Fact: బీర్, విస్కీ... శాఖాహారమా? మాంసాహారమా? ఈ అనుమానం మీకూ ఎప్పుడైనా వచ్చిందా.
మద్యం ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయినా మద్యం బాబులు మాత్రం ఈ అలవాటును మారుకోరు. కాగా విస్కీ, బీర్ లాంటి డ్రింక్స్ శాఖాహారమా లేక మాంసాహారమా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రమ్ శాకహారమా.?
రమ్ తయారీకి చెరకు రసం లేదా బెల్లం, నీరు, ఈస్ట్ వాడతారు. వీటిని కిణ్వ ప్రక్రియ (fermentation) చేసి స్వేదనం (distillation) ద్వారా రమ్ తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో జంతు మూల పదార్థాలు ఉండవు కాబట్టి రమ్‌ను శాఖాహార పానీయంగా పరిగణించవచ్చు.
విస్కీని ఎలా తయారు చేస్తారు.?
విస్కీ ప్రధానంగా బార్లీ, మొక్కజొన్న, రై, గోధుమ వంటి ధాన్యాలు, నీరు, ఈస్ట్‌తో తయారు చేస్తారు. వీటిని మాల్ట్ చేసి పులియబెట్టి స్వేదనం చేస్తారు. సాధారణంగా ఇందులో జంతు ఆధారిత పదార్థాలు ఉండవు. అందువల్ల విస్కీ కూడా వెజ్ పానీయమే అని అంటారు.
బీర్ విషయానికొస్తే..
బీర్ బార్లీ, హాప్స్, నీరు, ఈస్ట్‌తో తయారవుతుంది. అయితే కొన్ని బీర్ బ్రాండ్లు వడపోత కోసం ఐసింగ్‌లాస్ (Isinglass) లేదా జెలటిన్ వాడతాయి. ఇవి చేపల మూత్రాశయం నుంచి తీసుకునే పదార్థాలు. అలాంటివి వాడితే బీర్ నాన్ వెజ్‌గా మారుతుంది. కాబట్టి బీర్ వెజ్ లేదా నాన్ వెజ్ అనేది బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల బీర్లలో జంతువుల ఎముకలు లేదా చర్మం నుంచి తీసే జెలటిన్‌ను ఉపయోగిస్తారు.
ఎలా గుర్తించాలి?
బాటిల్‌పై ఉన్న లేబుల్‌ను పరిశీలించండి. వెజ్/నాన్ వెజ్ లోగో ఉంటే స్పష్టంగా తెలుస్తుంది. లేబుల్‌లో సమాచారం లేకపోతే బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి. అవసరమైతే కస్టమర్ కేర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.