MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Idli Podi: స్పెషల్ ఇడ్లీ కారం పొడి.. దీంతో ఎన్ని ఇడ్లీలైనా తినేయాలనిపిస్తుంది

Idli Podi: స్పెషల్ ఇడ్లీ కారం పొడి.. దీంతో ఎన్ని ఇడ్లీలైనా తినేయాలనిపిస్తుంది

Idli Podi: ఇడ్లీలు చట్నీతోనే కాదు కారం పొడితో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ మేము స్పెషల్ ఇడ్లీ కారం పొడి రెసిపీ ఇచ్చాము. దీన్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నువ్వులు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వంటి వాటితో దీన్ని తయారు చేస్తారు.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 04 2026, 06:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
స్పెషల్ ఇడ్లీ పొడి రెసిపీ
Image Credit : Pinterest

స్పెషల్ ఇడ్లీ పొడి రెసిపీ

ఇడ్లీ, దోశల్లోకి ఎన్ని రకాల చట్నీలు, సాంబార్ ఉన్నా.. పక్కన కారంపొడి ఉంటే ఆ కిక్కే వేరు. ముఖ్యంగా తిరునెల్వేలి వాళ్లు చేసే ఇడ్లీ పొడికి ఓ ప్రత్యేకమైన రుచి, వాసన ఉంటాయి. వేయించిన పప్పులు, ఎండుమిర్చి, నువ్వులు కలిపి చేసే ఈ పొడిని వేడి వేడి ఇడ్లీల మీద చల్లి, కాస్త నువ్వుల నూనె వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. దీన్ని ఇంట్లోనే ఒకసారి చేసుకుంటే మూడు నుంచి ఆరు నెలలు తినవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇడ్లీ కారం పొడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
Image Credit : Pinterest

ఇడ్లీ కారం పొడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పొట్టులేని మినపప్పు - 1/2 కప్పు

శనగపప్పు - 1/2 కప్పు

ఎండుమిర్చి - 12 నుంచి 15

నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు

ఇంగువ - 1/2 టీస్పూన్

కరివేపాకు - గుప్పెడు

ఉప్పు - తగినంత

నువ్వుల నూనె - 1 టీస్పూన్

33
ఇడ్లీ కారం పొడి రెసిపీ
Image Credit : Pinterest

ఇడ్లీ కారం పొడి రెసిపీ

  1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయకుండా శనగపప్పు, మినపప్పు విడివిడిగా వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి.

2. పప్పులు దోరగా వేగి మంచి వాసన వచ్చేదాకా వేయించాలి. మరీ మాడిపోతే ఇడ్లీ పొడి చేదుగా వస్తుంది.

3. అదే కళాయిలో నువ్వులు వేసి మీడియం మంట మీద వేయించాలి. నువ్వులు వేడెక్కాక చిటపటలాడుతూ మంచి వాసన వస్తాయి. వెంటనే స్టవ్ ఆపేయాలి.

4. వీటిని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు పాన్‌లో కాస్త నువ్వుల నూనె వేసి ఎండుమిర్చి వేయించాలి. రంగు మారకుండా మంచి వాసన వచ్చేదాకా మాత్రమే వేయించాలి.

5. అందులోనే కరివేపాకు కూడా వేసి కరకరలాడేలా వేయించుకోవాలి. చివరగా ఇంగువ వేసి రెండు సెకన్లు కలిపి స్టవ్ ఆపేయాలి.

6. వేయించినవన్నీ బాగా చల్లారాక.. ముందుగా ఎండుమిర్చి, ఉప్పు, ఇంగువ మిక్సీ జార్‌లో వేసి బరకగా గ్రైండ్ చేయాలి.

7. ఆ తర్వాత వేయించిన పప్పులు వేసి మిక్సీ పట్టాలి. చివరగా వేయించిన నువ్వులు వేసి ఒకట్రెండు సార్లు మాత్రమే తిప్పాలి.

8. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉంటేనే.. ఇడ్లీ పొడి తినేటప్పుడు పప్పులు, నువ్వుల టేస్ట్ బాగా తెలుస్తుంది. అంతే ఇడ్లీ పొడి రెడీ అయినట్టే. వేడి వేడి ఇడ్లీపై ఈ పొడి చల్లుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
భార్య ఏడాదిగా పుట్టింట్లో ఉంటే.. భ‌ర్త విడాకులు తీసుకోవ‌చ్చా? చ‌ట్టం ఏం చెబుతోంది
Recommended image2
Necklace Designs: అర తులంలో అదిరిపోయే నక్లెస్ డిజైన్లు
Recommended image3
Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ
Related Stories
Recommended image1
White Clothes: తెల్లడ్రెస్సులు కొత్తవాటిలా మెరవాలంటే ఈ పదార్థాలను ఉపయోగించండి చాలు
Recommended image2
Generic Medicine: జనరిక్ మెడిసిన్ అంటే ఏమిటి? జనరిక్ మందులకు, బ్రాండెడ్ మందులకు తేడా ఏమిటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved