Ghee Storage: ఇంట్లో చేసిన నెయ్యి ఏడాది పాటు తాజాగా ఉండాలంటే ఈ తప్పు మాత్రం చేయకండి
Ghee Storage: ఇంట్లోనే తయారుచేసుకునే నెయ్యినే దేశీ నెయ్యి అంటారు. ఇది వంటల రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఈ నెయ్యిని స్టోర్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే ఏడాది పాటూ అది తాజాగా ఉంటుంది.

నెయ్యిని నిల్వ చేయడం
నెయ్యి కొన్నదైనా, ఇంట్లో చేసినదైనా జాగ్రత్తలు పాటిస్తే ఏడాది పాటూ తాజాగా నిల్వ ఉంటుంది. చాలామంది స్వచ్ఛమైన నెయ్యి తయారుచేయడం లేదా కొనడంపై శ్రద్ధ పెడతారు, కానీ దాన్ని నిల్వ చేయడంపై మాత్రం ఆసక్తి చూపించారు. ఆ సమయంలో చేసే కొన్ని తప్పులు వల్ల. ఇలా తప్పుగా నిల్వ చేయడం వల్ల నెయ్యి రుచి, వాసన, తాజాదనం పాడైపోతాయి. నెయ్యి తాజాగా ఉండాలంటే ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకోండి.
నెయ్యిని నిల్వ చేసే పద్ధతి
నెయ్యిని సరైన పద్ధతిలో నిల్వ చేస్తేనే దాని సహజమైన సువాసన, రుచి నిలిచి ఉంటాయి. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి మూత గట్టిగా పెడితే బయటి వాసనలు నెయ్యికి పట్టవు. ఎందుకంటే ఇతర పదార్థాల వాసనలను నెయ్యి త్వరగా పీల్చుకుంటుంది. మూత గట్టిగా పెట్టకపోతే ముక్కిన వాసన వస్తుంది. తేమ, వేడి, ఎండ తగలకుండా చూసుకుంటే నెయ్యి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
నెయ్యి మరీ మెత్తగా అవ్వకుండా, గడ్డకట్టకుండా దాని సహజమైన క్రీమీ టెక్స్‌చర్‌తో ఉండాలంటే సరైన వాతావరణంలో ఉంచాలి. దుమ్ము, తేమ, ఇతర ఆహార పదార్థాలు నెయ్యిలో పడకుండా ఉండాలన్నా సరైన స్టోరేజ్ చాలా అవసరం.
ఈ తప్పులు చేయొద్దు
నెయ్యిని నిల్వ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పులు అది త్వరగా పాడయ్యేలా చేస్తుంది. నెయ్యి వాడాక చాలామంది మూతను వదులుగా పెడతారు. దీనివల్ల గాలి, తేమ లోపలికి వెళ్లి నెయ్యి తాజాదనం, సువాసన తగ్గిపోతాయి. అలాగే, తడి లేదా వాడిన స్పూన్‌తో నెయ్యి తీస్తే అది త్వరగా పాడవుతుంది. ఎప్పుడూ పొడి, శుభ్రమైన స్పూన్ మాత్రమే వాడాలి.
వంటకు సులభంగా ఉంటుందని చాలామంది స్టవ్ దగ్గరే నెయ్యి డబ్బా పెడతారు. కానీ ఆ వేడికి నెయ్యి రుచి, వాసన పాడవుతాయి. నెయ్యిని ఎప్పుడూ చల్లగా, పొడిగా ఉండే చోట పెట్టాలి. కిటికీ దగ్గర లేదా నేరుగా ఎండ తగిలే చోట పెట్టినా నెయ్యి నాణ్యత క్రమంగా తగ్గిపోతుంది.
సరైన డబ్బా వాడాలి?
నెయ్యిని నిల్వ చేసే డబ్బా కూడా చాలా ముఖ్యం. నాసిరకం ప్లాస్టిక్ డబ్బాలు నెయ్యి స్వచ్ఛతను పాడుచేయగలవు. నెయ్యిని ఎల్లప్పుడూ శుభ్రమైన గాజు లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ డబ్బాలోనే నిల్వ చేయాలి. మంచి నెయ్యిని కొనడం ఎంత ముఖ్యమో, దాన్ని సరిగ్గా దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ నెయ్యి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

