MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Gold Loan Auction : మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారా? మీ బంగారం వేలం వేసే పరిస్థితి రావద్దంటే ఏం చేయాలో తెలుసా?

Gold Loan Auction : మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారా? మీ బంగారం వేలం వేసే పరిస్థితి రావద్దంటే ఏం చేయాలో తెలుసా?

అత్యవసర పరిస్థితుల్లో గోల్డ్ లోన్ తీసుకుంటాం. కానీ అప్పు తిరిగి చెల్లించలేకపోతే ఏమవుతుందో అనే ఆందోళన ఉంటుంది.. బ్యాంకులు, గోల్డ్ లోన్ సంస్థలు ఎక్కడ నగలను వేలం వేస్తాయో అనే టెన్షన్ వెంటాడుతుంది. అయితే మీ నగలు వేలానికి రాకుండా అడ్డుకునే చిట్కాలివే..

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 21 2026, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గోల్డ్ లోన్ కట్టకుంటే నగలను నిజంగా వేలం వేస్తారా?
Image Credit : Gemini AI

గోల్డ్ లోన్ కట్టకుంటే నగలను నిజంగా వేలం వేస్తారా?

చాలా బ్యాంకులు మన ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తుంటారు. ఇక గోల్డ్ లోన్ సంస్థల పనే ఇది. అయితే మనం తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది… లేదంటే ఇబ్బందులు తప్పవు. ఒకవేళ ఏదైనా కారణంతో చాలారోజులు గోల్డ్ లోన్ అసలు, వడ్డీ చెల్లించకుంటే ఏం జరుగుతుంది? లోన్ ఇచ్చిన సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. 

గోల్డ్ కట్టకుంటే తాకట్టు పెట్టిన నగలు వేలం వేస్తారా? ఇది చాలామంది డౌట్. దీనికి అవును అనేదే సమాధానం.  బ్యాంకులు మీ బంగారు నగలను వేలం వేయగలవు… లోన్ ఇచ్చేటప్పుడే ఇందుకు సంబంధించి అన్ని అనుమతులను మననుండి తీసుకుంటాయి. అయితే ఇది చివరి ఆప్షన్ గా మాత్రమే ఉపయోగించుకుంటాయి సదరు సంస్థలు.

చాలా బ్యాంకులు, గోల్డ్ లోన్ సంస్థలు ఇచ్చిన అప్పు, వడ్డీ వసూలు చేయడానికే ప్రయత్నిస్తాయి. బంగారం వేలం వేయడాన్ని నివారించడానికే చూస్తాయి. సాధారణంగా అప్పు తీసుకున్నవారు చాలాకాలం వాయిదాలు కట్టకపోయినా, సరిగ్గా స్పందించకున్నా ఈ పరిస్థితి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఒక నిర్దిష్ట ప్రక్రియను పాటించాకే వేలం వేయాలి. ఇది కస్టమర్ల హక్కులను కాపాడే పారదర్శకమైన ప్రక్రియ. కాబట్టి భయపడాల్సిన పనిలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎంతకాలం వడ్డీ చెల్లించకపోతే బంగారు నగలు వేలానికి వెళ్తాయి?
Image Credit : ChatGPT

ఎంతకాలం వడ్డీ చెల్లించకపోతే బంగారు నగలు వేలానికి వెళ్తాయి?

గోల్డ్ లోన్ విషయంలో మీరు వడ్డీ లేదా వాయిదాలు సక్రమంగా కట్టకపోయినా మీ నగలు వెంటనే వేలానికి వెళ్లవు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం లోన్ తీసుకున్నవారికి కొంత సమయం ఇవ్వాలి. సాధారణంగా అయితే వరుసగా 90 రోజుల వరకు అంటే వరుసగా మూడు నెలలు వాయిదా లేదా వడ్డీ చెల్లించకపోతే, మీ లోన్ అకౌంట్‌ను 'నిరర్థక ఆస్తి' (Non-Performing Asset - NPA)గా ప్రకటిస్తారు. ఆ తర్వాతే వేలం ప్రక్రియ మొదలవుతుంది. ఇది అకస్మాత్తుగా జరగదు, దీనికి చాలా సమయం పడుతుంది.

Related Articles

Related image1
Gold Loan vs Selling Gold : ఆర్థిక అవసరాల కోసం బంగారం అమ్మాలా? తాకట్టు పెట్టాలా?
Related image2
Gold Loan : మీరు గోల్డ్ లోన్ తీసుకుని తిరిగి కట్టలేకపోతున్నారా? బంగారం వేలం వేయకుండా ఆపే సింపుల్ ట్రిక్స్
35
వేలానికి ముందు బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి?
Image Credit : Chatgpt

వేలానికి ముందు బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి?

మీ బంగారు నగలను వేలం వేయడానికి ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొన్ని చర్యలు తీసుకుంటాయి. మొదట మీరు వాయిదాలు కట్టడం ఆపగానే ఆ బ్రాంచ్ సిబ్బంది ఫోన్ చేసి గుర్తుచేస్తారు. అయినా స్పందించకుంటే రాతపూర్వకంగా మీకు ఉత్తరాలు లేదా ఈ-మెయిల్స్ ద్వారా నోటీసులు పంపుతాయి. 

ఫోన్స్, నోటీసులను పట్టించుకోకుంటే చట్టప్రకారం తాకట్టు పెట్టిన బంగారం వేలం వేసి డబ్బులు రాబట్టుకునేందుకు సిద్దం అవుతాయి. అప్పుడు కూడా ముందు అప్పు చెల్లించడానికి మీకు ఒక నెల గడువు ఇస్తూ రిజిస్టర్డ్ పోస్ట్ (Registered Post) ద్వారా నోటీసు పంపాలి. ఈ నోటీసులో వేలం తేదీ, సమయం, ప్రదేశం స్పష్టంగా ఉంటాయి. ఇది పారదర్శకమైన ప్రక్రియ కాబట్టి, మీకు తెలియకుండా ఏదీ జరగదు.

45
గోల్డ్ లోన్ తిరిగి చెల్లించలేకపోతే ప్రత్యామ్నాయ అవకాశాలు ఏమిటి?
Image Credit : Chatgpt

గోల్డ్ లోన్ తిరిగి చెల్లించలేకపోతే ప్రత్యామ్నాయ అవకాశాలు ఏమిటి?

గోల్డ్ లోన్ తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే మీరు వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ముందుగా మీరు లోన్ తీసుకున్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను కలిసి మీ పరిస్థితిని వివరించండి. వారు మీకు EMIని రీస్ట్రక్చర్ చేయడం, లోన్ గడువును పొడిగించడం (Extend Tenure) లేదా కొంత మొత్తం చెల్లించడం వంటి అవకాశాలు ఇవ్వొచ్చు. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకి ‘టాప్-అప్’ లోన్లు కూడా ఇస్తాయి. దీని ద్వారా బకాయిలను సర్దుబాటు చేసుకోవచ్చు.

55
మీ బంగారు నగలను వేలానికి వెళ్లకుండా ఎలా కాపాడుకోవాలి?
Image Credit : Chatgpt

మీ బంగారు నగలను వేలానికి వెళ్లకుండా ఎలా కాపాడుకోవాలి?

గోల్డ్ లోన్ తీసుకుంటే మీ బంగారు నగలు వేలానికి వెళ్లకుండా కాపాడుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి. 

  • అన్నింటికన్నా ముందు లోన్ తీసుకునేటప్పుడే మీ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోండి. తిరిగి చెల్లించే అవకాశాలు ఉంటేనే బంగారం తాకట్టు పెట్టండి… లేదంటే అప్పుడే అమ్ముకుని అవసరాలు తీర్చుకోవడం మంచిది.
  •  నెలనెలా వాయిదాలు తప్పకుండా కట్టండి. అసలు చెల్లించేవరకు వడ్డీ డబ్బులు సక్రమంగా కడుతూ ఉండాలి.  
  • అనుకోని ఆర్థిక ఇబ్బందులు వస్తే వెంటనే బ్యాంకును సంప్రదించి మీ పరిస్థితిని చెప్పండి. 
  • ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్యాంకు కాల్స్ లేదా నోటీసులను పట్టించుకోకుండా ఉండొద్దు. 
  • లోన్ తీసుకునేటప్పుడే అగ్రిమెంట్‌లోని నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకోండి. ఇదే మీ నగలను కాపాడుకోవడానికి ఉత్తమ మార్గం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Hotel vs Motel : హోటల్ అంటే తెలుసు.. మరి ఈ మోటల్ ఏంటి? రెండింటి మధ్య తేడా ఏంటి?
Recommended image2
Airline Rules : విమానంలో స్మోకింగ్ నిషేధం, మరి బాత్రూంలో యాష్ ట్రే ఎందుకుంటుంది?
Recommended image3
world’s longest train : 7 కిలొమీటర్ల పెద్ద రైలే..! ప్రపంచంలోనే అతి పొడవైన ట్రైన్ ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
Gold Loan vs Selling Gold : ఆర్థిక అవసరాల కోసం బంగారం అమ్మాలా? తాకట్టు పెట్టాలా?
Recommended image2
Gold Loan : మీరు గోల్డ్ లోన్ తీసుకుని తిరిగి కట్టలేకపోతున్నారా? బంగారం వేలం వేయకుండా ఆపే సింపుల్ ట్రిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved