MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Inspiring Story: వైకల్యాన్ని జయించి..పేదరికాన్ని దాటి దేశానికి పతకం అందించిన కుర్రాడు

Inspiring Story: వైకల్యాన్ని జయించి..పేదరికాన్ని దాటి దేశానికి పతకం అందించిన కుర్రాడు

Inspiring Story: 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. కష్టాలను ఎదిరించి, పట్టుదలతో పోరాడిన భారత పారా పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి తొలి పతకాన్ని అందించాడు.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 26 2026, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కటిక పేదరికం నుంచి కామన్వెల్త్ వేదిక వరకు
Image Credit : Instagram

కటిక పేదరికం నుంచి కామన్వెల్త్ వేదిక వరకు

పురుషుల హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ విభాగంలో పోటీపడిన 29 ఏళ్ల ఝండు కుమార్, 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి మొత్తం 130.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

ఆయన అసలు పేరు అవినాష్ కుమార్. ఝండు కుమార్…తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. బీహార్‌లోని నలందా జిల్లా హర్నాట్ గ్రామంలో జన్మించిన ఆయన..పుట్టుకతోనే పోలియో బారిన పడి కాళ్లు చచ్చుబడిపోయాయి. కుటుంబానికి భారం అయ్యాడంటూ బంధువులు అవమానించేవారట. అలా ఝండూ అనే పేరు వచ్చింది. ఝండు అంటే మూర్ఖుడు అని అర్థం. అదే పేరు స్థిరపడిపోయింది. కటిక పేదరికం అనుభవించిన ఆయన కుటుంబానికి చేయూతగా నిలిచేందుకు తండ్రితో కలిసి రోడ్డు పక్కన బంగాళాదుంపలు, ఉల్లిపాయలు అమ్మేవారు. 10 ఏళ్ల వయసు నుంచే ట్రై సైకిల్ పై 20 కిలోమీటర్లు ప్రయాణించి కూరగాయలు అమ్మేవాడు. అదే ఇ-రిక్షా. జీవితం విసిరిన సవాళ్లకు లొంగిపోకుండా, పవర్ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని కష్టపడి శిక్షణ పొందారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఉత్కంఠభరితమైన పోటీ నడుమ
Image Credit : Instagram

ఉత్కంఠభరితమైన పోటీ నడుమ

పోటీలో ఝండు కుమార్ తన రెండవ ప్రయత్నంలో 190 కిలోల బరువును ఎత్తి 130.9 పాయింట్లతో అగ్రస్థానానికి చేరి పోటీదారులపై ఒత్తిడి పెంచారు. మూడో ప్రయత్నంలో 196 కిలోల బరువు ఎత్తే క్రమంలో బార్‌బెల్ రాక్‌కు తగలడంతో కొద్దిలో రికార్డును చేజార్చుకున్నారు. అయినప్పటికీ, ఆయన సాధించిన 130.9 పాయింట్లు పతకాన్ని ఖాయం చేశాయి. నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ (132.8 పాయింట్లు) స్వర్ణం గెలవగా, ఇంగ్లాండ్‌కు చెందిన మాథ్యూ హార్డింగ్ (131.0 పాయింట్లు) రజతం సాధించాడు. నైజీరియన్ అథ్లెట్ తన చివరి ప్రయత్నంలో విఫలమవడంతో ఝండు కుమార్‌కు కాంస్యం ఖరారైంది.

34
నా దేశ పతాకాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది
Image Credit : Instagram

నా దేశ పతాకాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది

పతకం సాధించిన అనంతరం ఝండు కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానని అన్నారు. వేదికపై మన జాతీయ పతాకాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపించిందని ఝండు కుమార్‌ చెప్పారు. కష్టాలను జయించి దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఝండు కుమార్ కథ, ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఈ విజయంతో లభించిన ఆత్మవిశ్వాసంతో, లాస్ ఏంజిల్స్ 2028 పారాలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.

44
ప్రతి ఒక్కరికీ ఆదర్శం
Image Credit : Instagram

ప్రతి ఒక్కరికీ ఆదర్శం

కష్టాలను జయించి దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఝండు కుమార్ కథ, ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఈ విజయంతో లభించిన ఆత్మవిశ్వాసంతో, లోస్ ఏంజిల్స్ 2028 పారాలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Train Lower Berth: రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కన్ఫర్మ్ కావాలా? ఈ ఐదు సీక్రెట్ ట్రిక్స్ మీకోసం
Recommended image2
వినాయ‌కుడి చెవులు పెద్ద‌గా, కండ్లు చిన్న‌గా ఎందుకుంటాయి? ఒక్కో అవ‌యం వెనుక ఇంత అర్థ‌ముందా?
Recommended image3
Motivational Story: కష్టాల నుంచి పారిపోతున్నారా.? మీకు కూడా ఈ రాయికి పట్టిన గతే పడుతుంది
Related Stories
Recommended image1
jyotika: సోషల్ మీడియాలో జ్యోతిక బోల్డ్ స్టేట్ మెంట్ వైరల్... అభిజీత్ దిప్కేకు సపోర్ట్ చేస్తూ పోస్ట్
Recommended image2
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే అంటూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved