MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • Indian Railways: ట్రైన్‌లో లగేజ్ పోతే రైల్వేనే డబ్బులిస్తుందా? ఈ షాకింగ్ రూల్ మీకు తెలుసా !

Indian Railways: ట్రైన్‌లో లగేజ్ పోతే రైల్వేనే డబ్బులిస్తుందా? ఈ షాకింగ్ రూల్ మీకు తెలుసా !

Indian Railways: మీ బ్యాగ్ ట్రైన్‌లో పోయిందా? కంగారు పడకండి.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలి బ్యాగ్ చోరీ అయిన కేసులో రైల్వే శాఖను రూ.80 వేల పరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇస్తూ వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 05 2026, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మీ బ్యాగ్ ట్రైన్‌లో పోయిందా? కంగారు పడకండి
Image Credit : Chatgpt

మీ బ్యాగ్ ట్రైన్‌లో పోయిందా? కంగారు పడకండి

ట్రైన్ జర్నీలో మీ సామాన్లు జాగ్రత్త అని బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మీ సామాన్లు చోరీకి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారు? సరిగ్గా ఇలాంటి ఒక సంఘటనే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. 2021 డిసెంబర్ 14న ఒక మహిళ తన భర్త, పిల్లవాడితో కలిసి రాజధాని ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నంబర్ 12423) 3AC కోచ్‌లో ప్రయాణిస్తోంది. రైలు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ (ముగల్ సరాయ్) రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో, ఆ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ కనిపించకుండా పోయినట్లు గుర్తించింది. ఆ బ్యాగ్‌లో సుమారు 15 గ్రాముల బంగారు మంగళసూత్రం, రూ.5,000 నగదు, ఎస్‌బీఐ పాస్‌బుక్ ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం.. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు
Image Credit : Pixabay

ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం.. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు

బ్యాగ్ పోయిందని తెలిసిన వెంటనే ప్రయాణికులు కోచ్ అటెండెంట్ కోసం వెతికారు. అయితే ఆ సమయంలో అటెండెంట్ తన విధి నిర్వహణలో లేడు. దీంతో బాధితురాలి భర్త వెంటనే రైలులో ఉన్న ఆర్‌పీఎఫ్ ఎస్కాట్, టీటీఈ లను కలిసి విషయాన్ని తెలియజేశారు. డిసెంబర్ 16, 2021న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత బాధితులు అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును జీఆర్‌పీ కాన్పూర్ సెంట్రల్‌కు బదిలీ చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పోయిన సామాన్లు మాత్రం దొరకలేదు. దాంతో విసిగిపోయిన బాధితులు రైల్వే సేవా లోపంపై పఠాన్‌కోట్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు.

Related Articles

Related image1
How To Identify Fake Liquor: నకిలీ, కల్తీ మందును ఎలా గుర్తుపట్టాలో తెలుసా? ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసం
Related image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
35
రైల్వే వాదనను తోసిపుచ్చిన వినియోగదారుల కమిషన్
Image Credit : Gemini AI

రైల్వే వాదనను తోసిపుచ్చిన వినియోగదారుల కమిషన్

ఈ కేసు విచారణ సమయంలో రైల్వే శాఖ విచిత్రమైన వాదనలను వినిపించింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ మాస్టర్‌కు దొంగతనం గురించి సమాచారం ఇవ్వలేదని రైల్వే పేర్కొంది. అలాగే, బుక్ చేయని లగేజ్ చోరీకి గురైతే సుప్రీంకోర్టు పాత తీర్పుల ప్రకారం రైల్వేకు ఎలాంటి సంబంధం ఉండదని వాదించింది. అయితే, ప్రయాణ సమయంలోనే ఆర్‌పీఎఫ్ ఎస్కాట్‌కు ప్రయాణికులు సమాచారం ఇచ్చారని రైల్వే సొంత రికార్డుల్లోనే నమోదై ఉందని వినియోగదారుల కమిషన్ గుర్తించింది. దీని ద్వారా రైల్వే వాదన తప్పు అని నిరూపితమైంది. బాధితులు ప్రయాణం ముగియగానే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చోరీకి గురైన బంగారు మంగళసూత్రం కొనుగోలు రసీదులను కూడా సాక్ష్యంగా సమర్పించారని కోర్టు తెలిపింది.

45
కోచ్ అటెండెంట్ నిర్లక్ష్యం.. పెరిగిన జరిమానా
Image Credit : ANI

కోచ్ అటెండెంట్ నిర్లక్ష్యం.. పెరిగిన జరిమానా

ఘటన జరిగిన సమయంలో కోచ్ అటెండెంట్ తన సీటులో లేడని ప్రయాణికులు చేసిన ఆరోపణలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. కోచ్ అటెండెంట్ విధుల్లోనే ఉన్నాడని నిరూపించడానికి రైల్వే ఎలాంటి డ్యూటీ రోస్టర్ లేదా రికార్డులను కోర్టు ముందు ఉంచలేకపోయింది. సెక్యూరిటీ విషయంలో రైల్వే తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, అవసరమైన ఆధారాలు చూపించడంలో విఫలమైందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఉత్తర రైల్వే సేవా లోపానికి పాల్పడిందని పఠాన్‌కోట్ జిల్లా వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది.

55
రూ.80 వేల పరిహారంతో పాటు వడ్డీ చెల్లించాలని ఆదేశం
Image Credit : Gemini

రూ.80 వేల పరిహారంతో పాటు వడ్డీ చెల్లించాలని ఆదేశం

రైల్వే శాఖ నిర్లక్ష్యానికి గాను బాధితులకు రూ.70,000 పరిహారంగా చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. దీంతో పాటు మానసిక వేదన, వేధింపులకు గురిచేసినందుకు మరో రూ.10,000 చెల్లించాలని చెప్పింది. కేసు నమోదైన తేదీ నుంచి ఈ మొత్తాన్ని చెల్లించే వరకు ఏడాదికి 6 శాతం చొప్పున వడ్డీ కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకవేళ తీర్పు ప్రతి వచ్చిన నెల రోజుల్లోగా ఈ డబ్బులు చెల్లించకపోతే, మొత్తం సొమ్ముపై 12 శాతం వార్షిక వడ్డీ అమలవుతుందని కమిషన్ కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా బుక్ చేయని లగేజ్ పోతే రైల్వే పరిహారం ఇవ్వదు. కానీ రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం, రక్షణ లోపం నిరూపితమైతే మాత్రం ప్రయాణికులకు నష్టపరిహారం లభిస్తుందని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Science Facts : తొమ్మిది కాదు ఎనిమిదే గ్రహాలు.. ప్లూటోను గ్రహాల లిస్ట్ లోంచి ఎందుకు తొలగించారు?
Recommended image2
Psychology: మీ మంచితనాన్ని ఎవరైనా వాడుకుంటున్నారా? ఈ 5 సైకాలజీ ట్రిక్స్‌తో తెలుసుకోండి!
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Related Stories
Recommended image1
How To Identify Fake Liquor: నకిలీ, కల్తీ మందును ఎలా గుర్తుపట్టాలో తెలుసా? ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసం
Recommended image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved