MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Football
  • Pakistan Flag on Boots : బూట్లపై పాకిస్తాన్ జెండా.. ఏవరీ ఫీఫా ప్రపంచ కప్ ప్లేయర్? సోషల్ మీడియాలో రచ్చ !

Pakistan Flag on Boots : బూట్లపై పాకిస్తాన్ జెండా.. ఏవరీ ఫీఫా ప్రపంచ కప్ ప్లేయర్? సోషల్ మీడియాలో రచ్చ !

Pakistan Flag on Boots: ఫిఫా వరల్డ్ కప్ 2026లో జిదాన్ ఇక్బాల్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు. బూట్లపై పాకిస్తాన్ జెండాతో బరిలోకి దిగుతుండటంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అసలు ఏవరీ ప్లేయర్?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 17 2026, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జిదాన్ ఇక్బాల్: షూస్‌పై పాకిస్తాన్ జెండా.. ఫిఫా వరల్డ్ కప్‌లో రచ్చ లేపుతున్న ప్లేయర్
Image Credit : X/ubad433, Instagram/zidaneiqbal

జిదాన్ ఇక్బాల్: షూస్‌పై పాకిస్తాన్ జెండా.. ఫిఫా వరల్డ్ కప్‌లో రచ్చ లేపుతున్న ప్లేయర్

మాజీ మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్, ప్రస్తుత ఇరాక్ ఫుట్‌బాల్ స్టార్ జిదాన్ ఇక్బాల్ ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. అయితే గ్రౌండ్‌లోకి దిగకముందే అతను ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో జిదాన్ ఇక్బాల్ తన బూట్లపై పాకిస్తాన్ జెండాను ముద్రించుకుని ఆడబోతున్నాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బూట్లపై ఒక దేశ జెండాను పెట్టుకోవడం ఆ దేశాన్ని అవమానించడమే అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాకిస్తాన్ అభిమానులకు ప్రత్యేకం
Image Credit : Instagram / zidaneiqbal

పాకిస్తాన్ అభిమానులకు ప్రత్యేకం

ఇరాక్ టీమ్ తరఫున జిదాన్ ఇక్బాల్ మైదానంలోకి అడుగు పెట్టగానే వరల్డ్ కప్ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డు నమోదు కానుంది. బూట్లపై జెండా వివాదం ఎలా ఉన్నా, ఈ మూమెంట్ ఇరాక్ కంటే కూడా పాకిస్తాన్  అభిమానులకు చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే 240 మిలియన్ల కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న పాకిస్తాన్.. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద దేశం. కానీ ఆ దేశ ఫుట్‌బాల్ టీమ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌కు క్వాలిఫై కాలేదు. తన హిస్టరీలోనే పాకిస్తాన్ కేవలం ఒకే ఒక్క క్వాలిఫైయింగ్ మ్యాచ్ గెలిచింది. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో 198వ ప్లేస్‌లో ఉంటూ ఫుట్‌బాల్‌లో అత్యంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్న దేశాల లిస్ట్‌లో ఉంది.

35
పాకిస్తానీ మూలాలున్న ఫస్ట్ వరల్డ్ కప్ ప్లేయర్ జిదాన్
Image Credit : Instagram / zidaneiqbal

పాకిస్తానీ మూలాలున్న ఫస్ట్ వరల్డ్ కప్ ప్లేయర్ జిదాన్

మాంచెస్టర్ యునైటెడ్ అకాడమీ నుండి వచ్చిన జిదాన్ ఇక్బాల్ ప్రస్తుతం 'ఎఫ్‌సి యుట్రెచ్ట్' క్లబ్ కోసం ఆడుతున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో అతను ఇరాక్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. ఫిఫా వరల్డ్ కప్‌లో ఆడుతున్న పాకిస్తానీ మూలాలున్న మొదటి ప్లేయర్‌గా హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. అందుకే అతను తన రెండు వారసత్వాలను గౌరవిస్తూ.. ఒక బూటుపై ఇరాక్ జెండాను, మరొక బూటుపై పాకిస్తాన్ జెండాను వేసుకుంటున్నాడు.

45
రికార్డు చూసి షాకయ్యా.. జిదాన్
Image Credit : Instagram / zidaneiqbal

రికార్డు చూసి షాకయ్యా.. జిదాన్

ఈ రేర్ రికార్డ్ గురించి జిదాన్ ఇక్బాల్ మాట్లాడుతూ.. తనకు ఈ విషయం తెలిసి చాలా ఆశ్చర్యం వేసిందని చెప్పాడు. "నిజం చెప్పాలంటే నాకు ఈ రికార్డ్ గురించి అస్సలు తెలియదు. నేను సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చూడగానే వెంటనే మా నాన్నకు మెసేజ్ చేశాను. మేమిద్దరం చాలా షాక్ అయ్యాం" అని బీబీసీ స్పోర్ట్స్‌తో అన్నాడు. తనకున్న పాకిస్తానీ మూలాల పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని, తన కెరీర్‌లో తన తండ్రే తనకు బిగ్గెస్ట్ గైడ్ అని జిదాన్ చెప్పుకొచ్చాడు.

55
బూట్ల ద్వారా డబుల్ ఐడెంటిటీ
Image Credit : Instagram / zidaneiqbal

బూట్ల ద్వారా డబుల్ ఐడెంటిటీ

ఈ టాలెంటెడ్ మిడ్‌ఫీల్డర్‌కు తన రెండు దేశాల వారసత్వాలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ డబుల్ ఐడెంటిటీని అతను తన బూట్ల ద్వారా ప్రపంచానికి చూపిస్తున్నాడు. తన ఎడమ కాలి బూటుపై ఇరాక్ జెండాను, కుడి కాలి బూటుపై పాకిస్తాన్ జెండాను ధరిస్తున్నాడు. తన దృష్టిలో రెండు దేశాలు సమానమేనని, తన ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చేందుకే ఇలా చేస్తున్నానని జిదాన్ చెప్పాడు.

మొదటి పాకిస్తానీ ప్లేయర్‌ని నేనే

"నేను ఇంకా చాలా చిన్నవాడిని, కానీ వరల్డ్ కప్ ఆడుతున్న మొదటి పాకిస్తానీ ప్లేయర్‌ని నేనే కాబోతున్నాను. ఫుట్‌బాల్ ప్లేయర్స్ కావాలని కలలు కనే పిల్లలు నన్ను చూసి.. తాము కూడా సాధించగలమని నమ్ముతారని ఆశిస్తున్నాను" అని అన్నాడు. సౌత్ ఏషియన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఏ కిడ్ అయినా సరే.. హార్డ్ వర్క్, కమిట్‌మెంట్ ఉంటే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చినా సక్సెస్ సాధించవచ్చని జిదాన్ మెసేజ్ ఇచ్చాడు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @zidaneiqbal

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
పాకిస్తాన్
FIFA ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 
5th T20 • NZ vs IND 2026
Live
NZNZ
-
INDIND
(6.0 ov)50/2
NZ chose to bowl.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Related Stories
Recommended image1
FIFA World Cup 2026: లియోనెల్ మెస్సీ మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. ఫస్ట్ టైమ్ వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ గోల్స్ !
Recommended image2
Ronaldo Controversy: నోరుజారి బుక్కైన రొనాల్డో.. ఫిఫా వరల్డ్ కప్ లో పోర్చుగల్‌కు అతను ప్లస్సా.. మైనస్సా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved