MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Bala Hanuman Temple: 60 ఏళ్లుగా ఆగని రామనామం...గిన్నీస్ రికార్డుకెక్కిన ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

Bala Hanuman Temple: 60 ఏళ్లుగా ఆగని రామనామం...గిన్నీస్ రికార్డుకెక్కిన ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

Bala Hanuman Temple: గుడికి వెళ్తే గంట శబ్దం, పూజలు, భజనలు ఉంటాయి. కానీ ఓ గుడిలో 64 ఏళ్లుగా ఒకే నామస్మరణ వినిపిస్తోంది. పగలు, రాత్రి, ఎండా, వానా ఇవేవీ రామస్మరణకు విరామం కలిగించలేదు. ఒకరి తర్వాత ఒకరు ఆ బాధ్యత తీసుకుంటారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది?

2 Min read
Author : Nandini Arava
Published : Nov 03 2026, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తరాలు మారుతున్నా ఆగని రామనామం
Image Credit : twitter

తరాలు మారుతున్నా ఆగని రామనామం

తరాలు మారుతున్నా రామనామ స్మరణ ఆగడం లేదు. 60 ఏళ్లుగా రాత్రింబవళ్లు జై శ్రీరామ్ నినాదాలు మోగుతూనే ఉన్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ నగరంలో రణ్మల్ సరస్సు (లఖోటా సరస్సు) ఆగ్నేయ భాగంలో ఈ బాలా హనుమాన్ ఆలయం ఉంది. దీనిని శ్రీ బాలా హనుమాన్ సంకీర్తన మందిర్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే భక్తుల నోట వినిపించే ఒకే నామం మనకు స్వాగతం పలుకుతుంది. అదే ‘శ్రీరామ్.. జై రామ్.. జై జై రామ్’.

1964 ఆగస్టు 1వ తేదీన ప్రారంభమైన ఈ రామధున్ ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతోంది. అంటే ఆరు దశాబ్దాలకు పైగా పగలు, రాత్రి తేడా లేకుండా భక్తులు రామనామాన్ని జపిస్తూనే ఉన్నారు. ఈ ప్రత్యేకమైన సంప్రదాయానికి గుర్తింపుగా ఆలయానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా స్థానం లభించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ సంప్రదాయం ఎలా మొదలైంది?
Image Credit : twitter

ఈ సంప్రదాయం ఎలా మొదలైంది?

ఈ నిరంతర రామనామ స్మరణ వెనుక ప్రేమ్ భిక్షుజీ మహరాజ్ అనే ఆధ్యాత్మిక గురువు ఉన్నారు. ఆయన 1964లో తన అనుచరులతో కలిసి ఈ ఆలయంలో రామధున్ ప్రారంభించారు. అప్పటి నుంచి భక్తులు ఒకరి తర్వాత మరొకరు బాధ్యత తీసుకుంటూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక వ్యక్తి రోజంతా కూర్చొని రామనామాన్ని జపించడం కాదు. భక్తులు తమకు వీలైన సమయంలో ఆలయానికి వచ్చి ఈ సంకీర్తనలో పాల్గొంటారు. ఒకరి సమయం పూర్తయితే మరొకరు బాధ్యత తీసుకుంటారు. ఇలా 24 గంటల పాటు, వారంలో ఏడు రోజులూ రామనామ స్మరణ కొనసాగుతుంది.

ఇన్నేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగడం వెనుక వేలాది మంది భక్తుల భాగస్వామ్యం ఉంది. ఒక తరం నుంచి మరో తరానికి ఈ భక్తి సంప్రదాయం అందుతూ వస్తోంది. బయట ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఈ ఆలయంలో మాత్రం రామనామం ఆగకుండా వినిపిస్తూనే ఉంది.

35
‘శ్రీరామ్.. జై రామ్.. జై జై రామ్’ నామస్మరణ ప్రత్యేకత ఏంటి?
Image Credit : twitter

‘శ్రీరామ్.. జై రామ్.. జై జై రామ్’ నామస్మరణ ప్రత్యేకత ఏంటి?

హిందూ సంప్రదాయంలో రామనామానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది భక్తులు రాముడి నామాన్ని జపించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని, ఆలోచనలు ఒకచోట కేంద్రీకృతమవుతాయని నమ్ముతారు. ఒకే నామాన్ని పదేపదే స్మరించడం వల్ల రోజువారీ ఆలోచనల నుంచి కొంత సమయం మనసును ఆధ్యాత్మికత వైపు మళ్లించవచ్చని భావిస్తారు.

ఈ ఆలయంలోనూ అదే నామస్మరణ నిరంతరంగా కొనసాగుతోంది. ఇందులో పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఆడంబరాలు ఉండవు. భక్తుల గొంతుల నుంచి వచ్చే రామనామమే ఇక్కడి ప్రత్యేకత. ఒకరు జపించిన నామాన్ని మరొకరు కొనసాగిస్తారు. అలా వేలాది గొంతులు కలిసి ఆరు దశాబ్దాలుగా రామ నామాన్ని జపిస్తున్నారు.

45
అనుపమ్ ఖేర్ సైతం సందర్శించిన ఆలయం
Image Credit : twitter

అనుపమ్ ఖేర్ సైతం సందర్శించిన ఆలయం

ఈ ఆలయ ప్రత్యేకత గురించి పలువురు ప్రముఖులకు కూడా తెలుసు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తన ‘21 హనుమాన్ మందిర్’ సిరీస్‌లో భాగంగా ఈ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్నారు.

ఈ ఆలయాన్ని గొప్ప సాధువు ప్రేమ్ భిక్షు స్థాపించారని, ఇక్కడ బాలరూపంలో బజరంగబలి కొలువై ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యం భక్తుల్లో భక్తిభావాన్ని పెంచుతాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

55
జామ్‌నగర్ వెళ్తే ఈ ప్రదేశాలను కూడా చూడొచ్చు
Image Credit : twitter

జామ్‌నగర్ వెళ్తే ఈ ప్రదేశాలను కూడా చూడొచ్చు

బాలా హనుమాన్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లేవారు సమీపంలోని లఖోటా సరస్సును కూడా చూడొచ్చు. నగరంలోని రద్దీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ సరస్సు ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం వేళ స్థానికులు సరస్సు చుట్టూ నడుస్తూ సమయాన్ని గడుపుతుంటారు. సరస్సుకు అవతలివైపు ఉన్న లఖోటా ప్యాలెస్ కూడా మరో ఆకర్షణ. నీటి మధ్యలో కనిపించే ఈ చారిత్రక కట్టడం జామ్‌నగర్ సందర్శనలో ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ప్రయాణం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Sugar Companies : ఇండియాలో అత్యధికంగా చక్కెర ఉత్పత్తిచేసే టాప్ 5 కంపెనీలివే...
Recommended image2
Airplane Food: ఫ్లైట్ లో ఫుడ్ ఎందుకు రుచిగా ఉండదు? దానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
Salary: అమెరికాలో డ్రైవర్ల నెల జీతం ఎంత ఉంటుంది? భారీగా సంపాదన.. మరి ఖర్చుల సంగతేంటి?
Related Stories
Recommended image1
Diwali Scam: ఈ జాగ్రత్తలు పాటిస్తే దీపావళి బోనస్ స్కాం నుంచి బయటపడొచ్చు
Recommended image2
Halloween History: భారత్ లో పెరుగుతున్న దెయ్యాల పండగ క్రేజ్.. అసలు ఎక్కడ పుట్టింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved