MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • IRCTC Tourism : ఒక్కసారైనా ఈ రైళ్లలో జర్నీ చేయాల్సిందే.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీల లిస్ట్ ఇదిగో !

IRCTC Tourism : ఒక్కసారైనా ఈ రైళ్లలో జర్నీ చేయాల్సిందే.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీల లిస్ట్ ఇదిగో !

IRCTC Tourism Packages: రైల్లో రాచభోగాలు.. తక్కువ బడ్జెట్ నుండి లగ్జరీ టూర్ల వరకు ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్స్ తో క్రేజీ టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విదేశాలు వేస్ట్ అనేలా.. మన ఇండియాలోనే ఉన్న ఈ టాప్ 5 రైల్వే జర్నీల గురించి తెలుసా?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 02 2026, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐఆర్‌సీటీసీ: భారత్ గౌరవ్ నుండి లగ్జరీ మహారాజా ఎక్స్‌ప్రెస్ వరకు.. బెస్ట్ ట్రైన్ జర్నీలు ఇవే
Image Credit : Gemini

ఐఆర్‌సీటీసీ: భారత్ గౌరవ్ నుండి లగ్జరీ మహారాజా ఎక్స్‌ప్రెస్ వరకు.. బెస్ట్ ట్రైన్ జర్నీలు ఇవే

భారతదేశాన్ని సరికొత్తగా, మునుపెన్నడూ చూడని విధంగా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ (IRCTC) టూరిజం మీకోసం అదిరిపోయే ఆఫర్లను తీసుకువచ్చింది. తక్కువ ధరలోనే ఆన్‌లైన్ ప్యాకేజీ బుకింగ్స్ అందిస్తూ, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఇండియన్ రైల్వేస్ అద్భుతమైన ప్రయాణ అనుభూతులను మీకు అందిస్తోంది.

సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీతో పాటు, లైఫ్‌టైమ్ గుర్తుండిపోయే మెమొరీస్ అందించేలా ఈ ప్యాకేజీలను డిజైన్ చేశారు. ఇండియాలోని ఫేమస్ సిటీస్, ఆధ్యాత్మిక ప్రాంతాలు, ప్రకృతి అందాలను తక్కువ ధరలోనే చుట్టేయడానికి ఇదో సూపర్ ఛాన్స్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
Image Credit : IRCTC

1. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు

మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలు, పండుగలు, వివిధ ప్రాంతాల వంటకాలను ప్రతిబింబించేలా ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను' ప్రారంభించింది. ఈ రైలు కోచ్‌లను "ప్రైడ్ ఆఫ్ ఇండియా - భారత్ గౌరవ్" థీమ్‌తో అద్భుతంగా డిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్‌తో పాటు ఏసీ కోచ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అందరి బడ్జెట్‌కు ఇది సెట్ అవుతుంది.

ఈ ప్యాకేజీ తీసుకుంటే రైలు ప్రయాణంతో పాటు బస్సుల్లో లోకల్ టూర్స్, హోటల్ వసతి, టూర్ గైడ్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇంకా వేడివేడిగా లోకల్ వంటకాలను అందించే ప్యాంట్రీ కార్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మన దేశాన్ని చుట్టేయడానికి దీనికంటే బెస్ట్ ఆప్షన్ లేదని చెప్పవచ్చు.

36
2. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ లగ్జరీ రైలు
Image Credit : Gemini AI

2. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ లగ్జరీ రైలు

రాజభవనాన్ని తలపించే రైల్లో, రాయల్ లుక్‌తో ప్రయాణించాలనుకుంటే 'మహారాజాస్ ఎక్స్‌ప్రెస్' పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ లగ్జరీ రైల్లో ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ సర్వీసెస్, అద్భుతమైన లొకేషన్స్ చూసే అవకాశం లభిస్తుంది. దేశంలోని విభిన్న ప్రాంతాలను కవర్ చేస్తూ ఇందులో నాలుగు రకాల స్పెషల్ రూట్లు ఉన్నాయి. వైల్డ్‌లైఫ్ సెంచరీల నుండి వైబ్రెంట్ సిటీస్ వరకు అన్నింటినీ ఇందులో చూడొచ్చు.

ఈ రైల్లోని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లలో తాజా లోకల్ ఐటమ్స్‌తో చేసిన రుచికరమైన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఏసీతో కూడిన లగ్జరీ క్యాబిన్లు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే స్టాఫ్, లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ వంటి ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.

46
3. బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్
Image Credit : stockPhoto

3. బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్

భారతదేశంలో బౌద్ధ పర్యాటకాన్ని ప్రమోట్ చేయడానికి ఐఆర్‌సీటీసీ ఈ స్పెషల్ ట్రైన్‌ను నడుపుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకునే వారికి, గౌతమ బుద్ధుని జీవిత విశేషాలను తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ టూర్ ప్యాకేజీలో బౌద్ధమతానికి సంబంధించిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు, కట్టడాలను సందర్శించవచ్చు.

ఈ రైలు గయ, రాజ్‌గిర్, నలంద, వారణాసి, సార్నాథ్, లుంబిని (నేపాల్), కుశీనగర్, శ్రావస్తి, ఆగ్రా వంటి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తుంది. ప్రాచీన భారతదేశ వైభవాన్ని, బౌద్ధమత చరిత్రను క్లోజ్‌గా చూడాలనుకునే పర్యాటకులు, ఆధ్యాత్మిక అన్వేషకులు ఐఆర్‌సీటీసీ బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలును ఎంచుకోవచ్చు.

56
4. గోల్డెన్ చారియట్ ట్రైన్ జర్నీ
Image Credit : Pixabay

4. గోల్డెన్ చారియట్ ట్రైన్ జర్నీ

సౌత్ ఇండియా అందాలను లగ్జరీగా, స్టైలిష్‌గా చూడాలనుకుంటే 'గోల్డెన్ చారియట్' రైలు ప్రయాణం ది బెస్ట్ అని చెప్పొచ్చు. బెంగుళూరులో సాంప్రదాయ సంగీతం, నృత్య ప్రదర్శనలతో ఈ ప్రయాణం గ్రాండ్‌గా స్టార్ట్ అవుతుంది. కొచ్చిన్, మైసూర్ వంటి నగరాలతో పాటు హంపి, మహాబలిపురం లాంటి అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను ఈ టూర్ ద్వారా సందర్శించవచ్చు.

ఈ రైల్లో రుచి, నలపాక అనే రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి వరల్డ్ క్లాస్ వంటకాలతో పాటు ఇండియన్ స్పెషల్స్ అందిస్తాయి. అలాగే మదిర బార్‌లో బెస్ట్ వైన్స్, స్పిరిట్స్ దొరుకుతాయి. ప్రయాణంలో అలసట పోగొట్టుకోవడానికి ఆరోగ్య పేరుతో స్పా అండ్ ఫిట్నెస్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ సాంప్రదాయ ఆయుర్వేద స్పా థెరపీలు అందుబాటులో ఉంటాయి.

66
5. టాయ్ ట్రైన్ జర్నీ
Image Credit : gemini

5. టాయ్ ట్రైన్ జర్నీ

భారతీయ పల్లెలు, పచ్చని పొలాలు, కొండ కోనలు, పురాతన దేవాలయాల మధ్య గుండా సాగే టాయ్ ట్రైన్ ప్రయాణం ఒక అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది. కిటికీ పక్కన కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదించడం నిజంగా ఒక విభిన్నమైన అనుభూతి. ఉత్తరాన ఉన్న హిమాలయాల నుండి దక్షిణాన ఉన్న నీలగిరి కొండల వరకు దేశంలో ఎన్నో ఫేమస్ టాయ్ ట్రైన్ రూట్లు ఉన్నాయి.

మన దేశంలో తప్పక విజిట్ చేయాల్సిన ముఖ్యమైన టాయ్ ట్రైన్ జర్నీలు ఇవే:

• డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, పశ్చిమ బెంగాల్

• కల్కా-షిమ్లా రైల్వే, హిమాచల్ ప్రదేశ్

• నీలగిరి మౌంటైన్ రైల్వే, తమిళనాడు

• మాథెరన్ హిల్ రైల్వే, మహారాష్ట్ర

• కాంగ్రా వ్యాలీ రైల్వే, హిమాచల్ ప్రదేశ్

భారతదేశపు అద్భుతమైన సంస్కృతిని, ప్రకృతిని దగ్గరగా చూడటానికి ఈ టాయ్ ట్రైన్ ప్రయాణాలను అస్సలు మిస్ అవ్వకండి. తాజా ప్యాకేజీలు, ధరలు, ఆఫర్ల పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ను సంప్రదించండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Recommended image2
BRICS: బ్రిక్స్ సదస్సులో మోదీ వరుస భేటీలు.. దేశ భ‌విష్య‌త్తును మార్చే ఒప్పందాలు
Recommended image3
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
Related Stories
Recommended image1
SIP Investment: రూ. 21,250తో కోటీశ్వరుడు అవ్వొచ్చు.. 8-4-3 సీక్రెట్ రూల్ తెలుసా?
Recommended image2
Amazon Prime Day Sale: కంటెంట్ క్రియేటర్స్ కు పండగే.. వ్లాగింగ్ కెమెరాలపై 54% వరకు భారీ డిస్కౌంట్స్ ! అమెజాన్ టాప్ 5 డీల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved