MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • AC Remote: ఏసీ రిమోట్ తెల్లగా ఉంటే.. టీవీ రిమోట్ నల్లగా ఉంటుంది, ఎందుకో తెలుసా?

AC Remote: ఏసీ రిమోట్ తెల్లగా ఉంటే.. టీవీ రిమోట్ నల్లగా ఉంటుంది, ఎందుకో తెలుసా?

AC Remote: ప్రతి ఇంట్లో ఇప్పుడు టీవీ, ఏసీ ఉంటున్నాయి. వాటి రిమోట్ లను ఒకసారి చూడండి. ఒకటి నల్లగా ఉంటే, ఒకటి తెల్లగా ఉంటుంది. ఏసీ రిమోట్ తెల్లగా, టీవీ రిమోట్ నల్లగా ఎందుకు ఉంటాయి?

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 12 2026, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఏసీ రిమోట్ తెల్లగా ఎందుకు ఉంటుంది?
Image Credit : chatgpt

ఏసీ రిమోట్ తెల్లగా ఎందుకు ఉంటుంది?

ప్రతి ఇంట్లోనూ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీ, ఏసీలు. ఇవి రెండూ రిమోట్లతోనే పనిచేస్తాయి. అందులో ఏసీ రిమోట్ చూడండి తెల్లగా ఉంటుంది. ఇక టీవీ రిమోట్ నల్లగా ఉంటుంది. ఇలాంటి డిజైన్ వెనుక ఓ కారణం ఉంటుంది. వాటి ఆకారం, రంగు.. ఇలా ప్రతీది ఓ లెక్క ప్రకారమే డిజైనింగ్ జరుగుతుంది.

ఏసీ యూనిట్లన్నీ తెల్లగానే ఉంటాయి. ఏసీకి మ్యాచ్ అయ్యేలా ఉండేందుకే రిమోట్‌ను కూడా అదే రంగులో డిజైన్ చేస్తారు. దీనివల్ల మొత్తం ప్రొడక్ట్ ఒకే స్టైల్‌లో కనిపిస్తుంది. ఇది ఇంటి ఇంటీరియర్ డిజైన్‌కు కూడా బాగా సెట్ అవుతుంది. బెడ్‌రూమ్‌లు, ఆఫీసుల్లో లేత రంగులు ప్రశాంతతను ఇస్తాయని డిజైనర్లు నమ్ముతారు.

ఏసీ రిమోట్ తెల్లగా ఉండేందుకు ముఖ్యమైన కారణం వేడి. తెలుపు రంగు వేడిని తక్కువగా గ్రహిస్తుంది. నలుపు రంగు వేడిని ఎక్కువగా పీల్చుకుంటుంది. ఏసీ రిమోట్‌ను ఎక్కువసేపు గదిలో, కిటికీ దగ్గర లేదా ఎక్కువ కాంతి ఉన్న చోట ఉంచినా, తెలుపు రంగు వల్ల అది అంతగా వేడెక్కదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టీవీ రిమోట్ నల్లగా ఎందుకు?
Image Credit : Pixabay

టీవీ రిమోట్ నల్లగా ఎందుకు?

ఇక టీవీ రిమోట్‌ల విషయానికొస్తే.. ఇవి సాధారణంగా నలుపు రంగులో ఉంటాయి. దీనికి ప్రధాన కారణం వాటిని వాడే విధానం. టీవీ రిమోట్‌ను రోజులో చాలాసార్లు తాకుతాం. ఇంట్లో అందరూ దాన్ని పట్టుకుంటారు. దీంతో చేతి మురికి, చెమట, నూనె మరకలు త్వరగా పడతాయి. నలుపు రంగు అయితే ఈ మరకలు అంత సులభంగా కనిపించవు. అందుకే కంపెనీలు ఎక్కువగా ముదురు రంగులనే ఎంచుకుంటాయి.
33
రిమోట్ రంగుల వెనుకున్న అర్థం
Image Credit : Getty

రిమోట్ రంగుల వెనుకున్న అర్థం

టీవీ రిమోట్‌లపై బటన్లు అధికంగా ఉంటాయి. వాటిపై ఉన్న అక్షరాలు, నంబర్లు స్పష్టంగా కనిపించాలంటే నలుపు రంగు బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల బటన్లను సులభంగా గుర్తించవచ్చు. నలుపు రంగు టెక్నాలజీ, పవర్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు చిహ్నంగా కూడా పరిగణిస్తారు.

టీవీలు, సౌండ్ సిస్టమ్‌లు, సెట్-టాప్ బాక్స్‌లు వంటివి ఎక్కువగా నలుపు రంగులోనే కనిపిస్తాయి. వీటికి సరిపోయేలా రిమోట్‌లను కూడా అదే రంగులో తయారు చేస్తారు. కంపెనీలు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఈ రంగులను ఎంపిక చేస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మరణం తర్వాత మ‌నిషి శరీరంలో ఏం జరుగుతుంది? మొదట మారేది ఇదే..
Recommended image2
Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Recommended image3
Gold Hating Country: ఈ దేశంలో బంగారమంటేనే పడదు, గోల్డ్ జ్యూయలరీ వేసుకోవడం పెద్ద వింత
Related Stories
Recommended image1
పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి? వాటిలో ఎలాంటి ఆహారాలు ఉంటాయి?
Recommended image2
Hamsa: హంసలను చూడాలనుకుందా? వాటిని గుంపులుగా ఒకేచోట చూడాలంటే ఇక్కడికి వెళ్లండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved