MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Hair Business: చిక్కు వెంట్రుకలకు గిన్నెలు ఇచ్చే వ్యాపారం.. ఆ జుట్టుతో విదేశాల్లో వేల కోట్ల బిజినెస్

Hair Business: చిక్కు వెంట్రుకలకు గిన్నెలు ఇచ్చే వ్యాపారం.. ఆ జుట్టుతో విదేశాల్లో వేల కోట్ల బిజినెస్

Hair Business: దువ్వినప్పుడు కొంత జుట్టు రాలిపోతుంది. ఆ జుట్టును దాచి వీధుల్లో వచ్చే చిక్కు వెంట్రుకల వ్యాపారానికి ఇస్తే కొన్ని గిన్నెలు ఇస్తారు. మరి వాళ్లు ఆ జుట్టును ఏం చేస్తారు? జుట్టుతో జరిగే వ్యాపారం ఏంటి? 

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 08 2026, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఏమిటీ చిక్కువెంట్రుకల వ్యాపారం?
Image Credit : Gemini AI

ఏమిటీ చిక్కువెంట్రుకల వ్యాపారం?

వీధుల్లో కొంతమంది మహిళలు తిరుగుతూ చిక్కు వెంట్రుకలు కొంటామని అడుగుతూ ఉంటారు. వాళ్లు వెంట్రుకలకు గిన్నెలు కూడా బదులుగా ఇస్తూ ఉంటారు. మనం దువ్వినప్పుడు జుట్టు ఎంతోకొంత రాలుతుంది. దాన్ని అలా మూడు నాలుగు నెలల పాటూ దాచి ఇలా గిన్నెలు, డబ్బులకు అమ్ముతూ ఉంటారు ప్రజలు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఊడిపోయిన వెంట్రుకలతో వాళ్లు ఏం చేస్తారు? మన దేశంలో మహిళల జుట్టు సహజంగానే పొడవుగా, నల్లగా, ఒత్తుగా ఉంటుంది. దీనికి ఎలాంటి కెమికల్ రంగులు పెద్దగా వాడరు. దీని వల్లే విదేశాల్లో మనదేశానికి భారీ డిమాండ్ ఉంది. భారతదేశం నుండి ప్రతి ఏటా మిలియన్ల డాలర్ల విలువైన జుట్టును చైనా, అమెరికా, యూరప్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. తిరుమల (TTD) వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల ఈ-వేలంలో కేవలం తలనీలాల ద్వారానే వందల కోట్ల ఆదాయం లభిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ వ్యాపారం ఎలా చేస్తారు?
Image Credit : Getty

ఈ వ్యాపారం ఎలా చేస్తారు?

వీధుల్లో తిరుగుతూ మీ దగ్గర తీసుకున్న జుట్టును నేరుగా విదేశాలకు పంపరు. దీని వెనుక పెద్ద ప్రాసెసింగ్ ప్రక్రియ జరుగుతుంది. చిన్న వ్యాపారుల నుండి సేకరించిన జుట్టును చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన హబ్‌లలోని ఫ్యాక్టరీలకు పంపిస్తారు. అక్కడ ప్రత్యేక షాంపూలతో ఆ జుట్టును శుభ్రం చేస్తారు, రసాయన ద్రావణాలలో ఉంచి క్రిమిరహితంగా మారుస్తారు. తరువాత అత్యాధునిక యంత్రాల సాయంతో చిక్కులు తీసి, స్ట్రెయిట్ చేసి, పొడవును బట్టి గ్రేడింగ్ నిర్వహిస్తారు. విదేశాల్లో విగ్గుల తయారీకి, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియల కోసం ఈ జుట్టును వాడతారు. ఇందుకోసం ముఖ్యంగా 8 అంగుళాల పొడవున్న జుట్టును ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీనికి ఎక్కువ ధరను చెల్లిస్తారు.

Related Articles

Related image1
Dancing Girl: ఆ డ్యాన్సర్ కోసం భారత్‌తో గొడవకు దిగిన పాకిస్థాన్.. ఎవరా నాట్యకారిణి?
Related image2
Ghee Storage: ఇంట్లో చేసిన నెయ్యి ఏడాది పాటు తాజాగా ఉండాలంటే ఈ తప్పు మాత్రం చేయకండి
33
ఎంత లాభం వస్తుంది?
Image Credit : Getty

ఎంత లాభం వస్తుంది?

చిక్కు వెంట్రుకల వ్యాపారంలో జుట్టు పొడవు, జుట్టు నాణ్యతపై ఆధారపడి ఉంటాయి. మంచి నాణ్యమైన జుట్టుకు ఎక్కువ డబ్బు దక్కుతుంది.

తక్కువ నాణ్యత గల జుట్టుకు కిలోకు రూ. 10,000 నుండి రూ. 12,000 వరకు డబ్బును చెల్లిస్తారు. మీడియం నాణ్యత కలిగిన జుట్టుకు కిలోకు రూ. 25,000 నుండి రూ. 30,000 వరకు ధర లభిస్తుంది. ఇక మంచి నాణ్యత కలిగిన పొడవాటి జుట్టుకు మార్కెట్లో కిలోకు ఏకంగా రూ. 50,000 పైనే పలుకుతుంది. అందుకే కొంతమంది మహిళలు వీధుల్లో తిరుగుతూ జుట్టును సేకరిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌
Recommended image2
Psychology: నచ్చినవాళ్లు మనల్ని పట్టించుకోకపోతే ఎందుకు బాధగా అనిపిస్తుంది? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image3
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Related Stories
Recommended image1
Dancing Girl: ఆ డ్యాన్సర్ కోసం భారత్‌తో గొడవకు దిగిన పాకిస్థాన్.. ఎవరా నాట్యకారిణి?
Recommended image2
Ghee Storage: ఇంట్లో చేసిన నెయ్యి ఏడాది పాటు తాజాగా ఉండాలంటే ఈ తప్పు మాత్రం చేయకండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved