MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • Psychology: సైకాలజీ ప్రకారం ఏ పని చేయాలి అనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

Psychology: సైకాలజీ ప్రకారం ఏ పని చేయాలి అనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

Psychology: కొన్నిసార్లు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నా ఏ పని చేయాలనిపించదు. తర్వాత చేద్దాంలే అంటూ వాయిదా వేస్తుంటాం. ఇష్టమైన పనులు చేయడానికి కూడా ఉత్సాహంగా అనిపించదు. అసలు ఎందుకు ఇలా అనిపిస్తుంది? దీని వెనుక కారణమేంటి? సైకాలజీ ఏం చెబుతోందో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 11 2026, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏ పని చేయాలనిపించకపోవడానికి కారణాలు
Image Credit : AI

ఏ పని చేయాలనిపించకపోవడానికి కారణాలు

ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి ఏ పని చేయాలి అనిపించకపోవడం, ఇష్టమైన పనులపై కూడా ఆసక్తి లేకపోవడం, చిన్న పని చేయాలన్నా బద్ధకంగా అనిపించడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే అనుభవమే. అయితే ఇది ప్రతిసారీ బద్ధకం అని అనుకోవడం సరైంది కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు సైకాలజీ నిపుణులు. అవేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మానసిక అలసట
Image Credit : AI Generated

మానసిక అలసట

సైకాలజీ నిపుణుల ప్రకారం మనకు ఏ పని చేయాలనిపించకపోవడానికి ముఖ్యమైన కారణం మానసిక అలసట. రోజంతా పని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, సంబంధాల్లో ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే మెదడుకు తగిన విశ్రాంతి ఉండదు. బయటకు పెద్దగా శారీరక పని చేయకపోయినా మనసు మాత్రం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో సాధారణ పనులు కూడా పెద్ద భారంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఒకేసారి ఎన్నో పనులు చేయాల్సి వస్తున్నప్పుడు “ముందు ఏం చేయాలి?” అనే ఆలోచన కూడా ఒత్తిడిని పెంచి పనిని ప్రారంభించే ఉత్సాహాన్ని తగ్గించవచ్చు.

Related Articles

Related image1
Psychology: సైకాలజీ ప్రకారం మీపై క్రష్ ఉన్న వాళ్లు అనుకోకుండా చేసే 5 పనులు ఇవే!
Related image2
Psychology: సైకాలజీ ప్రకారం మనిషికి ఎక్కువ కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా?
36
నిద్ర సరిగా లేకపోవడం
Image Credit : Gemini

నిద్ర సరిగా లేకపోవడం

రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, తరచూ నిద్ర లేవడం లేదా ఎక్కువసేపు నిద్రపోయినా విశ్రాంతిగా అనిపించకపోవడం వల్ల మరుసటి రోజు శక్తి తగ్గిపోవచ్చు. అలసటతో పాటు ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. డిప్రెషన్‌లో కూడా నిద్రలో మార్పులు, శక్తి తగ్గడం, ఆసక్తి కోల్పోవడం, ప్రేరణ లేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

46
ఫలితాల గురించి మాత్రమే ఆలోచించడం
Image Credit : AI

ఫలితాల గురించి మాత్రమే ఆలోచించడం

ఈ పని పూర్తి చేయాలి, ఈ టైం లోపు అయిపోవాలి, నేను తప్పకుండా విజయం సాధించాలి.. అనే ఒత్తిడి ఎక్కువైతే పని చేయడం హ్యాపిగా కాకుండా భారంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక పెద్ద పనిని మొత్తం ఒకేసారి పూర్తి చేయాలని ప్రయత్నిస్తే మెదడుకు చాలా కష్టమైన లక్ష్యంగా కనిపించవచ్చు. దానివల్ల పని ప్రారంభించడానికే మనసు వెనుకాడుతుంది. అందుకే పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి.. ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పనిని ఎంచుకోవడం మంచి పద్ధతి.

56
ఇష్టపడే పనులపై కూడా ఆసక్తి తగ్గిపోవడం
Image Credit : AI

ఇష్టపడే పనులపై కూడా ఆసక్తి తగ్గిపోవడం

సినిమాలు చూడటం, స్నేహితులతో మాట్లాడటం, బయటకు వెళ్లడం వంటి మనసుకు ఆనందాన్ని ఇచ్చే పనులపై కూడా ఆసక్తి తగ్గిపోతే, దాన్ని కేవలం బద్ధకం అని కొట్టిపారేయడం కరెక్ట్ కాదు. రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువకాలం ఆసక్తి, ఆనందం, ప్రేరణ తగ్గడంతో పాటు విచారం, నిస్సహాయత, అలసట, నిద్ర లేదా ఆకలిలో మార్పులు కనిపిస్తే డిప్రెషన్ వంటి సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

66
విమర్శలు వద్దు
Image Credit : AI

విమర్శలు వద్దు

సైకాలజీ నిపుణుల ప్రకారం మీ గురించి మీరే.. నేను చాలా బద్ధకస్తుడిని, నాతో ఏ పనీ కాదు.. అని పదేపదే విమర్శించుకోవడం కరెక్ట్ కాదు. అది సమస్యను మరింత పెంచవచ్చు. దానికి బదులు ఫస్ట్ చిన్న పని నుంచి మొదలు పెట్టి చూద్దాం అని పాజిటివ్ గా ఆలోచించడం మంచిది. అయితే రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువకాలం ఏ పని చేయాలి అనిపించకపోతే, మానసిక ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సచిన్, ధోని, రోహిత్, కోహ్లీ లకు ఆడపిల్లలే పుట్టడానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
Nepal Tourism : నేపాల్ లో ఇండియన్స్ అత్యధికంగా సందర్శించే టూరిస్ట్ స్పాట్స్ ఇవే..
Recommended image3
Facilities in Jail : జైల్లో ఖైదీలకు బెడ్, పరుపు, దుప్పటి ఇస్తారా? స్నానానికి సబ్బు సంగతేంటి?
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం మీపై క్రష్ ఉన్న వాళ్లు అనుకోకుండా చేసే 5 పనులు ఇవే!
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం మనిషికి ఎక్కువ కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved