.. సుమారు 12,000 చారిత్రక కళాఖండాలను పంచుకున్నాయి. ఇందులో భాగంగా ‘ప్రీస్ట్ కింగ్’ పాకిస్థాన్‌కు వెళ్లగా, ‘డ్యాన్సింగ్ గర్ల్’ భారతదేశానికి దక్కింది. ప్రస్తుతం ఈ నాలుగు అంగుళాల విగ్రహం న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో పెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎవరు ఈ డ్యాన్సింగ్ గర్ల్?
Image Credit : Gemini AI

ఎవరు ఈ డ్యాన్సింగ్ గర్ల్?

డ్యాన్సింగ్ గర్ల్ కేవలం విగ్రహం కాదు.. దాని వెనుక ఎంతో చరిత్ర కూడా ఉంది. భారత పురావస్తు సర్వేక్షణ మాజీ డైరెక్టర్, పురావస్తు నిపుణులు ధర్మవీర్ శర్మ దీని గురించి వివరించారు. ఆయన చెబుతున్న ప్రకారం ఆ విగ్రహం నర్తకి కాదు, పురాతన కాలంలో స్త్రీల సంతానోత్పత్తికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాల గురించి ప్రచారం చేస్తున్న ఒక యువతి. ఆమె మెడలో ఉన్న మూడు గింజల మాలను 'శివలింగి' విత్తనాలుగా ఆయన చెబుతున్నారు. ప్రాచీనకాలంలో సంతాన లేమికి చికిత్సగా ఈ విత్తనాలను వాడేవారని, ఆ ఔషధాలను వాడమని ప్రచారం చేయడానికి ఈ విగ్రహాన్ని రూపొందించారని ఆయన వివరిస్తున్నారు. ఈ విగ్రహం భంగిమ నృత్యం కంటే కూడా, ఒక అవగాహన కల్పిస్తున్న మనిషిలా కనిపిస్తోందని ఆయన తెలిపారు.

Related Articles

Related image1
Mutton: గొర్రె మాంసాన్ని మటన్ అని పిలిస్తే.. మరి మేక మాంసాన్ని ఏమంటారు?
Related image2
Ghee Storage: ఇంట్లో చేసిన నెయ్యి ఏడాది పాటు తాజాగా ఉండాలంటే ఈ తప్పు మాత్రం చేయకండి
33
చారిత్రక సంపద ఇది
Image Credit : Gemini AI

చారిత్రక సంపద ఇది

తాజాగా పాఠ్యపుస్తకాలలో ఈ విగ్రహం బొమ్మలను చిత్రీకరించారు. దీంతో ఈ చారిత్రక కళాఖండాన్ని మరోసారి వార్తల్లోకి వచ్చింది. వేల ఏళ్ల నాటి ఈ చిన్న కాంస్య విగ్రహాన్ని సొంత చేసుకునేందుకు పాకిస్థాన్ చాలా ప్రయత్నం చేసింది. విగ్రహం నిజంగా డ్యాన్సర్‌దా లేక వైద్యశాస్త్రానికి సంబంధించినవారిదా? అనే చర్చ మాత్రం ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఈ ‘డ్యాన్సింగ్ గర్ల్’ కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, అది దేశ విభజన నాటి జ్ఞాపకం.. అత్యంత విలువైన వారసత్వ సంపద. దీన్ని చూడాలంటే ఢిల్లీ వెళ్లాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Tourism : నేపాల్ లో ఇండియన్స్ అత్యధికంగా సందర్శించే టూరిస్ట్ స్పాట్స్ ఇవే..
Recommended image2
Facilities in Jail : జైల్లో ఖైదీలకు బెడ్, పరుపు, దుప్పటి ఇస్తారా? స్నానానికి సబ్బు సంగతేంటి?
Recommended image3
School Bus : అమెరికా నుండి అమీర్ పేట వరకు స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకుంటాయి? టాప్ 5 సైంటిఫిక్ రీజన్స్
Related Stories
Recommended image1
Mutton: గొర్రె మాంసాన్ని మటన్ అని పిలిస్తే.. మరి మేక మాంసాన్ని ఏమంటారు?
Recommended image2
Ghee Storage: ఇంట్లో చేసిన నెయ్యి ఏడాది పాటు తాజాగా ఉండాలంటే ఈ తప్పు మాత్రం చేయకండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved