MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Railway Station Owner : ఇంటిముందే ట్రైన్ పార్కింగ్.. మనదేశంలో సొంతంగా రైల్వే స్టేషన్ కలిగిన ఒకేఒక్కడు..

Railway Station Owner : ఇంటిముందే ట్రైన్ పార్కింగ్.. మనదేశంలో సొంతంగా రైల్వే స్టేషన్ కలిగిన ఒకేఒక్కడు..

Railway Station Owner : సౌకర్యవంతమైన ప్రయాణం లేదా లగ్జరీ కోసం ఏ కారో, బస్సునో కొనేవారిని చూస్తుంటాం. మరీ రిచ్ అయితే ప్రైవేట్ జెట్స్ కొంటారు. కానీ ప్రైవేట్ ట్రైన్, దీని పార్కింగ్ కోసం ఇంటివద్దే రైల్వే స్టేషన్ కలిగిన బిగ్ షాట్ ఎవరో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : May 20 2026, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇంటిముందు ప్రైవేట్ ట్రైన్ పార్కింగ్..
Image Credit : Gemini AI

ఇంటిముందు ప్రైవేట్ ట్రైన్ పార్కింగ్..

Railway Station Owner : తమ రాజభవనం లాంటి ఇంటిముందు ఖరీదైన రోల్స్ రాయిస్, టెస్లా, బిఎండబ్ల్యు వంటి ఖరీదైన కార్లు ఉండాలని బాగా డబ్బున్నవాళ్లు కోరుకుంటారు. ఖరీదైన లగ్జరీ కార్లలో ప్రయాణించడమే కాదు అలా ఇంటిముందు పార్క్ చేయడాన్నీ స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. ఇలా పదుల సంఖ్యలో కోట్లాది రూపాయల విలువైన కార్లను కలిగిన సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు అనేకమంది ఉన్నారు. చివరకు లగ్జరీ బస్సులు (క్యారవ్యాన్లు) కలిగిన సెలబ్రిటీలు, ప్రైవేట్ జెట్స్ ఉన్న బడాబాబులు చాలామందే ఉన్నారు.

ఇప్పుడు లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్స్ కామన్ గా మారాయి… కారీ ఆ కాలంలోనే సొంతంగా విలాసవంతమైన ఓ ట్రైన్ మెయింటేన్ చేశాడో ఇండియన్ నవాబు. అంతేకాదు ఆ రైలు నేరుగా తన రాజమహల్ వద్దే పార్క్ చేసుకునేలా సొంతంగా ఓ రైల్వే స్టేషన్ నిర్మించుకున్నాడు. ఇలా భారతదేశంలో సొంత రైలు రెడీ చేయించుకుని... దాన్ని నిలపడానికి ఇంటివద్దే రైల్వేస్టేషన్ నిర్మించుకున్న ఏకైక వ్యక్తి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 ప్రైవేట్ రైల్వే స్టేషన్...
Image Credit : ChatGPT

ప్రైవేట్ రైల్వే స్టేషన్...

ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ సంస్థానాన్ని 1774 నవాబ్ ఫైజ్ ఉల్లా ఖాన్ స్థాపించారు. బ్రిటీష్ పాలనలో కూడా ఈ సంస్థానం స్వతంత్రంగా ఉండేది... గొప్ప సంస్కృతికి, సాహితీ వైభవానికి ప్రసిద్ది చెందింది. మన హైదరాబాద్ నిజాంల మాదిరిగానే ఈ సంస్థానాన్ని పాలించే నవాబులు కూడా సిరిసంపదలతో తులతూగేవారు. వీళ్లు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపారు.

అయితే ఈ రాంపూర్ సంస్థానాన్ని పాలించిన తొమ్మిదవ నవాబు హమీద్ అలీ ఖాన్ జీవితం విలాసానకి మారుపేరులా మారింది. ఆయన కేవలం రాజభవనాలే కాదు ప్రయాణం కూడా లగ్జరీగా ఉండాలని భావించారు. అప్పుడప్పుడే దేశంలో ప్రవేశించిన రైల్వే వ్యవస్థ అతడిని ఆకట్టుకుంది. బ్రిటీష్ పాలకుల సహయంతో సొంతంగా ఓ రైల్వే స్టేషన్ నిర్మించుకున్నాడు హమీద్ అలీ ఖాన్. దీన్ని ప్రధాన రైల్వే స్టేషన్ తో అనుసంధానం చేసేలా సొంత డబ్బులతో 40 కిలోమీటర్ల పొడవుండే రైల్వే లైన్ వేయించుకున్నాడు. 

అతడి రాజమహల్ వద్దగల రైల్వే స్టేషన్లో ఎప్పుడూ ఓ లగ్జరీ రైలు వేచివుండేది. ఇలా కేవలం రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఏకంగా రూ.113 కోట్లను ఆనాడే ఖర్చుచేశాడట నవాబు హమీద్ అలీ ఖాన్.. అంటే ఇప్పటి కరెన్సీ ప్రకారం వేలకోట్లు ఖర్చు చేశాడు. ఇలా దేశంలో సొంత రైల్వే స్టేషన్ కలిగిన ఏకైక వ్యక్తి ఈ హమీద్ అలీ ఖాన్.

33
కదిలే రాజభవనం - ది సెలూన్ ట్రైన్
Image Credit : Perplexity AI

కదిలే రాజభవనం - ది సెలూన్ ట్రైన్

రాజభవనాన్ని తలదన్నేలా ఓ రైలును తయారుచేయించుకున్నాడు రాంపూర్ నవాబు హమీద్ అలీ ఖాన్. 1925 లో ''బరోడా స్టేట్ రైల్ బిల్డర్స్'' ఈ లగ్జరీ ట్రైన్ ను తయారుచేసింది. ఈ రైలులో నాలుగు భోగీలు ఉండేవి... ఇందులో నవాబుతో పాటు కుటుంబసభ్యులు ప్రయాణించేందుకు అన్ని సౌకర్యాలు ఉండేవి. పర్షియన్ కార్పెట్లు, అందమైన ఫర్నీచర్ ఉండేవి... కిటీకీలకు ఖరీదైన కర్టెన్స్, భారీ జుమ్మర్లు ఈ రైలు అందాన్ని మరింత పెంచేవి.

ఇక రాచకుటుంబం కోసం ప్రత్యేకమన బెడ్రూంతో పాటు వంటగది ఉండేది. ఇలా నవాబ్ కుటుంబమే కాదు వారి సేవలకు కోసం ప్రత్యే కోచ్ లు ఉండేవి. అందుకే రాంపూర్ నవాబులు ''ది సెలూన్'' ట్రైన్ ను కదిలే రాజభవనం అనేవారట. ఇలా కేవలం తాను, తన కుటుంబసభ్యుల కోసం ఓ రైల్వే స్టేషన్, లగ్జరీ రైలును ఏర్పాటుచేసుకున్న వ్యక్తి నవాబ్ హమీద్ అలీ ఖాన్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC: పద్మనాభస్వామి నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే సౌత్ టెంపుల్ టూర్
Recommended image2
ఉద్యోగం వదిలేసి పీతల వ్యాపారంతో రోజుకు రూ.14 లక్షలు సంపాదిస్తున్న యువతి
Recommended image3
Mushrooms : ఏంటీ..కిలో మష్రూమ్స్ రూ.60 లక్షలా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు
Related Stories
Recommended image1
Indian Bullet Train : జపాన్ అవసరం లేదు.. మన బుల్లెట్ ట్రైన్ రెడీ! గంటకు ఎన్ని కిలోమీటర్లో తెలుసా?
Recommended image2
Train Owner: మనదేశంలో రైలుకు యజమాని అయినా ఏకైక వ్యక్తి.. అది కూడా రైల్వే శాఖ చేసిన తప్పు వల్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved