MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Railway Track: రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?

Railway Track: రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?

Railway Track: రైలులో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరూ ట్రైన్ పట్టాల మధ్య, పక్కన పరచి ఉన్న కంకర రాళ్లను చూసే ఉంటారు. కానీ అవి అక్కడ ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ రాళ్ల వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? లేటేందుకు తెలుసుకుందాం పదండి.

2 Min read
Author : Kavitha G
Published : Jun 05 2026, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైలు పట్టాలపై రాళ్లు ఎందుకు?
Image Credit : Getty

రైలు పట్టాలపై రాళ్లు ఎందుకు?

రైలు పట్టాలపై మనం కంకర రాళ్లను చూసే ఉంటాం. వాటిని ఎందుకు అలా పరిచారు అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. నిజానికి రైల్వే వ్యవస్థలో ఈ కంకర రాళ్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. రైలు పట్టాలపై ఉండే ఈ కంకర రాళ్లను “బ్యాలస్ట్” అని పిలుస్తారు. ఇవి రైల్వే ట్రాక్‌కు బలమైన పునాదిలా పనిచేస్తాయి. సాధారణంగా ఒక రైలు వందల టన్నుల వరకు బరువు ఉంటుంది. ఆ భారీ బరువు మొత్తం పట్టాలపై పడకుండా.. ఆ ఒత్తిడిని సమానంగా నేలపై పంపిణీ చేయడానికి కంకర రాళ్లు సహాయపడతాయి. ఈ రాళ్లు లేకపోతే ట్రాక్‌పై పడే ఒత్తిడి వల్ల నేల కుంగిపోవడం లేదా పట్టాలు వంకరగా మారే ప్రమాదం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్థిరమైన స్థానం
Image Credit : Getty

స్థిరమైన స్థానం

రైల్వే ట్రాక్‌ను స్థిరమైన స్థానంలో ఉంచడానికి కూడా ఈ రాళ్లు పనిచేస్తాయి. రైళ్లు అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు భారీ వైబ్రేషన్లు వస్తాయి. అలాంటి టైంలో పట్టాలు కదలకుండా ఉండాలి. కంకర రాళ్లు స్లీపర్లను గట్టిగా పట్టుకొని ట్రాక్ నిర్మాణాన్ని స్థిరంగా ఉంచుతాయి. ఇవి లేకపోతే ట్రాక్ కొద్దికొద్దిగా కదిలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

Related Articles

Related image1
Train Ticket Booking Tips: ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ 5 ఫాలో అయితే చాలా డబ్బులు ఆదా!
Related image2
Railways Rules: ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలు ఎక్కొచ్చా? లేక రీఫండ్ వస్తుందా?
35
నీరు నిల్వ ఉండకుండా
Image Credit : Getty

నీరు నిల్వ ఉండకుండా

వర్షం నీరు ట్రాక్‌ల మధ్య నిల్వ ఉండకుండా బయటకు వెళ్లేలా ఈ రాళ్లు సహాయపడతాయి. సాధారణ మట్టి లేదా ఇసుకతో ట్రాక్ నిర్మిస్తే వర్షాకాలంలో నీరు నిలిచిపోయి నేల కుంగిపోతుంది. కానీ కంకర రాళ్ల మధ్య ఖాళీలు ఉండటం వల్ల నీరు సులభంగా కిందికి జారిపోయి.. దానివల్ల ట్రాక్‌ల పునాది దెబ్బతినకుండా ఉంటుంది.

45
మొక్కలు పెరగకుండా
Image Credit : social media

మొక్కలు పెరగకుండా

అలాగే ఈ రాళ్లు ట్రాక్ చుట్టూ మొక్కలు, ఇతర పిచ్చి చెట్లు పెరగకుండా సహాయపడతాయి. సాధారణ నేల ఉంటే గడ్డి, మొక్కలు వేగంగా పెరిగి ట్రాక్‌లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మొక్కల వేర్లు ట్రాక్ నిర్మాణాన్ని బలహీనపరచవచ్చు. కంకర రాళ్లు ఉండటం వల్ల మొక్కలు పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

55
ప్రత్యేకమైన రాళ్లు
Image Credit : our own

ప్రత్యేకమైన రాళ్లు

అంతేకాదు రైలు ప్రయాణ సమయంలో ఏర్పడే వైబ్రేషన్లు, శబ్దాన్ని తగ్గించడంలో కూడా కంకర రాళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. రైలు చక్రాలు పట్టాలపై తిరిగేటప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తిని ఈ రాళ్లు కొంతవరకు గ్రహిస్తాయి. దీని వల్ల ట్రాక్‌పై ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రయాణం సాఫీగా ఉంటుంది. అంతేకాదు ఈ రాళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. సాధారణ రాళ్లు కాకుండా బలంగా, గట్టిగా ఉండే గ్రానైట్ వంటి రాళ్లను ఉపయోగిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ప్రయాణం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Plastic Water Bottle Ridges: వాటర్ బాటిళ్లపై ఆ లైన్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? క్రేజీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ట్రిక్ !
Recommended image2
Watch: వాచ్‌లో స‌మ‌యం ఎప్పుడూ 10:10 ఎందుకు కనిపిస్తుంది? దీనికో లాజిక్ ఉంద‌ని తెలుసా
Recommended image3
Motivational story: ఏ లోపం, శాపం కాదు మిత్ర‌మా.. మ‌నిషి ఆలోచ‌న‌ను మార్చే ప‌గిలిన కుండ క‌థ‌
Related Stories
Recommended image1
Train Ticket Booking Tips: ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ 5 ఫాలో అయితే చాలా డబ్బులు ఆదా!
Recommended image2
Railways Rules: ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలు ఎక్కొచ్చా? లేక రీఫండ్ వస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved