MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • House Construction Tips : గోడలకు పగుళ్లు రాకూడదా? అయితే ఇళ్లు కట్టేటప్పుడే ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి

House Construction Tips : గోడలకు పగుళ్లు రాకూడదా? అయితే ఇళ్లు కట్టేటప్పుడే ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి

House Construction: కొత్తగా కట్టినప్పటికీ కొన్ని ఇళ్ల గోడలకు అప్పుడే పగుళ్లు రావడం, చెమ్మ చేరడం లేదా ప్లాస్టరింగ్ ఊడిపోవడం లాంటివి చూస్తుంటాం. ఇల్లు కట్టేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 28 2026, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1. ఇటుకలను తడపండి
Image Credit : Gemini AI

1. ఇటుకలను తడపండి

ఇల్లు కట్టేటప్పుడు గోడల బలం కేవలం ఇటుకలు, సిమెంట్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు... వాడే మెటీరియల్ క్వాలిటీ, కట్టే విధానం, క్యూరింగ్ అన్నీ ముఖ్యమే. ముందుగా ఇటుకలు, సిమెంట్, ఇసుక, నీళ్ల క్వాలిటీని చెక్ చేసుకోవాలి… నాణ్యమైన వాటినే ఇంటి నిర్మాణానికి ఉపయోగించాలి.

ఇటుకలను వాడే ముందు వాటిని బాగా తడపాలి... లేదంటే అవి సిమెంట్ లోని నీటిని పీల్చేసుకుని గోడ బలాన్ని తగ్గిస్తాయి.అలాగే ఇంటి నిర్మాణానికి వాడే ఇసుకలో మట్టి, రాళ్లు, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. ఇక సిమెంట్ కొనేటప్పుడు తయారీ తేదీని కచ్చితంగా గమనించాలి… గడ్డకట్టిన సిమెంట్ వాడకపోవడమే మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2. ఉప్పునీటిని అస్సలు వాడకండి
Image Credit : Chatgpt

2. ఉప్పునీటిని అస్సలు వాడకండి

ఇంటి నిర్మాణానికి ఉప్పు నీటిని అస్సలు వాడకూడదు. ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిని వాడితే గోడలపై తెల్లటి మచ్చలు రావడం, చెమ్మ చేరడం, ప్లాస్టరింగ్ ఊడిపోవడం లాంటివి జరుగుతాయి.

ఇల్లు కట్టడం మొదలుపెట్టే ముందే ఫ్లోర్ ప్లాన్, డ్రాయింగ్స్ అన్నీ రెడీగా ఉంచుకోవాలి. తలుపులు, కిటికీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పాయింట్లు ఎక్కడ వస్తాయో ముందే డిసైడ్ చేసుకుంటే.. తర్వాత గోడలు పగలగొట్టే పని తప్పుతుంది.

35
3. ఇసుక, సిమెంట్ ఎంత రేషియోలో కలపాలో తెలుసుకొండి
Image Credit : Generated by google gemini AI

3. ఇసుక, సిమెంట్ ఎంత రేషియోలో కలపాలో తెలుసుకొండి

ఇంటి గోడలు కట్టేటప్పుడు సిమెంట్, ఇసుక కలిపే రేషియో చాలా ముఖ్యం. అన్ని గోడలకూ ఒకే రేషియోలో వీటిని వాడటం కరెక్ట్ కాదు. గోడ రకం, దానిపై పడే బరువును బట్టి ఇంజనీర్ ఈ రేషియోను డిసైడ్ చేస్తారు. ఇండియన్ కన్‌స్ట్రక్షన్ స్పెసిఫికేషన్స్ ప్రకారం కొన్ని ఇటుక పనులకు 1:4 రేషియో వాడతారు.

సిమెంట్, ఇసుక మిశ్రమం మరీ నీళ్లలా ఉండకూడదు… అలాగని మరీ పొడిగానూ ఉండకూడదు. గోడ కట్టడం మొదలుపెట్టే చోట శుభ్రం చేసి, తగినంత తడి ఉండేలా చూసుకోవాలి. తగిన మోతాదులో సిమెంట్, ఇసుక కలిపితే గోడకు పగుళ్లు రాకుండా ఉంటాయి.

45
4. ఒకేసారి పెద్దపెద్ద గోడలు కట్టకూడదు
Image Credit : Generated by google gemini AI

4. ఒకేసారి పెద్దపెద్ద గోడలు కట్టకూడదు

పిల్లర్, గోడ కలిసే చోట కచ్చితంగా సరైన జాయింట్ ఉండేలా చూసుకోవాలి. పగుళ్లు వచ్చే అవకాశం ఉన్న చోట ప్లాన్ ప్రకారం మెష్ (వల) వాడాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. ఒకేరోజు గోడను మరీ ఎత్తుగా కట్టేయకూడదు. గోడ ఎత్తు, ఇటుక రకం, వాడే సిమెంట్ మిశ్రమాన్ని బట్టి ఇంజనీర్ చెప్పినట్లుగా కట్టాలి. మేస్త్రీకి అనుభవం ఉన్నప్పటికీ, ప్లాన్ ప్రకారమే పనులు జరుగుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

55
5. క్యూరింగ్ చాలా ముఖ్యం
Image Credit : Gemini AI

5. క్యూరింగ్ చాలా ముఖ్యం

గోడ కట్టడం పూర్తయ్యాక క్యూరింగ్ చేయడాన్ని చాలామంది లైట్ తీసుకుంటారు. సిమెంట్ మిశ్రమానికి బలం రావాలంటే కచ్చితంగా కొన్ని రోజుల పాటు నీళ్లు పట్టాలి. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) రూల్స్ ప్రకారం.. ఇటుకతో కట్టిన గోడలను కనీసం 7 రోజుల పాటు తడిగా ఉంచాలి. పని అయిపోయింది కదా ఇక నీళ్లు అవసరం లేదు అనుకోవడం పొరపాటు. వాతావరణం, వాడిన మెటీరియల్‌ను బట్టి ఇంజనీర్ సలహా మేరకు క్యూరింగ్ చేయాలి.

గోడల పగుళ్లకు మరిన్ని కారణాలు..

పునాది, మట్టి స్వభావం, స్ట్రక్చరల్ డిజైన్, భూకంపాలు, వాతావరణ మార్పులు, చెమ్మ, ఇంటి వయసు లాంటి ఎన్నో కారణాల వల్ల గోడలకు పగుళ్లు వస్తుంటాయి. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇటుక పనులకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అందుకే కేవలం మెటీరియల్ కొనిచ్చేసి ఊరుకోకుండా, ఒక క్వాలిఫైడ్ సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో ఇల్లు కట్టుకోవడం ఉత్తమం. సరైన ప్లానింగ్, క్వాలిటీ మెటీరియల్, కరెక్ట్ క్యూరింగ్ ఉంటే భవిష్యత్తులో వచ్చే చాలా సమస్యలను ముందే ఆపొచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
Recommended image2
మనం ఏడ్చేటప్పుడు కళ్లలోంచే కాదు ముక్కులోంచి కూడా నీళ్లు కారతాయి.. ఎందుకో తెలుసా?
Recommended image3
Butterfly Pea Flower: ముసలితనం రాకుండా చేసే పువ్వు.. ఈ మొక్కకు అంత పవర్ ఉందా? అసలు నిజం ఇదే
Related Stories
Recommended image1
Rent House: అద్దె ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటే కిరాయిదారుడికి ఆ ఇల్లు సొంతమవుతుంది?
Recommended image2
House Vs Land : ప్లాట్ కొనాలా? ఇల్లు కట్టాలా? ఎవరికి, ఏది బెస్ట్ ఆప్షనో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved