Hole in Vada: గారె మధ్యలో చిల్లు ఎందుకు పెడతామో తెలుసా? దానికీ ఒక స్టోరీ ఉంది
Hole in Vada: తింటే గారెలు తినాలి అంటారు… గారెల మధ్యలో ఉండే చిల్లు ఎంతో ప్రత్యేకమైనది. వడలో ఆ రంధ్రం ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కూడా ఒక చరిత్ర ఉంది. సైన్సుపరంగా కూడా దీనికి ఒక కారణం ఉంది.

గారెలు ఎంతో ఫేమస్
తెలుగు రాష్ట్రాల్లో వారికి గారెలు అంటే ప్రాణం. పండుగలు శుభకార్యాలు వస్తే చాలు కచ్చితంగా ఇంట్లో గారెలు ఉండాల్సిందే. ప్రతిరోజు గారెలు టిఫిన్ గా తినే వారి సంఖ్య కూడా ఎక్కువ. అయితే గారెలకు మధ్యలో ఒక చిల్లు ఉంటుంది. అదే దాని ప్రత్యేకత. ఎప్పుడైనా ఆలోచించారా? గారెలకు మధ్యలో చిల్లు ఎందుకు పెడతారు? ఇలా పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటి? దక్షిణ భారత అల్పాహారాల్లో దీన్ని వడ పేరుతో ఎక్కువగా తింటారు. దీన్ని వేడి సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో తింటే దాని రుచే వేరు.
ఎందుకు చిల్లు?
గారెను మినప్పప్పుతో తయారుచేస్తారు. ఈ పిండి బాగా గట్టిగా ఉంటుంది. గారె మధ్యలో చిల్లు పెడితే నూనెలో వేయించినప్పుడు వేడి సమంగా గారె లోపలికి చేరుతుంది. దీనివల్ల గారె మొత్తం కూడా బాగా ఉడుకుతుంది. అదే చిల్లు లేకపోతే బయట త్వరగా ఉడికిపోయి లోపల పిండి పచ్చిగా ఉండే అవకాశం ఉంది. చిల్లు పెట్టిన గారే మృదువుగా వస్తుంది. అలాగే గారే ఇలా చిల్లుపెట్టడం వల్ల ఎక్కువ నూనెను కూడా పీల్చుకోదు. జీర్ణ క్రియ కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. వడ ఆకారం దాని ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది. ఇది వడ త్వరగా వేగడానికి సాయపడుతుంది. ఈ రంధ్రం వల్లే వడ బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటుంది.
గారెల వెనుక చరిత్ర
చరిత్ర చెప్పే ఆసక్తికర కథనాల విషయానికొస్తే ప్రాచీన కాలంలో గారెలు ఉన్నాయి. దేవతలకు నైవేద్యంగా సమర్పించేవారు ఇప్పటికీ కూడా ఆ సంప్రదాయం ఉంది. గారె మధ్యలో ఉన్న చిల్లు ద్వారా శక్తి ప్రవాహం జరుగుతుందని నమ్మేవారు. అలాగే శివలింగాన్ని సూచించే రూపంగా కూడా గారెను భావించేవారు. గారెలో పెట్టిన చిల్లు ఆధ్యాత్మిక అర్ధాన్ని ఇస్తుందని కొందరు పండితులు అభిప్రాయం. గారే చక్రం ఆకారంలో ఉండటం వల్ల కాలచక్రాన్ని సూచిస్తుంది అని నమ్ముతారు. గారె మధ్యలో ఉన్న చిల్లు జీవితంలో ఉన్న ఖాళీలను, శూన్యతను సూచిస్తుందని అంటారు. గారె కేవలం ఆహారం మాత్రం కాదు తెలుగు రాష్ట్రాలకు ఒక సంప్రదాయ వంటకంగా మారిపోయింది.
సాంప్రదాయకంగా వడ చేసేటప్పుడు, తడి చేతిపై పిండిని ఉంచి, బొటనవేలితో రంధ్రం చేసి నూనెలో వేస్తారు. ఈ పద్ధతి వల్ల వడ ఆకారం మారదు. వేయించేటప్పుడు గరిటెతో తిప్పడానికి, తీయడానికి ఈ రంధ్రం చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది.
పురాతనమైన వంటకం
గారె అనేది మన తెలుగు వారి సంప్రదాయ ఆహారంలో చాలా పురాతనమైన వంటకం. ఇది వేల సంవత్సరాల క్రితమే మన మన ఆహారంలో భాగమైపోయింది. అప్పటి కాలంలో మినప్పప్పును అధికంగా వాడతారు. మినప్పప్పు ఆరోగ్యానికి మంచిదని, శక్తినిచ్చే ఆహారం.. అందుకే దానితో వివిధ వంటకాలు తయారు చేసేవారు. అప్పట్లో గారెలంటే ధనవంతుల వంటకంగా చెప్పుకునేవారు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ ఆకారం గారెకు ఒక గుర్తింపును ఇచ్చింది. ఈ ఆకారం వడ అని ఎవరైనా గుర్తించేలా చేసింది.

