MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Heatwave Safety Tips : ఇక రోళ్లు పగిలే స్థాయిలో రోహిణి కార్తె ఎండలు.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు?

Heatwave Safety Tips : ఇక రోళ్లు పగిలే స్థాయిలో రోహిణి కార్తె ఎండలు.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు?

రోహిణి కార్తె ఎండలకు రోళ్లు పగులుతాయి అంటారు… ఇకపై ఇదే పరిస్థితి ఉండబోతోంది. మరి ఈ ఎండలవేళ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? అనేది తెలుసుకుందాం.   

2 Min read
Author : Arun Kumar P
Published : May 21 2026, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎండలు బాబోయ్ ఎండలు..
Image Credit : Gemini AI

ఎండలు బాబోయ్ ఎండలు..

రోహిణి కార్తె సమయంలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. "రోహిణి కార్తె ఎండలకు రోళ్లు పగులుతాయి" అని ఓ సామేత ఉంది... అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి మే 25 నుండి జూన్ 2 వరకు సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉండనున్నాడు.. అంటే వచ్చే వారమంతా భానుడి భగభగలు తప్పవన్నమాట. మండుటెండలతో ఉష్ణోగ్రతలు ఫీక్స్ కు చేరతాయి... వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

అయితే ఇంకా రోహిణి కార్తె రానేలేదు... అప్పుడే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది... తెలంగాణ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రోహిణి కార్తెలో ఎలా ఉంటుందోనని ప్రజలు కంగారుపడిపోతున్నారు. మరి ఈ మండుటెండల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ఎండల వేళ ఏం చేయాలి..?
Image Credit : iSTOCK

ఎండల వేళ ఏం చేయాలి..?

నీరు ఎక్కువగా తాగాలి

దాహం వేయకపోయినా సరే రోజంతా తరచుగా నీరు తాగుతూ ఉండాలి. దీంతో డీహైడ్రేషన్ సమస్య ఉండదు. ఎండల్లో శరీరంలోని నీటి శాతం తగ్గకుండా చూసుకోవడమే ప్రాథమిక సూత్రం.

ద్రవ పదార్థాలు తీసుకొండి

మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఓఆర్‌ఎస్ (ORS) వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి.

దుస్తుల ఎంపిక

బయటకు వెళ్లేటప్పుడు లేత రంగులో ఉండే కాటన్ (పత్తి) దుస్తులను ధరించాలి. ఇవి గాలి ఆడేలా ఉండి, చెమటను త్వరగా పీల్చుకుంటాయి.

ఈ జాగ్రత్తలు తీసుకొండి

ఎండలో వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు వాడాలి. తలకు టోపీ లేదా కాటన్ తువ్వాలు చుట్టుకోవాలి. కళ్లకు సన్ గ్లాసెస్ ధరించడం మంచిది.

ఆహారం

నూనె తక్కువగా ఉన్న ఆహారం, నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బూజ, దోసకాయ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

ఇంటిని చల్లగా ఉంచుకోవడం

పగటిపూట కిటికీలకు కర్టెన్లు వేసి ఉంచాలి. సాయంత్రం వేళ గాలి వచ్చేలా కిటికీలు తెరిచి ఉంచాలి.

Related Articles

Related image1
Heatwave Alert : మీరు కూడా ఈ ఎండల్లో ఆఫీసుకు వెళుతున్నారా..? అయితే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా..?
Related image2
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ !
34
ఏం చేయకూడదు..?
Image Credit : Gemini

ఏం చేయకూడదు..?

మధ్యాహ్నం బయటకు రావద్దు

ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.

కెఫీన్ కలిగిన పానీయాలు తాగొద్దు

కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ తో పాటు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఇవి శరీరంలోని నీటిని త్వరగా ఖర్చు చేసి (Dehydration) తలనొప్పికి కారణమవుతాయి.

మసాలా ఫుడ్స్ వద్దు

అతిగా వేయించిన పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి వీటిని దీసుకోవద్దు. 

కారులో జాగ్రత్త

పార్క్ చేసిన కారులో పిల్లలను లేదా పెంపుడు జంతువులను ఒక్క క్షణం కూడా ఉంచకూడదు. ఎండలో కారు లోపలి ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది. దీనివల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.

శ్రమతో కూడిన పనులు వద్దు

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు వ్యాయామం అస్సలు చేయకూడాదు. అలాగే రైతులు, ఇతర కార్మికులు బరువైన పనులు చేయకూడదు. 

44
వడదెబ్బ తగిలితే ఏం చేయాలి..?
Image Credit : AI-generated image

వడదెబ్బ తగిలితే ఏం చేయాలి..?

ఒకవేళ ఎవరైనా అలసటగా ఉన్నా, తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ చర్యలు తీసుకోండి.

వారిని నీడ ఉన్న చల్లని ప్రదేశానికి చేర్చాలి.

తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి.

ఓఆర్‌ఎస్ లేదా చల్లని నీరు తాగించాలి.

పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించాలి.

ముఖ్య గమనిక: రోహిణి కార్తె ప్రభావం పెద్దల కంటే చిన్న పిల్లలు, గర్భిణీలు  వృద్ధులపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

సురక్షితంగా ఉండండి.. ఎండల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి..!

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railways : రైల్లో బ్యాగ్ లేదా ఫోన్ మర్చిపోయారా? ఈ ఒక్క నెంబర్ కి కాల్ చేస్తే చాలు.. వెతికి మరీ ఇస్తారు
Recommended image2
Loco pilot salary: రైళ్లను నడిపే లోకో పైలట్ల జీతాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసా?
Recommended image3
Watermelon: మీకు తెలుసా.. మనదేశంలో ఏ ఊరిని పుచ్చకాయల రాజధానిగా పిలుస్తారో?
Related Stories
Recommended image1
Heatwave Alert : మీరు కూడా ఈ ఎండల్లో ఆఫీసుకు వెళుతున్నారా..? అయితే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా..?
Recommended image2
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved