MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Pakistan Hindus : పాకిస్థాన్‌లో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా గల నగరమేది? హిందూ జనాభా ఎంత?

Pakistan Hindus : పాకిస్థాన్‌లో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా గల నగరమేది? హిందూ జనాభా ఎంత?

ఇండియా హిందూ మెజారిటీ దేశం అయితే పాకిస్థాన్ ఒక ముస్లిం మెజారిటీ దేశం. మనదగ్గర ముస్లింలు మైనారిటీ అయితే అక్కడ హిందువులు మైనారిటీలు. కానీ ఆ దేశంలో 80 శాతం హిందూ జనాభా ఉన్న ఒక నగరం ఉంది. అదేదో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 15 2026, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పాకిస్థాన్ లో హిందువులు అత్యధికంగా ఉండే ప్రాంతం ఏదో తెలుసా?
Image Credit : Gemini ai

పాకిస్థాన్ లో హిందువులు అత్యధికంగా ఉండే ప్రాంతం ఏదో తెలుసా?

2023 జనాభా లెక్కల ప్రకారం పాకిస్థాన్‌లో హిందువుల సంఖ్య సుమారు 39 లక్షలు. ఇది మొత్తం జనాభాలో 1.6% మాత్రమే. అయితే పాక్ లో హిందువుల సంఖ్య ఇంకాా ఎక్కువగా ఉంటుంది… కానీ ఆ దేశ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని కొన్ని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ లో హిందూ జనాభాపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. 

ఇదిలావుంటే పాకిస్థాన్‌ మొత్తంలోని హిందూ జనాభాలో 90% కేవలం సింధ్ ప్రావిన్స్‌లోనే ఉన్నారు. పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలలో కూడా హిందువులు నివసిస్తున్నారు… కానీ చాలా తక్కువ. ఇక మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ విసిరేసినట్లుగా హిందూ కుటుంబాలు ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పాక్ లో గోవధ నిషేధం ఉన్న నగరమేది?
Image Credit : Getty

పాక్ లో గోవధ నిషేధం ఉన్న నగరమేది?

పాకిస్థాన్‌లో అత్యధిక హిందువులు ఉన్న ప్రావిన్స్ సింధ్… ఇందులోనూ థార్‌పార్కర్, ఉమర్‌కోట్, మీర్‌పూర్ ఖాస్, సంఘర్ వంటి జిల్లాల్లో హిందువులు ఎక్కువగా కనిపిస్తారు. ముఖ్యంగా భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న థార్‌పార్కర్, ఉమర్‌కోట్ ప్రాంతాల్లో హిందూ సంస్కృతి ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి… అంటే ఇక్కడ హిందువులు అధికంగా ఉంటారన్నమాట. 

థార్‌పార్కర్ జిల్లాలోని ప్రధాన నగరం మిథీలో ముస్లింల కంటే హిందువుల జనాభే ఎక్కువ… ఆశ్చర్యకరంగా ఉన్నా ఇదే నిజం. ఈ నగరంలో మొత్తం 87 వేల జనాభా ఉండగా, అందులో 80% మంది హిందువులే… ముస్లింలు 20 శాతంలోపే ఉంటారు. ఇలా హిందువులు మెజారిటీగా గల నగరం పాకిస్థాన్ లో ఉందని చాలామందికి తెలియదు. 

ఈ మిథీ నగరం ప్రత్యేకత ఏంటంటే… ఇక్కడ ప్రతి వీధిలో హిందూ దేవాలయం కనిపిస్తుంది… చాలామంది నుదుట బొట్టు పెట్టుకుని కనిపిస్తుంది. ఇక్కడ మసీదుల కంటే గుడులే ఎక్కువ.. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఈ నగరంలో గోవధ నిషేధం ఉంది. అంటే గోవును పూజించడానికే తప్ప దాన్ని వధించి మాంసం అమ్మడానికి ఉపయోగించరాదు.

Related Articles

Related image1
Petrol price pakistan: పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా? పాపం అక్కడి ప్రజలు
Related image2
Pakistan Flag on Boots : బూట్లపై పాకిస్తాన్ జెండా.. ఏవరీ ఫీఫా ప్రపంచ కప్ ప్లేయర్? సోషల్ మీడియాలో రచ్చ !
33
పాక్ లో హిందువులు మెజారిటీ గల జిల్లా ఇదే
Image Credit : Getty

పాక్ లో హిందువులు మెజారిటీ గల జిల్లా ఇదే

పాకిస్థాన్ హిందూ జనాభా అధికంగా ఉన్న జిల్లా థార్‌పార్కర్… ఇక్కడ ఏకంగా 8 లక్షలమంది హిందువులు ఉంటారని అంచనా. ఇక ఉమర్ కోట్ జిల్లా జనాభాలోనూ హిందువులే అత్యధికం.. మొత్తం జనాభాలో 54 శాతంతో మెజారిటీ కలిగివున్నారు. 

హిందూ జనాభా ఎక్కువగా ఉండే ఆ థార్ పార్కర్, ఉమర్ కోట్ జిల్లాలో దీపాావళి వంటి పండగలు ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ హిందూ, ముస్లిం వర్గాలు ఎంతో సామరస్యంగా జీవిస్తాయని స్థానికులు చెబుతారు.  రంజాన్ వంటి ముస్లిం పండగలను కూడా రెండు వర్గాల వారు కలిసి జరుపుకుంటారు. చాలా మంది హిందువులు మొహర్రం ఊరేగింపుల్లో పాల్గొంటారు… ముస్లింలు దీపావళికి టపాసులు కాలుస్తూ కనిపిస్తారు. ఇలా మిథి నగరం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Motivational Story: నిజమైన బలవంతుడు ఎవరు..? మీ ఆలోచనను మార్చే కథ ఇది..!
Recommended image2
HORN OK PLEASE : లారీల వెనక 'OK' అని ఎందుకు రాస్తారు? దీని అర్థం 'సరే' కాదు, మరేంటో తెలుసా?
Recommended image3
జెన్ జి, జెన్ ఆల్ఫా, జెన్ ఎక్స్, మిల్లీనియల్ తెలుసు.. ఈ బేబీ బూమర్స్, సైలెంట్ జనరేషన్ ఏంటి? మీ జనరేషన్ ఏది?
Related Stories
Recommended image1
Petrol price pakistan: పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా? పాపం అక్కడి ప్రజలు
Recommended image2
Pakistan Flag on Boots : బూట్లపై పాకిస్తాన్ జెండా.. ఏవరీ ఫీఫా ప్రపంచ కప్ ప్లేయర్? సోషల్ మీడియాలో రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved