MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Onions: ఈ ఊరిలో ఉల్లిపాయలు అమ్మరు, కొనరు, తినరు.. అది చట్టరీత్యా నేరం కూడా

Onions: ఈ ఊరిలో ఉల్లిపాయలు అమ్మరు, కొనరు, తినరు.. అది చట్టరీత్యా నేరం కూడా

Onions: ఉల్లిపాయలు కనిపించని ఒకే ఒకే గ్రామం మనదేశంలో ఉంది. ఊరంతా తిరిగినా కూడా మీకు ఉల్లి, వెల్లుల్లి కనిపించవు. ఆ గ్రామం పేరు కట్రా. ఈ గ్రామంలో ఎందుకు ఉల్లిని నిషేధించారో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 08 2026, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఉల్లిపాయలే కనిపించని గ్రామం
Image Credit : Gemini AI

ఉల్లిపాయలే కనిపించని గ్రామం

మన కూరలు, బిర్యానీలు, పప్పుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ఊహించలేం. దాదాపు అన్ని రకాల కూరల్లో ఉల్లిపాయలే ముఖ్యమైనవి. ఉల్లిపాయ లేకపోతే కూర వండడం కూడా కష్టంగా మారిపోతుంది. అయితే, భారతదేశంలో ఉల్లిపాయ అస్సలు కనిపించని గ్రామం ఒకటుంది. అక్కడ ఉల్లిపాయలు తినడమే కాదు అసలు అమ్మరు కూడా. గ్రామంలోని ప్రజలు ఉల్లిపాయలు పండించరు. ఆ గ్రామం జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న కట్రా. ఈ గ్రామాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాతా వైష్ణో దేవి యాత్రకు బేస్ క్యాంప్‌గా పిలుస్తారు. ఈ గ్రామంలో ఉల్లిపాయ, వెల్లుల్లిపై పూర్తి నిషేధం ఉంది. ఇక్కడ ఉల్లిపాయలను పండించడం కానీ, మార్కెట్లలో విక్రయించడం కానీ చట్టరీత్యా నేరం.

కట్రాలోని స్థానిక కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు లేదా హోటళ్లలో కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి ఎక్కడా లభించవు. రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న ధాబాల నుండి పెద్ద పెద్ద స్టార్ హోటళ్ల వరకు ఎక్కడా వీటిని వాడరు. ఇక్కడ దొరికే భోజనంలో ఎప్పుడు కూడా ఉల్లిపాయను అస్సలు ఉపయోగించరు. ఈ ప్రాంతంలో ఉల్లిపాయలు అమ్మే ధైర్యం ఏ వ్యాపారి చేయరు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు లేదా భక్తులు ఎవరైనా సరే ఈ నియమాన్ని పాటించాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎందుకు నిషేధం?
Image Credit : Getty

ఎందుకు నిషేధం?

ఉల్లిపాయలను నిషేధించడానికి ప్రధాన కారణం ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడడమే. మాతా వైష్ణో దేవిని దర్శించుకోవడానికి ప్రతి ఏటా దేశవిదేశాల నుండి కోట్లాది మంది భక్తులు కాలినడకన తరలివస్తుంటారు. ఈ యాత్రను ఎంతో పవిత్రంగా కఠినమైన ఉపవాస దీక్షలతో కట్రా గ్రామం నుంచి మొదలుపెడతారు. హిందూ సనాతన ధర్మం, ఆయుర్వేద తత్వశాస్త్రం ప్రకారం ఆహారాన్ని సాత్విక, రాజసిక, తామసిక అని మూడు రకాలుగా విడదీశారు. ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లిని 'తామసిక' (Tamasic) ఆహారాలుగా పరిగణిస్తారు. ఇవి శరీరంలో అనవసరమైన వేడిని, బద్ధకాన్ని, మనస్సులో క్రోధాన్ని, కామాన్ని, ప్రతికూల ఆలోచనలను కలిగిస్తాయని నమ్ముతారు. ఇవి మనస్సును చంచలం చేసి ఆధ్యాత్మిక ధ్యానానికి ఆటంకం కలిగిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కట్రా నగరం పవిత్రమైన వైష్ణో దేవి ఆలయానికి ప్రధాన ప్రవేశ ద్వారం.. కాబట్టి ఈ ప్రాంతమంతా పూర్తి పవిత్రంగా ఉండాలని 'సాత్విక' వాతావరణాన్ని కాపాడేందుకు ఉల్లిపాయలు, వెల్లుల్లిని నిషేధించారు.

Related Articles

Related image1
Mutton: గొర్రె మాంసాన్ని మటన్ అని పిలిస్తే.. మరి మేక మాంసాన్ని ఏమంటారు?
Related image2
Hair Business: చిక్కు వెంట్రుకలకు గిన్నెలు ఇచ్చే వ్యాపారం.. ఆ జుట్టుతో విదేశాల్లో వేల కోట్ల బిజినెస్
33
ఉల్లిపాయలకు బదులుగా ఏం వాడతారు?
Image Credit : Getty

ఉల్లిపాయలకు బదులుగా ఏం వాడతారు?

కట్రాలో ఉన్న హిందువులే కాకుండా, ఇక్కడ నివసించే ఇతర మతాల వారు కూడా ఈ సంప్రదాయాన్ని గౌరవించడం విశేషం. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి, రహస్యంగా వీటిని రవాణా చేయడానికి లేదా విక్రయించడానికి ప్రయత్నిస్తే స్థానికులు కఠినంగా శిక్షిస్తారు. ఉల్లిపాయ, వెల్లుల్లి ఉపయోగించనంత మాత్రాన ఇక్కడ లభించే ఫుడ్ ఏమాత్రం రుచి లేకుండా చప్పగా ఉంటుందని అనుకోకండి. కట్రాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలలో దొరికే సాత్విక భోజనం చాలా రుచికరంగా పోషకాలతో నిండి ఉంటుంది. ఇక్కడి వంటగాళ్లు ఉల్లిపాయకు బదులుగా ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి, టొమాటోలు, వివిధ రకాల మసాలాలు వాడుతారు. ఇక్కడ వండే పప్పులు, కూరలు, ప్రత్యేకమైన కాశ్మీరీ వంటకాలు పర్యాటకులను బాగా నచ్చుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jail Food : జైలులోని ఖైదీలకు ఏమేం ఫుడ్ ఐటమ్స్ పెడతారో తెలుసా?
Recommended image2
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Recommended image3
Snakes : మనుషుల్లాగే పాములు కూడా స్నానం చేస్తాయా? నీటిలో ఎక్కువగా ఎందుకుంటాయి?
Related Stories
Recommended image1
Mutton: గొర్రె మాంసాన్ని మటన్ అని పిలిస్తే.. మరి మేక మాంసాన్ని ఏమంటారు?
Recommended image2
Hair Business: చిక్కు వెంట్రుకలకు గిన్నెలు ఇచ్చే వ్యాపారం.. ఆ జుట్టుతో విదేశాల్లో వేల కోట్ల బిజినెస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved