MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Floating Market: మన దేశంలో నీటిపై తేలియాడే మార్కెట్ ఎక్కడుందో తెలుసా? ఇక్కడ పడవల్లోనే వ్యాపారం!

Floating Market: మన దేశంలో నీటిపై తేలియాడే మార్కెట్ ఎక్కడుందో తెలుసా? ఇక్కడ పడవల్లోనే వ్యాపారం!

Floating Market: సాధారణంగా మార్కెట్ అంటే రోడ్ల పక్కన షాపులు, తోపుడు బళ్లు గుర్తుకొస్తాయి. కానీ ఓ చోట మాత్రం నీటిపైనే మార్కెట్ ఉంటుంది. అక్కడ పడవలే షాపులు. ఈ మార్కెట్ ఎక్కడో కాదు మన దేశంలోనే ఉంది. మరి ఆ ప్రదేశం ఏంటి? దాని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Nov 02 2026, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నీటిపై తేలియాడే మార్కెట్
Image Credit : AI

నీటిపై తేలియాడే మార్కెట్

మన దేశంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండలపై మార్కెట్లు కనిపిస్తే, మరికొన్ని చోట్ల రోడ్ల పక్కన పెద్దపెద్ద వ్యాపార సముదాయాలు కనిపిస్తాయి. కానీ ఎప్పుడైనా నీటిపై తేలియాడే మార్కెట్‌ను చూశారా? అక్కడ దుకాణాలు భవనాల్లో ఉండవు.. పడవలపైనే ఉంటాయి. వ్యాపారులు పడవల్లో కూరగాయలు, పండ్లు, చేపలు విక్రయిస్తుంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి ప్రత్యేకమైన మార్కెట్ మన దేశంలోనే ఉంది. ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఈ అద్భుతమైన మార్కెట్ కనిపిస్తుంది. మరి ఈ మార్కెట్ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఏయే వస్తువులు అమ్ముతారో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దాల్ లేక్‌లో తేలియాడే కూరగాయల మార్కెట్
Image Credit : chatgpt

దాల్ లేక్‌లో తేలియాడే కూరగాయల మార్కెట్

జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్‌లో ఉన్న దాల్ లేక్ ప్రకృతి అందాలకు మాత్రమే కాకుండా, నీటిపై జరిగే ప్రత్యేకమైన వ్యాపారానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సులో ప్రతి రోజూ తెల్లవారుజామున తేలియాడే కూరగాయల మార్కెట్ సందడి మొదలవుతుంది. స్థానికంగా దీన్ని ఫ్లోటింగ్ వెజిటబుల్ మార్కెట్ అని పిలుస్తారు. ఇక్కడ వ్యాపారులు తమ పడవల్లోనే కూరగాయలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ఒక పడవలో కూరగాయలు, మరో పడవలో పండ్లు ఇలా వివిధ రకాల వస్తువులతో వ్యాపారులు కనిపిస్తారు.

35
ఇక్కడ ఏయే వస్తువులు అమ్ముతారంటే?
Image Credit : pinterest

ఇక్కడ ఏయే వస్తువులు అమ్ముతారంటే?

ఈ మార్కెట్‌లో ప్రధానంగా స్థానికంగా పండించిన తాజా కూరగాయలు విక్రయిస్తారు. టమాటాలు, వంకాయలు, దోసకాయలు, వివిధ రకాల ఆకుకూరలు, వాటర్ చెస్ట్‌నట్స్‌తో పాటు కశ్మీర్‌లో ప్రసిద్ధి చెందిన తామర కాండాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడికి చిన్న వ్యాపారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు కూడా వస్తుంటారు. వారు కూరగాయలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి తమ ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఇలా ఈ మార్కెట్ స్థానిక వ్యవసాయానికి, ప్రజల జీవనోపాధికి ముఖ్యమైన కేంద్రంగా మారింది.

45
తెల్లవారుజామునే మార్కెట్ కార్యకలాపాలు
Image Credit : chat gpt

తెల్లవారుజామునే మార్కెట్ కార్యకలాపాలు

ఈ మార్కెట్‌ రోజంతా అందుబాటులో ఉండదు. తెల్లవారుజామున 4 గంటలకే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. దాదాపు రెండు గంటలపాటు కొనసాగుతాయి. ఆ తర్వాత పడవలు, వ్యాపారులు క్రమంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాల్ లేక్ చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఈ సరస్సు కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు. వారి జీవనోపాధికి కూడా ప్రధాన ఆధారం. ఇక్కడి ప్రజలు వ్యవసాయం, చేపల వేట, పడవల నిర్వహణ, పర్యాటక సేవలు వంటి వివిధ పనుల ద్వారా ఆదాయం పొందుతున్నారు.

55
పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రత్యేక మార్కెట్
Image Credit : chat GPT

పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రత్యేక మార్కెట్

దాల్ లేక్‌లోని ఫ్లోటింగ్ మార్కెట్‌కు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు ఉంది. ఈ మార్కెట్‌ను చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఫొటోగ్రఫీ ఇష్టపడేవారికి ఇది మంచి ప్రదేశం అని చెప్పొచ్చు.

కోల్‌కతాలోనూ మరో ఫ్లోటింగ్ మార్కెట్

కోల్‌కత్తాలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది. నగరంలోని పటులి ప్రాంతంలో 2018 లో ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. ఇక్కడ పడవలపై పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం వంటివి విక్రయిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Whistling Snake: బాబోయ్.. ఈల వేసే పాములు.. భారత్‌లోనూ తిరుగుతున్న ఆ భయంకరమైన పాము ఏదో తెలుసా?
Recommended image2
కంప్యూటర్ కీబోర్డుపై A B C Dలు వరుసగా ఎందుకు ఉండవు? అసలు కారణం ఇదే
Recommended image3
ఆసియాలోనే అతిపెద్ద మసాలా మార్కెట్ మనదేశంలోనే ఉంది.. ఇక్కడ నుంచే అన్ని రాష్ట్రాలకు మసాలా దినుసులు
Related Stories
Recommended image1
Cashew Capital: మన దేశపు జీడిపప్పు రాజధాని ఏదో తెలుసా? ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి!
Recommended image2
Old Sarees: మీ ఊర్లోకి కూడా పాత చీరలు కొంటామని వస్తున్నారా? వాటితో ఏం చేస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved