MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Heatwave Alert : మీరు కూడా ఈ ఎండల్లో ఆఫీసుకు వెళుతున్నారా..? అయితే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా..?

Heatwave Alert : మీరు కూడా ఈ ఎండల్లో ఆఫీసుకు వెళుతున్నారా..? అయితే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా..?

ఇండియాలో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి.. మే లో మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. ఈ ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల వల్ల రోజూ ఆఫీసులకు వెళ్లివచ్చే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. వీటి నుండి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి.

3 Min read
Author : Arun Kumar P
Published : Apr 30 2026, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అ ఎండల్లో ఉద్యోగులకు చిట్కాలు..
Image Credit : Getty

అ ఎండల్లో ఉద్యోగులకు చిట్కాలు..

ప్రస్తుతం నడి వేసవికి చేరుకున్నాం… ఎండలు మండిపోతూ ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇంకా ఏప్రిల్ లోనే ఉన్నాం… అప్పుడే భానుడు సెగలు కక్కుతున్నాడు… 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి నడివేసవి మే లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ప్రజలు కంగారుపడిపోతున్నారు.  

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిని దాటేశాయి. తీవ్రమైన వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి… ఈ క్రమంలో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. 

ఈ మండుటెండల్లో ప్రయాణం చేయడం ఇప్పుడు కేవలం అసౌకర్యం కాదు, ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం. రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లు, ఎండలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద నిరీక్షణ వల్ల లక్షలాది మంది రోజూ డీహైడ్రేషన్, అలసట, వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితంగా ప్రయాణించడం ఎలాగో తెలుసుకోవడం చాలా అవసరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆఫీసు ప్రయాణంలో చేయాల్సినవి..
Image Credit : X

ఆఫీసు ప్రయాణంలో చేయాల్సినవి..

1. వాటర్ బాటిల్ తీసుకువెళ్లండి

వడగాల్పుల సమయంలో మీరు పెద్దగా కష్టపడే పనులేమీ చేయకున్నా సాధారణంగానే శరీరం చెమట ద్వారా నీటిని వేగంగా కోల్పోతుంది. అందుకే దాహం వేసే వరకు ఆగడం కరెక్ట్ కాదు. ప్రయాణానికి ముందు, ప్రయాణ సమయంలో కొద్దికొద్దిగా నీళ్లు తాగడం మంచి పద్ధతి. అప్పుడప్పుడు ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ లేదా ఓఆర్ఎస్ (ORS) తాగడం వల్ల శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి పొందవచ్చు. ఇది తీవ్రమైన వేడిలో అలసట, కళ్లు తిరగడం వంటివి జరగకుండా కాపాడుతుంది.

2. వేడికి తగిన దుస్తులు వేసుకోండి

ఎండ నుంచి మనల్ని కాపాడటంలో దుస్తులు కీలక పాత్ర పోషిస్తాయి. వదులుగా, లేత రంగులో ఉండే కాటన్ దుస్తులు గాలి ఆడేలా చేస్తాయి, వేడిని గ్రహించకుండా పరావర్తనం చెందిస్తాయి. బిగుతుగా ఉండే లేదా సింథటిక్ బట్టలు చెమటను పీల్చుకోవు, శరీర వేడిని మరింత పెంచుతాయి. బయట నడిచేటప్పుడు లేదా బస్సు కోసం వేచిచూసేటప్పుడు టోపీ, స్కార్ఫ్ లేదా క్యాప్ పెట్టుకోవడం వల్ల సూర్యరశ్మి నేరుగా తగలకుండా ఉంటుంది.

Related Articles

Related image1
Top 10 Hottest Temperatures : బాబోయ్ ఎండలు.. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడో తెలుసా?
Related image2
Weather Update: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో వర్షం.. ఈ ప్రాంతాలకు అలర్ట్
34
ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకొండి..
Image Credit : Getty

ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకొండి..

3. వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) తీసుకోండి 

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు అత్యంత ప్రకాశవంతంగా ఉన్నప్పుడు వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీలైతే మీ ప్రయాణాన్ని ఉదయంపూట త్వరగా లేదా సాయంత్రం 4 గంటల తర్వాతకు మార్చుకోండి. ఆ సమయానికి ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది. ప్రయాణాన్ని ఒకటి, రెండు గంటలు ఆలస్యం చేయడం వల్ల కూడా ఎండ తీవ్రత నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ పనివేళలు ఉన్న ఆఫీసుల్లో, హైబ్రిడ్ వర్కింగ్ డేస్ ఎంచుకోవడం ద్వారా రోజూ ఎండలో తిరిగే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

4. చల్లగా, నీడగా ఉండే దారులను ఎంచుకోండి

అన్ని దారుల్లో ఒకే రకమైన ఎండ ఉండదు. ఎయిర్ కండిషన్డ్ స్టేషన్లు, మెట్రో లైన్లు, కవర్డ్ వాక్‌వేలు లేదా నీడ ఉన్న వీధులను ఎంచుకోవడం వల్ల ప్రయాణం కాస్త హాయిగా ఉంటుంది. ఆఫీసు లోపలే ఉండి మీ క్యాబ్ వచ్చాక బయటకు రండి. ఎండలో నిలబడటానికి బదులుగా నీడలో వేచి ఉండటం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

5. చర్మాన్ని నేరుగా ఎండ తగలకుండా కాపాడుకోండి

సూర్యరశ్మి నేరుగా శరీరంపై పడటం వల్ల వేడి భారం పెరుగుతుంది. ముఖ్యంగా అతినీలలోహిత కిరణాలు (UV rays) ఎక్కువగా ఉండే సమయంలో ఇది మరింత ప్రమాదకరం. టోపీలు, సన్‌గ్లాసెస్, సన్‌స్క్రీన్ వాడటం వల్ల వడదెబ్బ, చర్మం కమలడం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. బైక్‌పై లేదా నడిచి వెళ్లేవారికి ఇది చాలా ముఖ్యం.

44
ఆఫీసు ప్రయాణంలో చేయకూడనివి..
Image Credit : Getty

ఆఫీసు ప్రయాణంలో చేయకూడనివి..

1.భారీ భోజనం వద్దు

భారీ భోజనం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది శరీరంలో అంతర్గత వేడిని పెంచుతుంది. దీనివల్ల తీవ్రమైన వేడిలో ప్రయాణిస్తున్నప్పుడు నీరసంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం కూడా పెరుగుతుంది. డీప్-ఫ్రైడ్, కొవ్వు పదార్థాలు, మసాలా ఫుడ్స్ అజీర్తికి కారణమవుతాయి. స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో పరిశుభ్రత కూడా ఒక పెద్ద సమస్య. ఎండ, చెమట వల్ల ఫుడ్-బోర్న్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.

2.శరీరం ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దు

డీహైడ్రేషన్ సాధారణ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, దురద, చెమట, ఆకస్మిక అలసట వంటివి వడదెబ్బకు తొలి సంకేతాలు. వీటిని పట్టించుకోకుండా ప్రయాణం కొనసాగిస్తే, హీట్‌స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రయాణం ఆపి, చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని,  బాగా నీళ్లు తాగాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఉద్యోగాలు, కెరీర్
యుటిలిటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Nude Beach : ఈ బీచ్ లకు వెళ్లాలంటే ఒంటిపై నూలుపోగు కూడా ఉండకూడదు
Recommended image2
Train: రైలులో బైక్ వేరే ప్రాంతానికి పార్శిల్ చేస్తున్నారా? ఈ పత్రాలు, నిబంధనలు తెలీకపోతే ఫైన్ పడుతుంది
Recommended image3
Home Work: హోంవర్క్ కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? పిల్లలు ఎప్పటి నుంచి హోంవర్క్ చేయడం మొదలుపెట్టారంటే..
Related Stories
Recommended image1
Top 10 Hottest Temperatures : బాబోయ్ ఎండలు.. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడో తెలుసా?
Recommended image2
Weather Update: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో వర్షం.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved