MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Smallest River: భారతదేశంలో అతి చిన్న నది ఇది, 60 ఏళ్లు ఎండిపోయి.. మళ్లీ ప్రాణం పోసుకున్న నది..!

Smallest River: భారతదేశంలో అతి చిన్న నది ఇది, 60 ఏళ్లు ఎండిపోయి.. మళ్లీ ప్రాణం పోసుకున్న నది..!

Smallest River: మన దేశంలో చాలా నదులు ఉన్నాయి. కానీ, అత్యంత చిన్న నది ఏదో తెలుసా? దాదాపు 60 ఏళ్ల పాటు ఎండిపోయిన ఈ నది... మళ్లీ ప్రాణం పోసుకుంది. మరి, ఆ నది ఏదో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 17 2026, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Smallest River
Image Credit : ఏఐ ఆధారంగా రూపొందించిన చిత్రం

Smallest River

మన దేశంలో నదులు అనగానే అందరికీ వెంటనే గంగ, యమున, గోదావరి, కృష్ణ వంటి నదులే గుర్తుకు వస్తాయి. ఈ నదులన్నీ.. వేల కిలోమీటర్లు పొడవు ఉన్నవే. కానీ, మన దేశంలో అతి చిన్న నది ఏదో మీకు తెలుసా? కేవలం 45 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉండే నది ఒకటి ఉంది. అదే అర్వరీ నది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఎడారి ప్రాంతంలో ప్రవహిస్తుంది. అయితే.. ఈ నది వెనక చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ వివరాలు ఎప్పుడు తెలుసుకుందాం...

అర్వరీ నది ఎక్కడ పుట్టింది..?

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఆరావళి పర్వత శ్రేణుల నుండి ఈ అర్వరీ నది పుట్టింది. దీని మొత్తం పొడవు కేవలం 45 కిలోమీటర్లు మాత్రమే. అందుకే, దీన్ని భారతదేశంలోనే అతి చిన్న నదిగా పరిగణిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
ఎండిపోయిన నది.. మళ్లీ ఎలా పుట్టింది..?
Image Credit : ఏఐ ఆధారంగా రూపొందించిన చిత్రం

ఎండిపోయిన నది.. మళ్లీ ఎలా పుట్టింది..?

ఈ నది అత్యంత చిన్నది కావడం వల్ల మాత్రమే ఫేమస్ కాలేదు.. దీని పునర్జన్మ కథ దేశానికి ఆదర్శంగా నిలిచింది. అడవుల నరికివేత, తీవ్రమైన కరవు పరిస్థితుల వల్ల ఈ నది దాదాపు 60 సంవత్సరాల పాటు పూర్తిగా ఎండిపోయింది. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాస్త నీరు కనిపించి, ఆ తర్వాత పూర్తిగా ఎండిపోయేది. అయితే, 1980 చివరలో ‘ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గా పేరు పొందిన ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ రాజేంద్ర సింగ్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామస్థులు ఒక గొప్ప సంకల్పం తీసుకున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడానికి గ్రామస్థులు అంతా కలిసి సాంప్రదాయ మట్టి చెక్ డ్యామ్ లను నిర్మించారు. అలా వందలాది చెక్ డ్యామ్ లు నిర్మించడంతో భూగర్భ జలాలు పెరిగి, 1990ల నాటికి 60 ఏళ్లుగా ఎండిపోయిన అర్వరీ నది మళ్లీ పుట్టింది. మళ్లీ... జీవనదిగా మారి ప్రవహించడం మొదలుపెట్టింది.

ప్రపంచ గుర్తింపు పొందిన నది...

ఎండిపోయిన ఒక నది.. ప్రజల కారణంగా మళ్లీ జీవం పోసుకోసుకోవడం.. ఈ నది చాలా ప్రత్యేకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రజలు చేసిన అద్భుత కృషి కారణంగా ఈ అర్వరీ నది పరివాహక ప్రాంత గ్రామస్థులకు 2000 సంవత్సరంలో... ఇంటర్నేషనల్ రివర్ ప్రైజ్ కూడా లభించింది. ఇప్పుడు ఈ నది అక్కడి ప్రజలకు జీవనాధారంగా మారింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
 
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
(7.5 ov)26/0
SLSL
98
Day 1 - Session 2
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Railway Station: 160 ఏళ్లకు పైగా చరిత్రను తనలో దాచుకున్న రైల్వేస్టేషన్..లక్షలాది మందికి ఇదే ప్రధాన ద్వారం
Recommended image2
జీర్ణాశయంలో గుడ్లు పొదిగి, నోటి ద్వారా బిడ్డలకు జన్మనిచ్చే జీవి ఏది?
Recommended image3
Laknavaram Lake: తెలంగాణ మాల్దీవులు.. కోనసీమను తలపించే ప్రకృతి అందాలు.. ఒక్కసారైనా చూడాల్సిందే
Related Stories
Recommended image1
Om Island: ప్రకృతి సిద్ధంగా ‘ఓం’ ఆకారంలో ఏర్పడిన దీవి ఏదో తెలుసా? మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Recommended image2
Nita Ambani: అంబానీ భార్య ధరించిన ఒక చిన్న పిన్ ధర రూ.15కోట్లు.. అందులో అంత స్పెషల్ ఏముంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved