MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Facts: అమెరికా రోడ్లపై కరెంటు తీగలు కనిపించవు ఎందుకో తెలుసా? ఇండియాలో ఇది సాధ్యమేనా?

Facts: అమెరికా రోడ్లపై కరెంటు తీగలు కనిపించవు ఎందుకో తెలుసా? ఇండియాలో ఇది సాధ్యమేనా?

Facts: అమెరికాలో ఎక్కవ శాతం కరెంటు తీగలు బయట కనిపించవు కారణం ఏంటి? ఫారెన్ కంట్రీస్ లో కరెంటు తీగలను ఎలా మెయింటైన్ చేస్తారు. ఇండియాలో కూడా ఇలా చేయడం సాధ్యమేనా?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 21 2026, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెరికాలో కరెంటు తీగలు ఎందుకు కనిపించవు ?
Image Credit : Asianet News

అమెరికాలో కరెంటు తీగలు ఎందుకు కనిపించవు ?

అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువ శాతం కరెంటు తీగలు బయట కనిపించవు. వీధుల్లో స్థంబాలు, పైన వేలాడుతూ ప్రమాదకరంగా తీగలు కనిపించవు. అమెరికాలో మాత్రమే కాదు యూకే లాంటి అభివృద్ది చెందిన దేశాల్లో .. విద్యుత్ తీగలు చాలా వరకు అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి. అయితే ఫారెన్ కంట్రీస్ లో అన్ని ప్రాంతాల్లో కరెంటు తీగలు భూగర్భంలో ఉండవు. ఇప్పటికీ కొంత వరకూ కరెంటు స్తంభాల మీదుగానే వెళ్తుంటాయి. అయితే, కొన్ని ప్రధాన నగరాలు, వాణిజ్య ప్రాంతాలు, ఆధునిక శివారు ప్రాంతాలల్లో భూగర్భాల మీదుగా కరెంటు తీగలను అమర్చారు. అమెరికాలో స్థంభాల మీదుగా వెళ్లే కరెంటు లైన్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఎలా పడితే అలా వైర్లు లాగడం, ప్రమాదకరంగా తీగలు వేయడం, వేలాడట, చెట్లకు దగ్గరగా కరెంటు తీగలు అమర్చకుండా.. ఓ సిస్టమాటిక్ గా విద్యుత్ తీగలను సెట్ చేస్తారు. వాటి మెయింటేనెస్ కూడా అలానే ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భూగర్భంలో వేయడానికి కారణం ఏంటి?
Image Credit : Youtube

భూగర్భంలో వేయడానికి కారణం ఏంటి?

అమెరికా లాంటి దేశాల్లో దాదాపు 50 శాతానికి పైగా విద్యుత్ పంపిణీ లైన్లు భూగర్భంలోనే ఉన్నాయి. తుపానులు, బలమైన గాలుల వల్ల స్తంభాలు విరిగిపోయి కరెంట్ పోయే ప్రమాదం భూగర్భ తీగలకు ఉండదు. తీగలు కనిపించకుండా నగరం చాలా అందంగా, పరిశుభ్రంగా కనిపిస్తుంది. కరెంట్ తీగల వల్ల అడవుల్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది. అంతే కాదు అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్ వల్ల ప్రభుత్వాలకు మెయింటెనెస్ కూడా తగ్గుతుంది. వర్షాలు పడినప్పుడు, తీగలు తెగడ, స్థంభాలు పడిపోవడం వల్ల వాటిని మార్చడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ అండర్ గ్రౌండ్ సిస్టమ్ వల్ల ఇవేమి ఉండవు. మొదలు పెట్టడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అంతే.

Related Articles

Related image1
Badi Panthulu Review: ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించిన ఏకైక చిత్రం, విలువలు నేర్పిన బడిపంతులు సినిమా
Related image2
Rashmika Home Tour: సొంత ఊరిలో రష్మిక మందన్న కష్టపడి కట్టుకున్న ఇల్లు చూశారా? స్వర్గంలా ఉన్న కూర్గ్ హౌస్ కాస్ట్ ఎంతంటే?
35
ఇండియాలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ సాధ్యం కాదా?
Image Credit : Asianet News

ఇండియాలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ సాధ్యం కాదా?

భారతదేశంలో కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయడం పూర్తిగా సాధ్యమే.. అంతే కాదు ఇప్పటికే అనేక నగరాలలో ఈ మార్పు వేగంగా జరుగుతోంది. అయితే విదేశాల్లో.. ముఖ్యంగా అమెరికాలాంటి దేశాల మాదిరిగా పల్లె నుంచి సిటీ వరకూ గ్రౌండ్ కేబులింగ్ చేయడానికి మన దేశంలో చాలా టైమ్ పడుతుంది. ఇండియాలోని నగరాలు,పట్టణాలు, పల్లెల్లో పైన వేలాడే విద్యుత్ తీగలు ఉన్నాయి. వాటిని తీసి అండర్ గ్రౌండ్ లోకి వేయాలంటే.. కొన్ని ప్రాంతాలో అది సాధ్యం అవ్వకపోవచ్చు. 

ఇరుకు ప్రాంతాల్లో తవ్వకాలు, మెయింటేనెన్స్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు జనసాంద్రత అధికంగా ఉండటం, ఒకేచోట వాటర్ పైపులు, డ్రైనేజీలు, గ్యాస్ పైపులైన్లు ఉండటం వల్ల కరెంటు తీగలు వేయడానికి తవ్వడం చాలా కష్టమైన పని. కానీ కాస్త విశాలంగా ఉండే ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసే అవకాశం ఉంది. అది ప్రస్తుతం జరుగుతుంది కూడా.

45
అమెరికాలో సాధ్యం మనదగ్గర ఏంటి ప్రాబ్లమ్.. ?
Image Credit : Getty

అమెరికాలో సాధ్యం మనదగ్గర ఏంటి ప్రాబ్లమ్.. ?

అమెరికాతో పోల్చుకుంటే.. అక్కడ భూభాగం ఎక్కువ.. జనాలు తక్కువ, ఇండియాలో జనాభా ఎక్కువగా ఉండటంతో.. మెయింటేనెన్స్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ ఇండియాలో అడర్ గ్రౌండ్ విద్యుత్ సిస్టమ్ ను కంప్లీట్ గా ఏర్పాటు చేయాలి అనుకుంటే.. అందుకోసం చాలా పనిచేయాల్సి ఉంటుంది. మన ప్రజలకు వాటిపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వకుండా జాగ్రత్తలు తీసుకునేలా వారిని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. జనాభా ఎక్కువగా ఉండే మనలాంటి దేశాంలో ఇది రిస్క్ తో కూడుకున్న పనే అవుతుంది. 

అమెరికాతో పాటు యూరప్ దేశాలు నగరాలను ప్లాన్ చేసినప్పుడే విద్యుత్ లైన్లను భూమిలోపల వేశారు. అందుకు తగ్గట్టుగా నగరాలు విస్తరించినప్పుడు.. ఆ లైన్ లను పెంచుకుంటూ వెళ్తున్నారు. కానీమన దేశంలో ఇప్పటికే నగరాల నిర్మాణం జరిగిపోయింది.. అవి జనాలతోకిక్కిరిసి ఉన్నాయి. వాటిని కదిలించి ఈ పనిచేయాలంటే చాలారిస్క్ అవుతుంది. అందుకే కొత్తగా విస్తరిస్తున్న నగరాల్లో భూగర్భ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాయి ప్రభుత్వాలు.

55
ఇండియాలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటే..?
Image Credit : Social Media

ఇండియాలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటే..?

భూగర్భ కేబుల్స్ వేయడం అనేది మామూలు తీగల కంటే 4 నుంచి 10 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. రోడ్లను తవ్వడం, కేబుల్స్ వేయడం, మళ్లీ రోడ్లు వేయడం చాలా పెద్ద ప్రాజెక్ట్. భూగర్భంలో కేబుల్స్ వేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువే.. కానీ దీర్ఘకాలంలో వీటి నిర్వహణ ఖర్చు చాలా తగ్గుతుంది. ఇండియాలో కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ కొన్ని ప్రాంతాల్లో జరుగుతూనే ఉంది. హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో దీని కోసం ప్రణాళికలు సిద్దమౌతున్నాయి. విశాఖపట్నంలో ప్రభుత్వం గతంలోనే ఈ పని చేసి చూపించింది. 

ఇక గుజరాత్ ప్రభుత్వం Wire-Free City Mission ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోని కరెంటు తీగలను భూగర్భంలోకి మార్చే ప్రయత్నం చేస్తోంది. Underground cabling system ను బెంగళూరులో కూడా కొంత మేర సక్సెస్ చేశారు. ఈతరహాలోనే పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అధికారిక ప్రణాళికలు సిద్ధమయ్యాయి. భద్రత, తుపానుల నుంచి రక్షణతో పాటు నగరాల సుందరీకరణ కోసం ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Funeral: అంతిమ సంస్కారాల్లో మట్టి కుండను ఎందుకు పగలగొడతారో తెలుసా.?
Recommended image2
ఏసీని మ‌నుషుల కోసం త‌యారు చేయ‌లేద‌ని తెలుసా? చ‌ల్ల గాలి వెనుక ఇంత సైన్స్ ఉందా.?
Recommended image3
Pancha Bhoota Temples: పంచభూత క్షేత్రాల రహస్యం ఇదే.. ఈ ఆలయాల ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Badi Panthulu Review: ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించిన ఏకైక చిత్రం, విలువలు నేర్పిన బడిపంతులు సినిమా
Recommended image2
Rashmika Home Tour: సొంత ఊరిలో రష్మిక మందన్న కష్టపడి కట్టుకున్న ఇల్లు చూశారా? స్వర్గంలా ఉన్న కూర్గ్ హౌస్ కాస్ట్ ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved