Phone Addiction: కంటిన్యూగా గంటసేపు ఫోన్ చూస్తే ఏమవుతుందో తెలుసా?
ప్రస్తుతం మొబైల్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్లోనే సమయంతా గడిపేస్తున్నారు. ప్రతిదానికి ఫోన్ పైనే ఆధారపడుతున్నారు. అసలు ఫోన్ లేకపోతే డే గడవదేమో అనేకునే పరిస్థితి వచ్చింది. గంటసేపు కంటిన్యూగా ఫోన్ వాడటం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇటీవల జరిగిన పరిశోధనలు ఏం చెబుతున్నాయో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో పని తొందరగా జరగాలంటే ఫోన్ తప్పనిసరై పోయింది. మొబైల్ ఫోన్ లేకపోతే లైఫ్ లేదు అన్నట్టుగా మారింది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అన్నీ మొబైల్‌లోనే. ఈ ఫోన్ ద్వారా ఎంత మేలు జరుగుతుందో కానీ ఆరోగ్యానికి మాత్రం అంతకంటే ఎక్కువే హాని జరుగుతుంది. ఎక్కువ సేపు ఫోన్ వాడటం వల్ల కళ్ళపై ఎఫెక్ట్ పడుతుందని అందరికీ తెలుసు. కానీ గంటసేపు కంటిన్యూగా వాడినా కంటి సమస్యలు తప్పవని చెబుతున్నారు నిపుణులు.
పరిశోధన ప్రకారం
ఇటీవల జరిగిన ఓ పరిశోధన ప్రకారం ఒకటి నుంచి 4 గంటలు స్క్రీన్ టైమ్ ఉంటే మయోపియా వచ్చే ఛాన్స్ ఉంది. గంట కంటే తక్కువ స్క్రీన్ టైమ్ ఉంటే మయోపియా రిస్క్ తక్కువ. గంట కంటే తక్కువ స్క్రీన్ టైమ్ కళ్ళకు మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఏంటీ మయోపియా?
మయోపియా అంటే చూపు మసకగా ఉండటం. ఈ సమస్య ఉంటే దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా కనిపించవు. కంటి ఆకారం రెటీనాపై వెలుతురు సరిగ్గా పడకుండా ఆపినప్పుడు ఇది వస్తుంది.
పిల్లలు, యంగ్ స్టర్స్ లో ఎక్కువ..
ప్రస్తుతం చాలామంది కళ్ళజోడుతో కనిపిస్తున్నారు. కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ చాలావరకు దీనికి కారణం ఎక్కువగా మొబైల్ వాడటమేనట. మొబైల్, స్క్రీన్ టైమ్‌తో పాటు ఆహారం కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా కళ్ళపై ఎఫెక్ట్ పడుతుందని చెబుతున్నారు.
జాగ్రత్తలు
20-20-20 రూల్ పాటించండి:
ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి.
స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి:
కళ్ళపై ఒత్తిడి తగ్గించడానికి మొబైల్ ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి.
తరచుగా కళ్ళు ఆర్పండి:
కళ్ళు పొడిబారకుండా ఉండాలంటే తరచుగా కళ్ళు ఆర్పండి.
స్క్రీన్ నుంచి దూరం పాటించండి:
మొబైల్ ఫోన్‌ను కళ్ళ నుంచి కనీసం 16 అంగుళాల దూరంలో ఉంచండి.
రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోండి:
సమస్యలు ముందుగానే గుర్తించడానికి రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోండి.