MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • Government Scheme : నెలానెలా రూ.20,000 ఆదాయం కావాలా..? ఈ ప్రభుత్వ పథకంలో చేరండి

Government Scheme : నెలానెలా రూ.20,000 ఆదాయం కావాలా..? ఈ ప్రభుత్వ పథకంలో చేరండి

రిటైర్మెంట్ తర్వాత డబ్బుల కోసం ఆలోచిస్తున్నారా..? పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) మీకు భరోసా ఇస్తోంది. దీని ద్వారా ఎంత ఆదాయం పొందవచ్చో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 24 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏమిటీ పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్..?
Image Credit : Gemini

ఏమిటీ పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్..?

సర్వీస్ లో ఉండగా ఎక్కువ శాలరీ ఉన్నా రిటైర్మెంట్ తర్వాత ఆదాయం తగ్గిపోతుందనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. ఇలాంటివారి కోసమే కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది… అదే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). ఇందులో ఒకేసారి డబ్బు డిపాజిట్ చేస్తే దానిపై వచ్చే వడ్డీతో ప్రతీ మూడు నెలలకోసారి ఆదాయం వస్తుంది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే నెలకు రూ.20,000 పైగా సంపాదించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
8.2% వడ్డీ
Image Credit : AI

8.2% వడ్డీ

ఈ పథకంలో మన డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది. ఇది ప్రభుత్వ సపోర్ట్ తో నడిచే స్కీమ్ కాబట్టి పెట్టిన పెట్టుబడికి ఎలాంటి రిస్క్ ఉండదు. దీనికి తోడు 8.2% వడ్డీ ఇస్తుండటంతో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది. చాలా బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఇది ఎక్కువ వడ్డీ ఇస్తుంది. అంటే భద్రతతో పాటు మంచి రాబడి కూడా వస్తుంది.

Related Articles

Related image1
Saving Scheme: రోజుకు రూ. 330 ప‌క్క‌నబెడితే రూ. 13 ల‌క్ష‌ల సంపాద‌న‌.. నిజంగానే సాధ్యం
Related image2
Saving Scheme: చేతిలో డ‌బ్బుంటే చేయాల్సిన ప‌ని ఇదే.. 5 ఏళ్ల‌లో రూ. 3 ల‌క్ష‌ల వ‌డ్డీ
35
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..
Image Credit : Getty

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..

ఈ స్కీమ్‌లో చేరడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. కనీసం రూ.1,000తో కూడా పెట్టుబడి మొదలుపెట్టొచ్చు. అంతేకాదు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. అంటే ఇది పొదుపు పథకమే కాదు, పన్ను ఆదా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

45
ఎవరు అర్హులు..?
Image Credit : Gemini AI

ఎవరు అర్హులు..?

ఈ పథకంలో చేరడానికి వయసు పరిమితి ముఖ్యం. 60 ఏళ్లు దాటిన వారు సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్న ఉద్యోగులు 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో కూడా చేరొచ్చు. రక్షణ రంగంలో పనిచేసిన వారు 50 ఏళ్ల నుంచే ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కాలపరిమితి 5 సంవత్సరాలు. గడువుకు ముందే డబ్బు తీసేస్తే కొన్ని పెనాల్టీలు ఉంటాయి.
55
ఎంత పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం..?
Image Credit : Getty

ఎంత పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం..?

పెట్టుబడి పరిమితి చూస్తే సింగిల్ అకౌంట్‌లో గరిష్ఠంగా  రూ.15 లక్షల వరకు పెట్టొచ్చు. అదే జాయింట్ అకౌంట్‌లో అయితే రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టే వీలుంది. ఉదాహరణకు రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.2.46 లక్షల వడ్డీ వస్తుంది. అంటే ప్రతీ మూడు నెలలకు రూ.61,500, నెలకు సుమారు రూ.20,500 ఆదాయం పొందొచ్చు. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి ఇది నమ్మకమైన ఎంపిక. దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్‌లో సులభంగా అకౌంట్ తెరవొచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పర్సనల్ పైనాన్స్
భారత దేశం
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సచిన్, ధోని, రోహిత్, కోహ్లీ లకు ఆడపిల్లలే పుట్టడానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
Nepal Tourism : నేపాల్ లో ఇండియన్స్ అత్యధికంగా సందర్శించే టూరిస్ట్ స్పాట్స్ ఇవే..
Recommended image3
Facilities in Jail : జైల్లో ఖైదీలకు బెడ్, పరుపు, దుప్పటి ఇస్తారా? స్నానానికి సబ్బు సంగతేంటి?
Related Stories
Recommended image1
Saving Scheme: రోజుకు రూ. 330 ప‌క్క‌నబెడితే రూ. 13 ల‌క్ష‌ల సంపాద‌న‌.. నిజంగానే సాధ్యం
Recommended image2
Saving Scheme: చేతిలో డ‌బ్బుంటే చేయాల్సిన ప‌ని ఇదే.. 5 ఏళ్ల‌లో రూ. 3 ల‌క్ష‌ల వ‌డ్డీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved