MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Halloween History: భారత్ లో పెరుగుతున్న దెయ్యాల పండగ క్రేజ్.. అసలు ఎక్కడ పుట్టింది?

Halloween History: భారత్ లో పెరుగుతున్న దెయ్యాల పండగ క్రేజ్.. అసలు ఎక్కడ పుట్టింది?

Halloween History: విదేశాల్లో కనిపించే హాలోవీన్ వేడుకలకు ఇండియాలోనూ క్రేజ్ పెరిగింది. అక్టోబర్ లో మాల్స్, రెస్టారెంట్లు, కేఫ్‌లు హాలోవీన్ థీమ్‌తో ముస్తాబవుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు వేషాలతో సందడి చేస్తున్నారు. అసలు హాలోవీన్ అంటే ఏమిటి?

2 Min read
Author : Nandini Arava
Published : Nov 02 2026, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అసలు హాలోవీన్ అంటే ఏమిటి?
Image Credit : chatgpt

అసలు హాలోవీన్ అంటే ఏమిటి?

ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న హాలోవీన్ (Halloween) వేడుకలు నిర్వహిస్తారు. ఈ రోజున ప్రజలు దెయ్యాలు, రాక్షసులు, మంత్రగత్తెలు, అస్థిపంజరాలు వంటి భయంకరమైన వేషాలు వేసుకుంటారు. ఇళ్లను గుమ్మడికాయలు, దెయ్యాల బొమ్మలు, గబ్బిలాలు, సాలెగూళ్లతో అలంకరిస్తారు. పిల్లలు ఇళ్లకు వెళ్లి 'ట్రిక్ ఆర్ ట్రీట్' అంటూ చాక్లెట్లు, స్వీట్లు తీసుకుంటారు. పెద్దలు హాలోవీన్ పార్టీల్లో పాల్గొంటారు. అయితే ఈ వేడుక కేవలం సరదా కోసం కాదు, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హాలోవీన్ పుట్టుక వెనుక ఆసక్తికరమైన కథ

హాలోవీన్ పుట్టుక వెనుక ఆసక్తికరమైన కథ

హాలోవీన్ వేడుకలకు మూలాలు పురాతన సెల్టిక్ సంప్రదాయాల్లో ఉన్నాయి. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం ఐర్లాండ్, స్కాట్లాండ్ ప్రాంతాల్లో నివసించిన సెల్టిక్ ప్రజలు 'సామ్‌హైన్' (Samhain) అనే పండుగను జరుపుకునేవారు. పంటల కోత ముగిసి, చలికాలం ప్రారంభమయ్యే సమయంలో ఈ వేడుక నిర్వహించేవారు. చనిపోయిన వారి ఆత్మలు భూమిపైకి వస్తాయని భావించేవారు. వాటి నుంచి తమను తాము కాపాడుకోవడానికి పెద్ద పెద్ద మంటలు వేసేవారు. వింత వేషాలు వేసుకునేవారు. కాలక్రమేణా ఈ సంప్రదాయాలు ఇతర ఆచారాలతో కలిసిపోయాయి.

తర్వాత క్రైస్తవ సంప్రదాయాల ప్రభావం కూడా హాలోవీన్‌పై పడింది. నవంబర్ 1న క్రైస్తవులు ఆల్ సెయింట్స్ డే నిర్వహిస్తారు. దీనికి ముందు రోజు సాయంత్రాన్ని 'ఆల్ హాలోస్ ఈవ్' అని పిలిచేవారు. కాలక్రమేణా అదే 'హాలోవీన్'గా మారింది. నవంబర్ 2న ఆల్ సోల్స్ డే నిర్వహిస్తారు. ఈ రోజున మరణించిన వారిని స్మరించుకుంటారు.

35
భారత్‌లో హాలోవీన్ క్రేజ్ పెరగడానికి కారణమేంటి?
Image Credit : chatgpt

భారత్‌లో హాలోవీన్ క్రేజ్ పెరగడానికి కారణమేంటి?

ఒకప్పుడు భారత్‌లో హాలోవీన్ వేడుకల గురించి తెలిసేది కాదు. ముఖ్యంగా విదేశీ సంస్కృతికి సంబంధించిన పండుగగా మాత్రమే చూసేవారు. అయితే హాలీవుడ్ సినిమాలు, టెలివిజన్ షోలు, సోషల్ మీడియా పుణ్యమా అని ఇండియన్స్ కు ఆసక్తి పెరిగింది.

ఫ్రెండ్స్, బ్రూక్లిన్ నైన్-నైన్ వంటి విదేశీ టీవీ షోల్లో హాలోవీన్ వేడుకలు, వింత వేషధారణలు కనిపించేవి. వాటిని చూసిన యువత కూడా అలాంటి వేడుకల్లో పాల్గొనాలని ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. హాలీవుడు సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రభావంతో భారత్ కు విస్తరించింది.

ముఖ్యంగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో హాలోవీన్ వేడుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెస్టారెంట్లు, కేఫ్‌లు ప్రత్యేక అలంకరణలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల హాలోవీన్ థీమ్‌తో ప్రత్యేక ఫుడ్ ఐటమ్స్, డెజర్ట్‌లు అందిస్తున్నారు. ఆఫీసులు, స్కూళ్లలో కాస్ట్యూమ్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు.

45
హాలోవీన్‌తో పెరుగుతున్న వ్యాపారం.. భారీగా అమ్మకాలు!
Image Credit : gemini ai

హాలోవీన్‌తో పెరుగుతున్న వ్యాపారం.. భారీగా అమ్మకాలు!

హాలోవీన్ వేడుకలు కేవలం వినోదానికే పరిమితం కావడం లేదు. వ్యాపారం పెరుగుతోంది. ఈ పండుగ కోసం ప్రత్యేకంగా దుస్తులు, మాస్కులు, మేకప్ వస్తువులు, గుమ్మడికాయ అలంకరణలు, చాక్లెట్లు, లైటింగ్ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. కాస్ట్యూమ్స్, యాక్సెసరీస్ అమ్మకాలు పెరిగాయి. థీమ్ డెకరేషన్, లైటింగ్ అమ్మకాలు పెరిగాయి. ఈ ట్రెండ్ హైదరాబాద్ సహా పలు మెట్రో నగరాల్లో కనిపించింది.

55
సోషల్ మీడియా కూడా ఓ కారణమే!
Image Credit : gemini ai

సోషల్ మీడియా కూడా ఓ కారణమే!

హాలోవీన్ వేడుకలు భారత్‌లో ప్రాచుర్యం పొందడానికి సోషల్ మీడియా కూడా కారణం. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ల్లో హాలోవీన్ కాస్ట్యూమ్స్, మేకప్, పార్టీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది కొత్తగా ప్రయత్నించాలని ఆసక్తి చూపుతున్నారు.

పిల్లలు బ్యాట్‌మ్యాన్, ఎల్సా వంటి పాత్రల వేషాలు వేస్తుంటే.. పెద్దలు మార్వెల్ సూపర్ హీరోలు, యానిమే పాత్రలు, పాపులర్ మీమ్స్ ఆధారంగా కాస్ట్యూమ్స్ సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు భయంకరమైన మేకప్‌తో ప్రత్యేక ఫొటోషూట్లు కూడా చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో హాలోవీన్‌కు చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంది. కానీ భారత్‌లో మాత్రం చాలావరకు ఇది వినోదం, స్నేహితులతో గడిపే సమయంగా మారింది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
హాలీవుడ్
పండుగలు
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Flight Baggage rules : విమానం మ్యాగ్జిమమ్ టేకాఫ్ వెయిట్ అంటే ఏమిటి? లగేజీ రూల్స్ వెనక ఇంత సైన్స్ దాగుందా!
Recommended image2
Floating Market: మన దేశంలో నీటిపై తేలియాడే మార్కెట్ ఎక్కడుందో తెలుసా? ఇక్కడ పడవల్లోనే వ్యాపారం!
Recommended image3
Whistling Snake: బాబోయ్.. ఈల వేసే పాములు.. భారత్‌లోనూ తిరుగుతున్న ఆ భయంకరమైన పాము ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
Jalebi/Tang Huan: మన జిలేబీకి చైనా వెర్షన్ ఇది.. దీని పేరేంటో తెలుసా?
Recommended image2
Visa free countries: ఇండియన్స్ వీసా లేకుండా వెళ్లగలిగే 10 దేశాలు.. ప్రకృతి, సంస్కృతి, సాహసాలకు కేరాఫ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved