Viral: పెయింటర్ వాడినట్లు ఉంది కదూ.! కానీ ఈ డ్రస్ ధర అక్షరాల రూ. లక్ష ముప్పై వేలు
ఫ్యాషన్ రకరకాల కొత్త పుంతలు తొక్కుతోంది. చూడ్డానికి విచిత్రంగా కనిపించే దుస్తులు కూడా లక్షల్లో ధరలు ఉంటాయి. అలాంటి ఓ వెరైటీ డ్రస్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ డ్రస్ ధర సుమారు లక్షన్నర
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అజియో డీలక్స్‌లో Acne Studios బ్రాండ్‌కు చెందిన ఈ డ్రస్ ధర సుమారు రూ. లక్ష ముప్పై వేలు ఉంది. ఈ షర్ట్ ధర రూ. 56,999కాగా ప్యాంట్ ధర రూ. 72,999గా ఉంది. చూడ్డానికి పెయింటర్ వాడి పడేసినట్లున్న ఈ డ్రస్ ధర అంత ఎక్కువ ఎందుకనే సందేహం రావడం సర్వసాధారణం. ఇంతకీ ఈ డ్రస్ అంత ఖరీదు ఎందుకు.? అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీడన్ కంపెనీ
స్వీడన్‌కు చెందిన Acne Studios ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్. మోడర్న్ ఆర్ట్ ప్రేరణతో వస్త్రాలపై కలర్ డాబ్ (Paint Daub) ప్రింట్లు, అద్భుతమైన కట్స్, ప్రీమియం క్వాలిటీ ఫాబ్రిక్స్ వీటి ప్రత్యేకత. ఈ షర్ట్ పూర్తిగా హ్యాండ్-పెయింట్ ఫినిష్‌లా ఉండే డిజైన్ చేశారు. వీటి తయారీలో ప్రీమియం కాటన్, డెనిమ్ మిక్స్ ఉంటుంది. ఇవి ఇటలీ, స్వీడన్ వంటి దేశాల్లో తయారవుతాయి. అలాగే ఈ దుస్తులను లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకొస్తారు.
AJIO Luxe అంటే ఏంటి.?
ఇది Reliance Retail నిర్వహిస్తున్న లగ్జరీ ఫ్యాషన్ పోర్టల్. ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ బ్రాండ్స్ (Balenciaga, Gucci, Acne Studios మొదలైనవి) అందుబాటులో ఉండే ప్లాట్‌ఫాం. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌లకు చెందిన ఉత్పత్తులను ఇండియాలోనే కొనుగోలు చేసే అవకాశం దీని సొంతం.
ఈ దుస్తుల ప్రత్యేకత ఏంటంటే.?
అజియో డీలక్స్‌లో లభించే దుస్తులు చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా పైన కనిపిస్తున్న ప్రింటెడ్ డ్రస్‌ను పెయింట్ డాబ్ స్టైల్ ఆర్టిస్టిక్ ప్రింట్‌గా చెబుతారు. రిలాక్స్‌డ్ ఫిట్, కంఫర్ట్ అండ్ స్టైల్‌తో దీనిని డిజైన్ చేశారు. ఈ కంపెనీకి ఉండే ప్రత్యేకతతో లగ్జరీ లుక్‌ను ఇస్తుంది.
ఇండియాలో పెరుగుతోన్న లగ్జరీ ఫ్యాషన్ మార్కెట్
ఇలాంటి వెబ్‌సైట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత్‌లో లగ్జరీ ఫ్యాషన్ మార్కెట్ రోజురోజుకీ పెరుగుతోంది. రెగ్యులర్ షాపింగ్‌తో పాటు ధనవంతులను అట్రాక్ట్ చేసేందుకు కంపెనీలు ఇలాంటి ప్రొడక్ట్స్‌ను కూడా తీసుకొస్తున్నాయి. కేవలం ఏజియో మాత్రమే కాకుండా ఇతర ఈ కామర్స్ సంస్థలు సైతం ఇలాంటి ప్రొడక్ట్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.