MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Shankh Mitra: జీతంలో ఎలన్ మస్క్‌తో పోటీ పడుతున్న భారతీయుడు.. ఏడాదికి సాలరీ ఎంతో తెలుసా?

Shankh Mitra: జీతంలో ఎలన్ మస్క్‌తో పోటీ పడుతున్న భారతీయుడు.. ఏడాదికి సాలరీ ఎంతో తెలుసా?

Shankh Mitra: ప్రపంచంలో అత్యధిక శాలరీ అందుకుంటున్న సీఈవోలలో భారతీయుడు కూడా చేరుకున్నారు. అతని పేరు శంఖ్ మిత్రా. ఎలన్ మస్క్ తో పోటీపడేలా శాలరీ ప్యాకేజీ అందుకుంటున్నారు. అతనెవరో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 24 2026, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శంఖ్ మిత్రా జీతం ఎంత?
Image Credit : X

శంఖ్ మిత్రా జీతం ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు శంఖ్ మిత్రా పేరు మారుమోగిపోతోంది. అత్యధిక వేతనం పొందే కార్పొరేట్‌ నాయకుల జాబితాలో ఈయన కూడా ఒకరు. అమెరికాకు చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ, సీనియర్ హౌసింగ్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వెల్‌టవర్ (Welltower) సీఈవోగా ఉన్న ఆయనకు 821 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7,700 కోట్లకు పైగా) విలువైన వేతన ప్యాకేజీ లభించినట్లు అంతర్జాతీయ మీడియాలు చెబుతాయి. ఈ భారీ ప్యాకేజీ కారణంగా ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోలలో శంఖ్ మిత్రా ఒకరిగా నిలిచారు. భారత మూలాలు కలిగిన వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మందికి స్ఫూర్తిగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈయన స్పెషాలిటీ ఏమిటి?
Image Credit : X

ఈయన స్పెషాలిటీ ఏమిటి?

శంఖ్ మిత్రా వ్యాపారంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. వెల్‌టవర్ సంస్థకు నాయకత్వం వహిస్తున్న ఆయన కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. వృద్ధుల కోసం నివాస సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల నిర్వహణలో వెల్‌టవర్ ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది. శంఖ్ మిత్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థ మార్కెట్‌ విలువ గణనీయంగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు.

34
జీతం ఏ రూపంలో ఇస్తారు?
Image Credit : X

జీతం ఏ రూపంలో ఇస్తారు?

ఆయనకు 821 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీ మొత్తం నగదు రూపంలో కాదు. ఇందులో ఎక్కువ భాగం కంపెనీ షేర్లు, స్టాక్‌ అవార్డులు, దీర్ఘకాలిక ప్రోత్సాహక పథకాల రూపంలో అందిస్తారు. కంపెనీ భవిష్యత్తులో నిర్దేశించిన పనితీరు లక్ష్యాలను చేరుకుంటేనే ఈ ప్రయోజనాలన్నీ దక్కుతాయి. అంటే కంపెనీ విజయవంతంగా ముందుకు సాగితేనే శంఖ్ మిత్రా కూడా ఈ భారీ మొత్తాన్ని పూర్తిగా పొందగలరు. ఇటువంటి విధానం ద్వారా సంస్థ అభివృద్ధి, సీఈవో పనితీరు రెండూ ఒకే దిశలో కొనసాగేలా కంపెనీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

44
ఇండియాలో ఏ రాష్ట్రానికి చెందినవారు?
Image Credit : Linkdin

ఇండియాలో ఏ రాష్ట్రానికి చెందినవారు?

శంఖ్ మిత్రా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతాలో జన్మించారు. కోల్ కతాలోని జాదవ్ పూర్ యూనివర్సిటీ లోనే బీటెక్ పూర్తి చేశారు. తరువాత ఎంబీఏ చేయడం కోసం కొలంబియా బిజినెస్ స్కూల్ కి వెళ్లారు. ఇక అక్కడే సెటిలైపోయారు. ఇప్పుడు ఏకంగా ఎలన్ మస్క్ కే పోటీ ఇచ్చేలా సంపాదించడం మొదలుపెట్టారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
చిన్నారులపై లైంగిక అరాచకాలు తగ్గాలంటే... 'టింగ్ టాంగ్' ఫార్ములా ఫాలో అవ్వాల్సిందే, అంటే ఏమిటో తెలుసా?
Recommended image2
Heritage Trains: 170 ఏళ్లు వచ్చినా తగ్గని ఫేరీ క్వీన్ స్పీడ్.. ఇండియాలోని టాప్ 5 హెరిటేజ్ రైళ్లు ఇవే
Recommended image3
Top 5 Largest Ganesha Temples: ప్రపంచంలోనే ప్రముఖ, అతిపెద్ద గణపతి ఆలయాలు ఇవే
Related Stories
Recommended image1
Heavy Mangalasutra: కళ్లు చెదిరే హెవీ మంగళసూత్రాల డిజైన్లు
Recommended image2
Ant mill: వందల చీమలు గుండ్రంగా తిరుగుతూ ఎందుకు ప్రాణాలు వదిలేస్తాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved