MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • 1918 లో స్పానిష్ ప్లూ.. సరిగ్గా వందేళ్లకు కరోనా..1929 ఆర్థిక మాంద్యం.. మరి వందేళ్లకు..?

1918 లో స్పానిష్ ప్లూ.. సరిగ్గా వందేళ్లకు కరోనా..1929 ఆర్థిక మాంద్యం.. మరి వందేళ్లకు..?

ఒక పక్క కృతిమ మేథ…ఇంకో పక్క రొటేషన్ అప్పు బతుకులు… మైబైల్ పిచ్చి.. మరో పక్క యుద్ధం…ఏదో అద్భుతం జరగాలి…వందేళ్లకు అంటే మరో రెండు మూడు ఏళ్లకు మరోసారి ప్రపంచ ఆర్థిక మాంద్యం రాకూడదంటే…

3 Min read
Author : Amarnath Vasireddy
Published : Mar 07 2026, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
"అప్పు" "డే" మి జరిగింది ??
Image Credit : META AI

"అప్పు" "డే" మి జరిగింది ??

1918 - స్పానిష్ ఫ్లూ.. వ్యాపించడం వల్ల ప్రపంచ వ్యాపితంగా 5 కోట్ల మంది చనిపోయారు .

సరిగ్గా వందేళ్లకు.. అంటే 2019 కు కరోనా తెచ్చి పెట్టారు (అవును.. అది రాలేదు .. తెచ్చి పెట్టారు. ఎందుకు తెచ్చారు అంటారా? ఐదేళ్లు వెనక్కు తిరిగి చూసుకోండి. కరోనా తరువాత జనాల అలవాట్లు మారాయి.. దాన్ని వల్ల లాభపడింది ఎవరు? ఒక్క సారిగా ప్రపంచం యాదృచ్చికంగా మారిందా లేక ప్లాన్ ప్రకారమా ? ఆలోచించండి.)

1929 - ప్రపంచ ఆర్థిక మాంద్యం.

ఏమి జరిగిందో తెలుసా?

1. అమెరికాలోనే 9000 బ్యాంకులు మూతబడ్డాయి . మిగతా బ్యాంకులు భారీ నష్టాలను చవిచూశాయి.

2. లక్షలాది మంది నిరుద్యోగులు అయ్యారు.

3. కోట్లాది మంది ఇళ్లను కోల్పోయారు. బ్యాంకు అప్పులు కట్టలేక... అద్దె కట్టలేక ఇళ్లను ఖాళీ చేసి రోడ్డున పడ్డారు. కోట్లాది మంది ఒక్కపెట్టున బీదలు అయిపోయారు.

4. వేలాది పరిశ్రమలు మూతబడ్డాయి.

5. స్టాక్ మార్కెట్ 90 శాతం విలువను కోల్పోయింది.

అప్పు ... అంటే రేపటి... నీ సంపాదనను ఈ రోజే తినేయడం.

అప్పుల సంస్కృతి మూలాన ఆ రోజుల్లో అమెరికా తీవ్రంగా నష్టపోయింది.

అప్పట్లో ఇండియా లెక్కవేరు .

నేలవిడిచి సాము చేసే సంస్కృతి లేదు.

కరవులు కాటకాల్లో బతికిన ప్రజలు .. పొదుపు ను అలవాటు చేసుకొన్నారు.

"ఏమో .. ఎప్పటికి ఏమి జరగనుందో" అని ఇంట్లో గాదెలు .. ధాన్యాన్ని నిల్వ ఉంచేవారు..గేదెలు, ఆవులు, కోళ్లు.. మెట్ట పంటలు.

ఇది కాకుండా బంగారం..

ఆ రోజుల్లో బంగారమే .. లైఫ్ ఇన్సూరెన్సు .. హెల్త్ ఇన్సూరెన్సు .. సేవింగ్స్ అకౌంట్ .. రికరింగ్ అకౌంట్.

అయినా 1929 ప్రపంచ ఆర్థిక మాంద్యం మన దేశాన్ని ముఖ్యంగా గ్రామీణ ప్రజలను బాగా ప్రభావితం చేసింది.

24
మరి ఇప్పుడో?
Image Credit : Getty

మరి ఇప్పుడో?

ప్రపంచంలో అధిక దేశాలు.. అధిక శాతం ప్రజలు అప్పులతో బతికేస్తున్నారు.

ముప్పై ఏళ్లుగా అమెరికా అప్పుల సంస్కృతిని కసిగా అలవాటు చేసుకొన్న క్రెడిట్ కార్డు.. ఆన్లైన్ క్రెడిట్.. ప్రైవేట్ వడ్డీ ... ఇండియన్స్.

బడాయికి పోయి ప్రతి ఒక్కరు తమ తాహతుకు మించి ఖర్చు చెయ్యడం.

దానికోసం .. తాతల కాలం నాటి ఆస్తుల అమ్మకం .. అది చాలదన్నట్టు అప్పులు..

రెండు రూపాయిలంటే ధర్మ వడ్డీ కింద లెక్క.

అయిదు .. ఏడు .. పది .. అప్పుల ఊబి.

ప్రస్తుతానికి రొటేషన్ జరుగుతోంది.

అది ఆగితే... గిగితే ..?

ఊహించలేము !

ఇంటిల్లి పాదీ మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్ అవుతోంది.

ఇప్పుడే ఇలా ఉంటే .. రేపు ఆర్థిక మాంద్యం వస్తే..?

Related Articles

Related image1
AI Impact Warning: AI సునామీ.. 2027 నాటికి వారి జీవితాల్లో సంక్షోభం తప్పదా? గూగుల్ మాజీ ఏమన్నారంటే?
Related image2
Gold: మ‌రో భారీ ఆర్థిక సంక్షోభం.. గోల్డ్, సిల్వ‌ర్ దాచుకోండి.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత కియోసాకి హెచ్చ‌రిక‌లు
34
ఆర్థికం మాంద్యం రాకుండా ఉండాలంటే అద్భుతం జరగాలి...
Image Credit : X

ఆర్థికం మాంద్యం రాకుండా ఉండాలంటే అద్భుతం జరగాలి...

మొబైల్ ఫోన్ వల్ల మెదడులో మార్పులు వచ్చి జనాలకు ఇంగిత జ్ఞానం చచ్చింది .

ఏది మంచి ఏది చెడు.. అని గ్రహించలేని స్థాయికి అధిక జనాభా చేరుకొంది.

కరోనా టైంలో ఒక దొంగ మందు ... అది పని చేస్తుంది అని నమ్మించి .. దానికి కృతిమ కొరత సృష్టించి బ్లాక్ లో లక్షల్లో అమ్మి.. చాల చోట్ల మినరల్ వాటర్ ను నింపి. ఇదే ఆ అద్భుత మందు అని నమ్మించి... గోడౌన్ ల నిండా నోట్ల కట్టలు నింపుకొని కులుకుతున్న కేటుగాళ్లున్న సమాజం మనది.

ఇరాన్ యుద్ధాన్ని అప్పుడే సొమ్ము చేసుకొంటున్నారు కొంతమంది.. కృతిమ డీజిల్ కొరతలు .. భయం కొలిపే వార్తలు .. ఇంకా చాలా..

ఒక పక్క కృతిమ మేథ...

ఇంకో పక్క రొటేషన్ అప్పు బతుకులు..

మైబైల్ పిచ్చి .. మరో పక్క యుద్ధం.

ఏదో అద్భుతం జరగాలి.

వందేళ్లకు అంటే మరో రెండు మూడు ఏళ్లకు మరో సారి ప్రపంచ ఆర్థిక మాంద్యం రాకూడదు.

మొబైల్ పిచ్చి పట్టి ఇంగిత జ్ఞానం కోల్పోయినవారికి ఈ పోస్ట్ సంచలనం కోసం.. జనాల్ని భయపెట్టే విధంగా రాసినట్టు కనిపించవచ్చు.

అది మామూలే.

ఇంకా ఇంగిత ఙ్ఞానం మిగిలున్న వారికి వందనాలు..

కీడెంచి .. మేలెంచాలి.. అన్నారు పెద్దలు .

దేనికైనా సిద్ధంగా ఉండాలి .

44
సంక్షోభం నుండి భయటపడే మార్గాలు..
Image Credit : freepik

సంక్షోభం నుండి భయటపడే మార్గాలు..

1 . కసిగా పొదుపు చెయ్యండి.. విలాసాలు వద్దు .

2 . అప్పు చెయ్యొద్దు... అప్పు ఇవ్వొద్దు.

3 . చేతిలోని డబ్బుతో బంగారం కొనండి.

4. పిల్లలతో సమయం గడపండి. కృతిమ మేథ యుగంలో రాణించాలంటే మానవ నైపుణ్యాలు అవసరం. అవి నేర్పండి. కష్టం తెలిసేలా పిల్లల్ని పెంచండి. సుఖాలకు వారిని బానిసల్ని చెయ్యొద్దు. బడాయిలు నేర్పద్దు. కష్టకాలం వస్తే దాన్ని వారు తట్టు కోవాలి. నిలబడాలి. పోరాడాలి. జయం సాదించాలి.

5 . రేయి తరువాత పగలు .. చీకటి తరువాత వెలుగు .. ఇది ప్రకృతి న్యాయం. 1929 లో మొదలయిన ప్రపంచ ఆర్థిక మాంద్యం 1933 కు ముగిసింది. ఈ రోజు మనం భూమిపై ఉన్నాము అంటే మన పూర్వీకులు.. తాత ముతాత్తలు ఆ బాధల కొలిమిని దాటుకొని వచ్చారు. వారికి జోహార్లు. వారి స్పూర్తితో మనం సాగాలి.

6. మనిషి తప్పిదాలు చేసుకొంటూ పొతే. చివరకు ప్రకృతి రంగప్రవేశం చేస్తుంది.

అన్నింటినీ చక్క పెడుతుంది .

నేచర్ కరెక్షన్ చేసేదాకా తెచ్చుకోవద్ద.

దాని కరెక్షన్ మామూలుగా ఉండదు .

వందేళ్లకు చరిత్ర పునరావృతం కాకూడదు అని ఆశిద్దాము.

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
స్టాక్ మార్కెట్
కరోనా వైరస్
పర్సనల్ పైనాన్స్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sunday: ఆదివారం పని చేస్తే జైలుకు వెళ్లాల్సిందే.. చట్టం చేసిన ప్రభుత్వం
Recommended image2
Orange City: మన దేశంలో నారింజ నగరం అని ఏ సిటీని పిలుస్తారు? అలా ఎందుకు పిలుస్తారు?
Recommended image3
Motivational Quotes: మీ కథలో మీరే హీరో.. ఒక్క ఓటమితో జీవితం ఆగిపోదు, నిరాశ పడకండి
Related Stories
Recommended image1
AI Impact Warning: AI సునామీ.. 2027 నాటికి వారి జీవితాల్లో సంక్షోభం తప్పదా? గూగుల్ మాజీ ఏమన్నారంటే?
Recommended image2
Gold: మ‌రో భారీ ఆర్థిక సంక్షోభం.. గోల్డ్, సిల్వ‌ర్ దాచుకోండి.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత కియోసాకి హెచ్చ‌రిక‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved