- Home
- Feature
- Hair Care Tips: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందా? అసలు నిజమేంటి.. డాక్టర్లు ఏం చెప్తున్నారు?
Hair Care Tips: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందా? అసలు నిజమేంటి.. డాక్టర్లు ఏం చెప్తున్నారు?
Hair Care Tips: హెల్మెట్ రోజూ పెట్టుకుంటే బట్టతల వస్తుందా? హెల్మెట్ వాడటం వల్ల జుట్టు రాలిపోతుందా? హెయిర్ ఫాల్‌కి అసలు కారణాలు, హెల్మెట్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

హెల్మెట్ వాడితే హెయిర్ ఫాల్ అవుతుందా?
ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది దాదాపు అందరినీ వేధించే ఒక పెద్ద సమస్యగా మారింది. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్‌ను ఫేస్ చేస్తున్నారు. అయితే టూవీలర్ నడిపేవాళ్లలో ఒక కామన్ డౌట్ ఉంది. రోజూ హెల్మెట్ పెట్టుకోవడం వల్లనే జుట్టు ఊడిపోతోందా? అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అసలు హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఈ విషయంపై ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
హెయిర్ ఫాల్‌కి అసలు కారణాలు ఇవే
చాలామంది తమ జుట్టు రాలడానికి హెల్మెట్‌నే కారణమని అనుకుంటారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం.. జుట్టు రాలడానికి ప్రధానంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్, హార్మోన్ల అసమతుల్యతే ముఖ్య కారణాలు. వీటితో పాటు నేటి లైఫ్‌స్టైల్‌లో ఉండే విపరీతమైన స్ట్రెస్, సరైన నిద్ర లేకపోవడం, శరీరంలో న్యూట్రిషన్ లోపం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది.
హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా?
హెల్మెట్ లేదా క్యాప్ పెట్టుకోవడం వల్ల నేరుగా జుట్టు రాలిపోదు అని ఎక్స్‌పర్ట్స్ స్పష్టంగా చెప్తున్నారు. అయితే వీటిని అతిగా, సరిగ్గా కేర్ తీసుకోకుండా వాడితే మాత్రం హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. చాలా సమయం పాటు హెల్మెట్ ధరించడం వల్ల స్కాల్ప్ భాగంలో విపరీతంగా చెమట పడుతుంది. ఈ చెమటతో పాటు మురికి చేరడం వల్ల తలలో డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఇది జుట్టు ఊడటానికి దారితీస్తుంది.
సరిపోని సైజ్.. వేధిస్తున్న సమస్యలు
మీరు వాడే హెల్మెట్ చాలా టైట్‌గా ఉంటే, అది నేరుగా మీ జుట్టు కుదుళ్లపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. ఈ రకమైన ఒత్తిడి వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి, జుట్టు త్వరగా తెగిపోవడం లేదా ఊడిపోవడం జరుగుతుంది. అందుకే హెల్మెట్ వాడటం వల్ల సమస్య లేదు గానీ, సరైన సైజ్ లేని టైట్ హెల్మెట్ వాడటం వల్ల తప్పకుండా ఇబ్బంది వస్తుంది.
హెల్మెట్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హెల్మెట్ వాడేవారు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే హెయిర్ ఫాల్ సమస్యను సులభంగా అరికట్టవచ్చు. తల భాగం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మీరు వాడే హెల్మెట్లు, క్యాప్‌లను క్రమం తప్పకుండా క్లీన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ మీ తలకు సరిపోయే సరైన సైజ్, క్వాలిటీ ఉన్న హెల్మెట్‌నే ఎంచుకోవాలి. హెల్మెట్ లోపల ఒక కాటన్ లేదా మెత్తటి క్లాత్ వేసుకోవడం మంచిది. ఈ బట్ట తలలో పట్టే చెమటను త్వరగా పీల్చేసుకుని తలను డ్రైగా ఉంచుతుంది.
జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి టిప్స్
తలని, జుట్టుని ఎప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వారానికి కనీసం రెండు సార్లు నూనెతో తలకు బాగా మసాజ్ చేయాలి. ఇలా నూనెతో మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరిగి, జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. ఫలితంగా జుట్టు రాలే సమస్యను కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి హెల్మెట్ వాడటం మానేయాల్సిన అవసరం లేదు, సరైన పరిశుభ్రత పాటిస్తే మీ జుట్టు సురక్షితంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

