MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • Facts : అమెరికా ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఎందుకు కనిపించవో తెలుసా?

Facts : అమెరికా ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఎందుకు కనిపించవో తెలుసా?

భారత్‌లో లాగా అమెరికాలో ప్రజలు గ్యాస్ సిలిండర్లు కొనరు. మరి వాళ్ల ఇళ్లకు వంట గ్యాస్ ఎలా సరఫరా అవుతుంది? ఈ ఆసక్తికరమైన విషయాలను ఈ ఫొటో గ్యాలరీలో వివరంగా చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 22 2026, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెరికాలో ప్రజలు గ్యాస్ సిలిండర్లు ఎందుకు వాడరు?
Image Credit : Gemini AI

అమెరికాలో ప్రజలు గ్యాస్ సిలిండర్లు ఎందుకు వాడరు?

ప్రపంచంలో యుద్ధాల కారణంగా భారత్‌లో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఎల్పిజి గ్యాస్ ధరలు పెరిగాయి… అయినా సిలిండర్లు దొరకడంలేదు. ఖాళీ సిలిండర్లతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. సిలిండర్ బుక్ చేసి డెలివరీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అమెరికాలో ఇలాంటి పరిస్థితి లేదు. అక్కడి ప్రజల ఇళ్లకు వంట గ్యాస్ చాలా సులభమైన పద్ధతిలో అందుతుంది. అమెరికాలో వంట గ్యాస్ ఎలా సరఫరా చేస్తారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అమెరికాలో పైపుల ద్వారా గ్యాస్ సరఫరా
Image Credit : ChatGPT

అమెరికాలో పైపుల ద్వారా గ్యాస్ సరఫరా

అమెరికా నగరాల్లో 90 శాతానికి పైగా ఇళ్లకు పైపుల ద్వారానే నేచురల్ గ్యాస్ సరఫరా అవుతుంది. మనకు మంచినీటి పైపులు ఉన్నట్లే, అక్కడ రోడ్ల కింద గ్యాస్ పైపులైన్లు ఉంటాయి. అక్కడి నుంచి ప్రతి ఇంటికీ ప్రత్యేక కనెక్షన్ ఇచ్చి, నేరుగా వంటగదిలోని స్టవ్‌కు కలుపుతారు. ఇంటి బయట ఒక మీటర్ ఉంటుంది. మీరు ఎంత గ్యాస్ వాడారో ఆ మీటర్ కచ్చితంగా లెక్కిస్తుంది. నెల చివర్లో కరెంట్ బిల్లు కట్టినట్టు ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. గ్యాస్ అయిపోతుందన్న టెన్షనే అమెరికా ప్రజలకు ఉండదు.

Related Articles

Related image1
Free LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎవరికి ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి?
Related image2
Now Playing
జూన్ 30 తర్వాత సబ్సిడీ రాదు.. కేంద్రం కీలక నిర్ణయం! | LPG Gas EKYC telugu | Asianet News Telugu
35
అమెరికాా గ్రామాలకు గ్యాస్ కనెక్షన్ ఎలా ఇస్తారు?
Image Credit : Getty

అమెరికాా గ్రామాలకు గ్యాస్ కనెక్షన్ ఎలా ఇస్తారు?

నగరాలు దాటి పైప్‌లైన్ సౌకర్యం లేని గ్రామాలు, ఫామ్‌హౌస్‌లలో మన దగ్గర లాగే LPG సిలిండర్లు అందుబాటులో ఉంటాయి. కానీ వాళ్లు చిన్న సిలిండర్లు వాడరు. వారి ఇంటి వెనకాల లేదా తోటలో 100 నుంచి 500 గ్యాలన్ల (సుమారు 400 నుంచి 2000 లీటర్లు) సామర్థ్యం గల పెద్ద గ్యాస్ ట్యాంకులు ఉంటాయి. ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు పెద్ద లారీల్లో వచ్చి కొన్ని నెలలకు ఒకసారి నేరుగా ఆ ట్యాంకులను నింపి వెళ్తాయి. చాలా ఇళ్లలో ఉండే స్మార్ట్ మీటర్లు, గ్యాస్ లెవెల్ తగ్గగానే ఆటోమేటిక్‌గా కంపెనీకి సమాచారం పంపుతాయి. దాంతో వాళ్లే వచ్చి నింపి వెళ్తారు.

45
అమెరికాలో ఎలక్ట్రిక్ స్టవ్‌లదే హవా
Image Credit : Chat gpt

అమెరికాలో ఎలక్ట్రిక్ స్టవ్‌లదే హవా

అమెరికాలో చాలా ఇళ్లలో గ్యాస్‌కు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్‌లనే వంటకు వాడతారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో భద్రతా కారణాలు, పర్యావరణ నిబంధనల వల్ల గ్యాస్ కనెక్షన్లకు బదులుగా పూర్తిగా ఇండక్షన్ స్టవ్‌లనే ఉపయోగిస్తున్నారు. అమెరికన్లు చాలా సందర్భాల్లో సిలిండర్లు కొనరు. కానీ, ఇంటి వెనకాల బార్బెక్యూ గ్రిల్ చికెన్ చేయడానికి, చలికాలంలో ఇంటిని వెచ్చగా ఉంచే అవుట్‌డోర్ హీటర్ల కోసం చిన్న ప్రొపేన్ సిలిండర్లను వాడతారు. అవి ఖాళీ అయితే, దగ్గరలోని సూపర్ మార్కెట్ లేదా పెట్రోల్ బంకుల్లో ఇచ్చి కొత్తవి తీసుకుంటారు.

55
భారత్‌లోనూ PNG రాబోతోంది
Image Credit : X

భారత్‌లోనూ PNG రాబోతోంది

అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక టెక్నాలజీ కారణంగా అమెరికా ప్రజలు సిలిండర్ బుక్ చేసే అవసరం లేకుండా 24 గంటలూ వంట గ్యాస్ పొందుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో కూడా చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) విధానం వేగంగా వస్తోంది. ఈ విధానంలో భూగర్భ పైపుల ద్వారా ఇళ్లకు నేచురల్ గ్యాస్ సరఫరా చేస్తారు. ఈ పథకం త్వరలో పూర్తిగా అమలైతే, భారత ప్రజలు కూడా 24 గంటలూ ఎలాంటి ఆటంకం లేకుండా వంట గ్యాస్ పొందవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Raksha Bandhan: అక్క లేదా చెల్లెలు లేకపోతే రాఖీ ఎవరు కట్టాలి? చరిత్ర చెప్పే నిజాలు ఇవే
Recommended image2
Chanakya Niti : మనిషి దగ్గర ఎంతున్నా.. ఇంకా కావాలనిపించేవి ఏవి?
Recommended image3
Cyber Scam Alert : మీ అకౌంట్లో డబ్బులు పడ్డట్లు మెసేజ్ వచ్చిందో తస్మాత్ జాగ్రత్త... ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Free LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎవరికి ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి?
Recommended image2
Now Playing
జూన్ 30 తర్వాత సబ్సిడీ రాదు.. కేంద్రం కీలక నిర్ణయం! | LPG Gas EKYC telugu | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved