MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • అన్నీ ఉన్నాయ‌ని అహంకారం చూపితే జీవితం ఇలాగే మారుతుంది.. క‌ళ్లు తెరిపించే కాకి క‌థ‌

అన్నీ ఉన్నాయ‌ని అహంకారం చూపితే జీవితం ఇలాగే మారుతుంది.. క‌ళ్లు తెరిపించే కాకి క‌థ‌

Motivational story: మ‌నిషికి ఆస్తి, పేరు వ‌చ్చిన త‌ర్వాత ఎంతో కొంత పొగ‌రు వ‌స్తుంది. అయితే అది మితిమీరి అహంకారంగా మారితే మాత్రం జీవితంలో ఊహించ‌ని క‌ష్టాలు త‌ప్ప‌వు. అలాంటి స‌త్యాన్ని చాటి చెప్పే ఒక మంచి నీతి క‌థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 10 2026, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెట్టుపై కాకి అధికారం
Image Credit : Gemini AI

చెట్టుపై కాకి అధికారం

ఒక అడ‌విలో పెద్ద చెట్టు కొమ్మపై ఒక కాకి కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. అది చాలా గర్వంగా ఉండేది. ఆ చెట్టు తనదేనన్నట్టుగా భావించేది. ఆ చెట్టుపై ఎవ‌రినీ వాల‌నిచ్చేది కాదు. అయితే అంతలోనే ఒక కోయిల వచ్చి అదే చెట్టు మీద వాలింది. వెంటనే కాకి కోపంగా “ఇది నా చెట్టు… ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్లిపో!” అని దాన్ని గట్టిగా మందలించింది. కోయిల ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి ఒక పావురం అక్కడికి వచ్చి కూర్చుంటే, దాన్నీ అదే విధంగా తిడుతూ పంపించింది.

25
తాబేలును కూడా ఎగతాళి
Image Credit : Gemini AI

తాబేలును కూడా ఎగతాళి

చెట్టు కింద నేలపై ఒక తాబేలు మెల్లగా పాకుతూ వెళుతోంది. దాన్ని చూసిన కాకి మళ్లీ పొగరుగా మాట్లాడింది. “అయ్యో! ఇలా నెమ్మదిగా నడిస్తే నువ్వు ఎప్పటికైనా నీ గమ్యానికి చేరతావా? నన్ను చూడు… క్షణాల్లో ఆకాశంలోకి ఎగిరిపోతాను!” అని ఎగతాళి చేసింది. తాబేలు మాత్రం మౌనంగా త‌న‌మానానా తాను నెమ్మ‌దిగా న‌డుచుకుంటూ వెళ్లింది.

Related Articles

Related image1
IPL 2026: ఈసారి ఐపీఎల్ చాలా స్పెష‌ల్‌.. చ‌రిత్ర‌లోనే అతిపెద్ద సీజ‌న్‌, ఇంకా ఎన్నో మార్పులు
Related image2
ఆ రోజుల్లోనే ద‌ర్శ‌కుడు ఈ పాత్రను ఎలా డిజైన్ చేశాడ‌బ్బా.? పెద్ద సాహ‌స‌మే అని చెప్పాలి.
35
వ‌ర్షాలు లేక‌పోవ‌డంతో
Image Credit : Gemini AI

వ‌ర్షాలు లేక‌పోవ‌డంతో

అయితే ఒకానొక స‌మ‌యంలో అడ‌విలో తీవ్ర క‌ర‌వు వ‌చ్చింది. చెరువులో నీళ్ల‌న్ని ఎండిపోయాయి. తీవ్ర‌మైన దాహం వేయ‌డంతో కాకు నీళ్లు తాగడానికి అడవిలో ఎక్కడికక్కడ వెతికింది. కానీ ఎక్కడా నీరు కనిపించలేదు. చివరికి కొంచెం దూరంలో ఒక కుండ కనిపించింది. దాన్ని చూసి చాలా సంతోషించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా నీళ్లు కుండ అడుగున మాత్రమే ఉన్నాయి. అయినా అంచున కూర్చుని నీళ్లు తాగడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో బ్యాలెన్స్‌ కోల్పోయి కుండలో పడిపోయింది. నీళ్లు తాగగలిగింది కానీ బయటకు రావడం మాత్రం కష్టంగా మారింది.

45
స‌హాయం చేయ‌మంటూ అరుపులు
Image Credit : Gemini AI

స‌హాయం చేయ‌మంటూ అరుపులు

కుండలో రెక్కలు విప్పలేక కాకి చాలా భయపడింది. బయటకు ఎలా రావాలో తెలియక అరవసాగింది. అప్పుడు సమీపంలో ఉన్న కోయిల దాని అరుపు విని అక్కడికి వచ్చింది. కాకి “దయచేసి నన్ను బయటికి తీసేయి” అని వేడుకుంది. కోయిల ఎంతో ప్రయత్నించినా ఒంటరిగా కుండను కదిలించలేకపోయింది. అంతలో అక్కడికి తాబేలు వచ్చింది. కోయిల సహాయం కోరడంతో తాబేలు తన శక్తి మేరకు కుండను ముందుకు తోసింది. కుండ నేలపై పడిపోయి పగిలింది. దీంతో కాకి సురక్షితంగా బయటకు వచ్చింది.

55
కథ ఇచ్చే గొప్ప సందేశం
Image Credit : Gemini AI

కథ ఇచ్చే గొప్ప సందేశం

బయటికి వచ్చిన తర్వాత కాకి చాలా సిగ్గుపడింది. తాను ముందుగా అందరితో ఎలా ప్రవర్తించిందో గుర్తుచేసుకుంది. “నేను మీతో చాలా చెడ్డగా మాట్లాడాను. అయినా మీరు నా ప్రాణాలు కాపాడారు. నన్ను క్షమించండి” అంటూ కోయిల, తాబేలుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ క‌థ చెప్పే సందేశం ఏంటంటే.. అహంకారం మనల్ని ఒంటరిగా చేస్తుంది. వినయం మనకు మిత్రులను సంపాదిస్తుంది. మనం ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా స‌రే, ఎవ‌రినీ త‌క్కువ‌గా చూడ‌కూదు. ఎవ‌రితో ఎప్పుడు ఎలాంటి అవ‌స‌రం వ‌స్తుందో అని జీవించాల‌నే గొప్ప సందేశాన్న ఈ క‌థ అందిస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
1918 లో స్పానిష్ ప్లూ.. సరిగ్గా వందేళ్లకు కరోనా..1929 ఆర్థిక మాంద్యం.. మరి వందేళ్లకు..?
Recommended image2
Sunday: ఆదివారం పని చేస్తే జైలుకు వెళ్లాల్సిందే.. చట్టం చేసిన ప్రభుత్వం
Recommended image3
Orange City: మన దేశంలో నారింజ నగరం అని ఏ సిటీని పిలుస్తారు? అలా ఎందుకు పిలుస్తారు?
Related Stories
Recommended image1
IPL 2026: ఈసారి ఐపీఎల్ చాలా స్పెష‌ల్‌.. చ‌రిత్ర‌లోనే అతిపెద్ద సీజ‌న్‌, ఇంకా ఎన్నో మార్పులు
Recommended image2
ఆ రోజుల్లోనే ద‌ర్శ‌కుడు ఈ పాత్రను ఎలా డిజైన్ చేశాడ‌బ్బా.? పెద్ద సాహ‌స‌మే అని చెప్పాలి.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved