MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Long Life Secrets: ప్రపంచంలో ఆ 5 చోట్ల మనుషులు వందేళ్లు ఎలా బతుకుతున్నారు? సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్

Long Life Secrets: ప్రపంచంలో ఆ 5 చోట్ల మనుషులు వందేళ్లు ఎలా బతుకుతున్నారు? సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్

Long Life Secrets: జిమ్ లేదు.. మాయా మందులు లేవు.. అయినా ఇక్కడ 100 ఏళ్లు బతుకుతున్నారు. జిమ్, ఖరీదైన మందులు లేకుండానే 100 ఏళ్లకు పైగా జీవిస్తున్న మనుషుల లైఫ్‌స్టైల్ సీక్రెట్స్, ప్రపంచంలోని టాప్ 5 ‘బ్లూ జోన్స్’ గురించిన ఆసక్తికర విశేషాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 02 2026, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జిమ్ లేదు.. మాయా మందులు లేవు.. అయినా 100 ఏళ్లు ఎలా బతుకుతున్నారు?
Image Credit : Getty

జిమ్ లేదు.. మాయా మందులు లేవు.. అయినా 100 ఏళ్లు ఎలా బతుకుతున్నారు?

ప్రతి ఒక్కరికీ వందేళ్లు హాయిగా, ఆరోగ్యంగా బతకాలని ఉంటుంది. ముసలితనం వచ్చినా కూడా యవ్వనంలో ఉన్నంత యాక్టివ్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ, ఈ రోజుల్లో అది అందరికీ సాధ్యం కావడం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల రోగాలు చుట్టుముట్టేస్తున్నాయి. లేదంటే మనిషి నీరసపడిపోతున్నాడు.

కానీ, ప్రపంచంలో కొందరు మాత్రం 100 ఏళ్లు దాటినా కూడా అస్సలు తగ్గట్లేదు. ఏ రోగాలూ లేకుండా, ఎవరి సాయం లేకుండా తమ పనులు తామే చేసుకుంటూ ఫుల్ ఫిట్‌గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇది ఎలా సాధ్యం? వందేళ్లకు పైగా హెల్దీగా బతకాలంటే ఏదైనా స్పెషల్ కంట్రీలో ఉండాలా? లేదంటే ఏవైనా మాయా మందులు మింగాలా? ఇలాంటి డౌట్స్‌తోనే సైంటిస్టులు చాలా కాలంగా రీసెర్చ్ చేస్తున్నారు. ఈ రీసెర్చ్‌లలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
316 ఏళ్ల వయసు.. గిన్నిస్ రికార్డ్ సాధించిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
Image Credit : Gemini

316 ఏళ్ల వయసు.. గిన్నిస్ రికార్డ్ సాధించిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు

బ్రెజిల్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వీళ్ల ముగ్గురి వయసు 100 ఏళ్లు దాటిపోయింది. వీళ్లపై సైంటిస్టులు రీసెర్చ్ చేసినప్పుడు మన రోజువారీ లైఫ్‌స్టైల్‌కు కనెక్ట్ అయ్యే ఎన్నో విషయాలు తెలిశాయి. ఆ ముగ్గురి పేర్లు.. జులినా డి డ్యూస్ నునెస్ (103 ఏళ్లు), జోరైడ్ డి డ్యూస్ మోటా (104 ఏళ్లు), లెవిటా డి డ్యూస్ నునెస్ (109 ఏళ్లు). ఈ ముగ్గురి వయసును కలిపితే మొత్తం 316 ఏళ్లు.

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం బతికిన అక్కాచెల్లెళ్లుగా వీరు గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. ఈ వయసులో చాలామంది మంచానికే పరిమితమై, చివరి రోజులు లెక్కిస్తూ ఉంటారు. కానీ, వీరు మాత్రం ఎలాంటి రోగాలూ లేకుండా హ్యాపీగా ఉన్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే.. వాళ్లు తినే తిండి, వాళ్ల యాక్టివ్ లైఫ్‌స్టైల్ వల్లేనట. దాన్నే వాళ్లు లైఫ్ మంత్రంగా మార్చుకున్నారు.

Related Articles

Related image1
Astronomy Crisis: అంతరిక్షంలో మస్క్ మాఫియా? 17 లక్షల శాటిలైట్లతో చీకటి మాయం..! భారీ ముప్పు తప్పదా?
Related image2
IRCTC Tourism : ఒక్కసారైనా ఈ రైళ్లలో జర్నీ చేయాల్సిందే.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీల లిస్ట్ ఇదిగో !
36
దీర్ఘాయువుకు అసలైన కారణాలు ఇవే..
Image Credit : Getty

దీర్ఘాయువుకు అసలైన కారణాలు ఇవే..

సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు వందేళ్లు దాటడానికి స్ట్రాంగ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒక కారణం. అయితే కేవలం జీన్స్ మాత్రమే కాదు, లైఫ్‌స్టైల్‌లో మార్పులు కూడా అంతే ముఖ్యం. తాము ఇంతకాలం బతకడానికి హెల్దీ డైట్, యాక్టివ్ లైఫ్‌స్టైలే కారణమని వాళ్లు చెబుతున్నారు. జులినా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. తాము చిన్నప్పుడు నదుల్లో ఈత కొట్టేవాళ్లమని, చేపలు పడుతూ టైమ్ గడిపేవాళ్లమని చెప్పింది.

పైగా వీరంతా చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేశారు. లెవిటా ఒక క్రాఫ్ట్స్ ఉమన్‌గా, ఆ తర్వాత టెలివిజన్ నెట్‌వర్క్‌లో పనిచేశారు. జోరైడ్ నర్స్‌గా చేస్తూ ఐదుగురు పిల్లల్ని పెంచారు. జులినా హౌస్‌వైఫ్‌గా ఉంటూ ఆరుగురు పిల్లల్ని చూసుకున్నారు. లెవిటా తన జీవితాన్ని ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా హ్యాపీగా చూసుకుంటారు.

46
ప్రాసెస్డ్ ఫుడ్‌కు నో.. సింపుల్ డైట్‌కు ఎస్
Image Credit : Getty

ప్రాసెస్డ్ ఫుడ్‌కు నో.. సింపుల్ డైట్‌కు ఎస్

మన పేరెంట్స్ ఎక్కువ కాలం బతికితే, పిల్లలు కూడా ఎక్కువ కాలం బతుకుతారని జనరల్ టాక్ ఉంటుంది. సైంటిస్టులు కూడా ఈ మాటలో కొంత నిజం ఉందని చెబుతున్నారు. రీసెర్చ్ ప్రకారం.. 100 ఏళ్లకు పైగా బతికే ఛాన్స్‌లో జీన్స్ పాత్ర 20 నుండి 30 శాతం మాత్రమే ఉంటుంది. మిగిలిన 70-80 శాతం అంతా మన లైఫ్‌స్టైల్, వాతావరణం, హెల్త్ కేర్, ఇంకా మన అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. అంటే మంచి జీన్స్ హెల్ప్ అవుతాయి, కానీ అవి మాత్రమే సరిపోవు.

ఎక్కువ కాలం బతకాలంటే మంచి తిండి చాలా అవసరం. లాంగ్ లైఫ్ కావాలంటే భోజనం చాలా సింపుల్‌గా ఉండాలి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ప్లేట్‌లో ఎక్కువ కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు ఉండాలి. నాన్ వెజ్ లిమిట్‌గా తినాలి. అలాగే చాలామంది ఆకలి కంటే కొంచెం తక్కువ తింటారు. బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు ఇస్తే రోగాలు వస్తాయని సైంటిస్టుల చెబుతున్నారు.

56
లైఫ్‌స్టైల్‌లో వెంటనే మార్చాల్సిన విషయాలు ఇవే
Image Credit : Getty

లైఫ్‌స్టైల్‌లో వెంటనే మార్చాల్సిన విషయాలు ఇవే

పాతకాలంలో ఎవరూ జిమ్‌లకు వెళ్లేవారు కాదు. రోజూ ఇంట్లో పనులు, పొలం పనులు చేసుకునేవారు. ఎక్కువగా నడిచేవారు, మెట్లు ఎక్కేవారు. దీనివల్ల వాళ్ల బాడీ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేది. అందుకే వాళ్లు ఎక్కువ కాలం బతికారు. దీనితో పాటు, వందేళ్లు బతికే వాళ్లలో స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చాలా బాగుంటుందని సైంటిస్టులు గుర్తించారు.

అంటే వాళ్ల లైఫ్‌లో ప్రాబ్లమ్స్ లేవని కాదు, సమస్యలు అందరికీ ఉంటాయి. కానీ వాళ్లు స్ట్రెస్‌ను మైండ్‌కు ఎక్కించుకోలేదు. ఒత్తిడి తగ్గించుకోవడానికి కొందరు ప్రార్థనలు చేస్తే, మరికొందరు మెడిటేషన్ చేసేవారు. ఇంకొందరు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తే, మరికొందరు ప్రకృతి మధ్య గడిపేవారు. అందుకే వాళ్లకు రోగాలు తక్కువగా వచ్చేవి.

66
ప్రపంచంలోని ఆ 5 బ్లూ జోన్స్ ఏవి?
Image Credit : Getty

ప్రపంచంలోని ఆ 5 బ్లూ జోన్స్ ఏవి?

ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణ జనాభా కంటే చాలా ఎక్కువ మంది 100 ఏళ్లపైగా బతుకుతున్నారని సైంటిస్టులు గుర్తించారు. ఈ ఏరియాలను బ్లూ జోన్స్ అని పిలుస్తారు. సైంటిస్టులు గుర్తించిన ఆ 5 ప్రాంతాలు..

1. ఓకినావా – జపాన్

2. సార్డీనియా – ఇటలీ

3. ఇకారియా – గ్రీస్

4. నికోయా – కోస్టారికా

5. లోమా లిండా – అమెరికా

ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్ల కల్చర్ వేరైనా.. వాళ్ల లైఫ్‌స్టైల్‌లో మాత్రం చాలా పోలికలు ఉన్నాయి. ముసలితనం వెనుక ఉన్న అన్ని రహస్యాలను సైన్స్ ఇప్పటికీ పూర్తిగా కనిపెట్టలేకపోయింది. ప్రతి ఏడూ కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు తేలింది ఒక్కటే.. లాంగ్ లైఫ్ కోసం ఎలాంటి మాయా ఫార్ములా లేదు. మనం రోజూ తీసుకునే చిన్న చిన్న మంచి నిర్ణయాలే మనల్ని వందేళ్ల కాలం ఆరోగ్యంగా ఉంచుతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
ఆహారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Tourism : ఒక్కసారైనా ఈ రైళ్లలో జర్నీ చేయాల్సిందే.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీల లిస్ట్ ఇదిగో !
Recommended image2
First Petrol Bunk: మన దేశంలో మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఇదే.. అప్పట్లో పెట్రోల్‌ను వాహనాల్లో ఎలా నింపేవారో తెలుసా?
Recommended image3
Psychology: సైకాలజీ ప్రకారం మనిషి నిజ స్వరూపం బయటపడే 5 సందర్భాలు ఇవే..!
Related Stories
Recommended image1
Astronomy Crisis: అంతరిక్షంలో మస్క్ మాఫియా? 17 లక్షల శాటిలైట్లతో చీకటి మాయం..! భారీ ముప్పు తప్పదా?
Recommended image2
IRCTC Tourism : ఒక్కసారైనా ఈ రైళ్లలో జర్నీ చేయాల్సిందే.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీల లిస్ట్ ఇదిగో !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved