MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Mutton: గొర్రె మాంసాన్ని మటన్ అని పిలిస్తే.. మరి మేక మాంసాన్ని ఏమంటారు?

Mutton: గొర్రె మాంసాన్ని మటన్ అని పిలిస్తే.. మరి మేక మాంసాన్ని ఏమంటారు?

Mutton: ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు మొదట గుర్తొచ్చది మటన్, చికెన్ మాత్రమే. మటన్ కర్రీ అంటే ఎంతో మందికి ఇష్టం. అయితే గొర్రె మాంసాన్ని మటన్ అని ఎందుకు పిలుస్తారు? మేక మాంసాన్ని ఏమంటారు? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? 

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 05 2026, 08:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మటన్ అంటే
Image Credit : Chat GPT

మటన్ అంటే

మటన్ చికెన్ లేకుండా చాలా ఇళ్లల్లో ఆదివారం గడవదు. పండుగలు, వేడుకలుఏవైనా సరే ఇంట్లో స్పెషల్ వంటకాలు మటన్, చికెన్ తోనే తయారవుతాయి. మాంసాహారం తినడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతే. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే మరికొంచెం స్పెషల్ కూరలు ఉండాలి. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? గొర్రె మాంసాన్ని మటన్ అని ఎందుకు పిలుస్తారు? అలా అయితే మేక మాంసాన్ని ఏమంటారు? ఈ ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మటన్ వెనుక కథ
Image Credit : Getty

మటన్ వెనుక కథ

గొర్రె మాంసాన్ని మటన్ అని పిలుస్తారు? మటన్ అనేది ఒక ఫ్రెంచ్ పదం. ఇప్పుడు ఫ్రాన్స్ లో కూడా ఈ పదాన్ని వాడడం లేదు. పాత ఫ్రెంచ్ పదం అయినా మౌటన్ అనే పదం నుండి మటన్ పుట్టుకొచ్చింది. మౌటన్ అంటే గొర్రె అని అర్థం. ఫ్రెంచ్ భాష నుంచి ఇంగ్లాండులోకి ఈ పదం ప్రవేశించింది. ఫ్రెంచ్ భాష కూడా ఆంగ్లంలో కలిసిపోయాక మటన్ అనే పదం ఇంగ్లాండులో బాగా ప్రాచుర్యం అయింది. ఇది ఇప్పటికీ గొర్రె మాంసం అనే అర్ధాన్ని ఇస్తుంది. ఇక బ్రిటీషర్లు మన ఇండియాకు వచ్చి మనల్ని ఆక్రమించుకున్నాక మనకు కూడా మటన్ పదం అలవాటైపోయింది.

Related Articles

Related image1
Ghee Storage: ఇంట్లో చేసిన నెయ్యి ఏడాది పాటు తాజాగా ఉండాలంటే ఈ తప్పు మాత్రం చేయకండి
Related image2
Temple Bells: ఈ ప్రముఖ దేవాలయాల్లో గంటలు ఎవరూ కొట్టకుండానే మోగుతాయి.. ఇదొక మిస్టరీ
33
మేక మాంసాన్ని ఏమంటారు?
Image Credit : Getty

మేక మాంసాన్ని ఏమంటారు?

గొర్రె మాంసాన్ని మటన్ అంటారు సరే.. కానీ మేక మాంసాన్ని ఏమని పిలుస్తారు? దానికంటూ ఒక పదం ఉందా? సాధారణంగా మేక మాంసాన్ని ఇతర దేశాల్లో గోట్ మీట్ అని పిలుస్తూ ఉంటారు. కానీ మేక వంశాన్ని చెవాన్ అని పిలవాలి. ఇది కూడా పాత ఫ్రెంచ్ పదమే. ఇక బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో మటన్ అనే పదాన్ని వేరువేరుగా వాడుతారు. బాగా ముదిరిన గొర్రె మాంసాన్ని మటన్ అని, అదే లేత గొర్రె పిల్ల మాంసం అయితే ల్యాంబ్ అని పిలుస్తారు. అదే మేక మాంసం అయితే గోట్ మీట్ అని పిలుచుకుంటారు. మన దేశంలో మాత్రం అన్నింటికీ కలిపి ఒకటే పేరు.. అదే మటన్.

మనదేశంలో గొర్రె మాంసం కావాలన్నా మేక మాంసం కావాలన్నా మటన్ అనే అడుగుతారు. అదే తెలుగులో స్పష్టంగా అడిగితే అప్పుడు మేక మాంసం, గొర్రె మాంసం విడివిడిగా దొరుకుతుంది. మన దేశంలో ఉన్నంతకాలం మటన్ పదాన్ని ఎలా అయినా వాడొచ్చు. విదేశాలకు వెళ్తే మాత్రం కచ్చితంగా సరైన పదజాలం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Ghee: రోజూ నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
Recommended image2
Moles: మీకు ఇష్టం లేని పుట్టుమచ్చలను ఆపిల్ సిడర్ వెనిగర్‌తో తొలగించుకోవచ్చా?
Recommended image3
Hair Growth: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇందులో నిజమెంత?
Related Stories
Recommended image1
Ghee Storage: ఇంట్లో చేసిన నెయ్యి ఏడాది పాటు తాజాగా ఉండాలంటే ఈ తప్పు మాత్రం చేయకండి
Recommended image2
Temple Bells: ఈ ప్రముఖ దేవాలయాల్లో గంటలు ఎవరూ కొట్టకుండానే మోగుతాయి.. ఇదొక మిస్టరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved