MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Facts: జపాన్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? లేడి యూట్యూబర్ చెప్పిన సంచలన విషయాలు...

Facts: జపాన్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? లేడి యూట్యూబర్ చెప్పిన సంచలన విషయాలు...

Facts: జపాన్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? పేదవారు, ధనిక వర్గాల మధ్య కమ్యునికేషన్ ఎలా ఉంటుంది. అక్కడ చెత్త క్లీన్ చేసేవారిని ఎలా ట్రీట్ చేస్తారు. జపాన్ లో పని చేస్తున్న తెలుగమ్మాయి వెల్లడించిన సంచలన నిజాలేంటి?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 23 2026, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చాలా దేశాల్లో ఇప్పటికీ తప్పని జాతి వివక్ష..
Image Credit : Asianet News

చాలా దేశాల్లో ఇప్పటికీ తప్పని జాతి వివక్ష..

ఇండియాతో పాటు చాలా దేశాల్లో మతం, కులంతో వివక్ష ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా మన దేశంతో క్యాస్ట్ ఫీలింగ్ తో చాలా వర్గాలను తక్కువగా చూడటం అందరికి తెలిసిందే. కొన్ని దేశాల్లో జాతి వివక్ష ఎక్కువగా కనిపిస్తుంది. వైట్ స్కిన్, బ్లాక్ స్కిన్ అంటూ..  నల్లజాతీయులపై దాడులు కామన్ అయిపోయాయి. టెక్నాలజీ, సైన్స్ ఇంతలా పెరిగిన ఈ కాలంలో కూడా ఇంకా.. ఈ వివక్ష కనిపిస్తూనే ఉంది. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఇవేమి ఉండవు. చాలా ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూ.. మనిషులకు విలువిస్తుంటారు. మరి జపాన్ లో ఎలాంటి పరిస్థితి ఉంది. జపానియూలకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? యూట్యూబర్ ఝాన్సీ చెప్పిన సంచలన నిజాలేంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జపాన్ లో తెలుగు యూట్యూబర్..
Image Credit : @jhansi in japan

జపాన్ లో తెలుగు యూట్యూబర్..

జపాన్ లో చాలామంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు అంటూ ఇండియా నుంచి జపాన్ వెళ్లి బ్రతుకుతున్నారు.. వారిలో ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారు. కొంత మంది ఉద్యోగస్తులు యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేసి.. తమ అనుభవాలు, జపాన్ లో పరిస్థితులను వివరిస్తుంటారు. అలాంటి వారిలో ఝాన్సీ కూడా ఒకరు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉద్యోగరిత్య జపాన్ వెళ్లిన ఆమె.. జాబ్ చేసుకుంటూనే అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు విషయాలను సేకరించి ''ఝాన్సీ ఇన్ జపాన్'' అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేస్తుంటుంది. 

జపాన్ కల్చర్, అక్కడి జీవిన విధానం, విదేశీయులను ఎలా చూస్తారు, జపాన్ లో ఉండాలంటే రూల్స్ ఏంటి, మన దేశానికి జపాన్ కు తేడాలు ఏంటి ఇలా ఎన్నో విషయాలపై ఇప్పటికే ఆమె వీడియోలు చేశారు. ఈక్రమంలో ఆమెకు తన ఫాలోవర్స్ నుంచి కొన్ని ప్రశ్నలు కూడా ఎదురౌతుంటాయి. తన వీడియోలు చూసిన ఓ నెటిజన్ జపాన్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా అని ఆమెను ప్రశ్నించాడు. తన ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు ఝాన్సీ వీడియో రూపంలో సమాధానం చెప్పారు.

34
జపాన్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా?
Image Credit : @jhansi_in_japan

జపాన్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా?

ఈ విషయంపై ఝాన్సీ ఏమని సమాధానం చెప్పిందంటే? '' జపాన్ లో కులపిచ్చి, మత పిచ్చి అస్సలు ఉండవు. అందరిని సమానంగా చూస్తారు. చాలా కైండ్ గా ఉంటారు, పొలైట్ గా ఉంటారు. ముఖ్యంగా చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా మర్యద ఇస్తారు. ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేయడానికి ముందుకు వస్తారు. నీది ఏ కులం ఏ మతం, అని అడగరు.. అసలు వారికి అలాంటివి ఉండవు కూడా. ఇక్కడ లోకల్ గా ఏమున్నా, నేను ఎక్స్ పీరియన్స్ చేసినంత వరకూ.. వివక్షను మాత్రం నేను చూడలేదు. 

ఈ విషయంలో నేను ఓ విషయం షేర్ చేసుకోవాలి.. ఓ సారి ఓ ఈవెట్ జరిగింది... అదంతా అయిపోయిన తరువాత చెత్తను క్లీన్ చేయడానికి కొంత మంది వచ్చారు. వారు అంతా క్లీన్ చేసి వెళ్లేప్పుడు.. ఈ ఈవెంట్ కు సంబంధించిన పెద్దలు, ఆఫీసర్లంతా వచ్చి.. చెత్త క్లీన్ చేసేవారికి తల వంచి నమస్కారం చేశారు. ఇక్కడ పేద, ధనిక, డబ్బుంటేనే బాగా చూడటం, డబ్బులేకపోతే చిన్నచూపు చూడటం లాంటివి ఏమీ ఉండవు. అందుకే ఈ దేశం చాలా స్పీడ్ గా ముందుకు వెళ్లిపోతోంది. ఇక్కడి ప్రజలు చాలా వినయంగా, హంబుల్ గా ఉంటారు. ప్రతీ ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు. ఈ దేశం నుంచి మనం నేర్చుకోవలసిన విషయం కూడా ఇదే.'' అని ఆమె వెల్లడించారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kalaga Jhansi Ramani ❤️ (@jhansi_in_japan)

44
దూసుకుపోతున్న జపాన్..
Image Credit : Asianet News

దూసుకుపోతున్న జపాన్..

దేశం అభివృద్ది చెందాలంటే.. మనిషిని మనిషిలా చూడాలి.. వివక్ష లేని సమాజం ఉంటేనే సమానంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ విషయంలో కొన్ని దేశాలను ఆదర్శంగా తీసుకోవచ్చు. చిన్నవే అయినా.. జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా జపాన్ లో ప్రతీ పనిలో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎదుటివారు ఇబ్బంది పడేలా నిర్ణయాలు ఉండవు. చిన్నతనం నుంచే ఎవరి పని వారు చేసుకోవడం నేర్చుకుంటారు. అక్కడి స్కూల్స్ లో క్రమశిక్షణకు ఇంపార్టెన్స్ ఇస్తారు. పిల్లలకు కూడా మందు నుంచే ఇలాంటివి అలవాటు చేస్తారు. పౌండేషన్ నుంచే ఇంత బలంగా ఉండబట్టే జపాన్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Uniform Colors : డాక్టర్లు తెల్లకోటు, పోలీసులు ఖాకీ డ్రెస్.. ఏ యూనిఫామ్ వెనక ఏ అర్థం దాగుందో తెలుసా?
Recommended image2
Rats Behavior : ఎలుకలు ఏ వస్తువులనైనా ఎందుకు కొరికి పాడుచేస్తాయి? అసలు కారణం ఇదే..!
Recommended image3
చిన్నారులపై లైంగిక అరాచకాలు తగ్గాలంటే... 'టింగ్ టాంగ్' ఫార్ములా ఫాలో అవ్వాల్సిందే, అంటే ఏమిటో తెలుసా?
Related Stories
Recommended image1
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Recommended image2
Samantha : సమంత భర్త రాజ్ మొదటి భార్య ఏం చేస్తుందో తెలుసా? విసిగిపోయి చివరికి ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved