MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Ant Milk : చీమలు పాలు ఇస్తాయా? వీటిని సేకరించవచ్చా?

Ant Milk : చీమలు పాలు ఇస్తాయా? వీటిని సేకరించవచ్చా?

Ant Milk : మనుషులే కాదు గేదెలు, ఆవులు, పులులు, సింహాలు కూడా తమ పిల్లలకు పాలు ఇచ్చి పెంచుతాయి. అయితే చీమలు కూడా పాలు ఇస్తాయని మీకు తెలుసా? చీమపాల గురించి ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 26 2026, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చీమ పాల గురించి ఆసక్తికర విషయాలు..
Image Credit : Gemini AI

చీమ పాల గురించి ఆసక్తికర విషయాలు..

Ant Milk : తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వడం అనేది ఈ ప్రకృతిలో సహజ ప్రక్రియ. మనుషులే కాదు వివిధ రకాల జంతువులు కూడా తమ బిడ్డలకు పాలు ఇస్తాయి... వీటిలో బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యానికి సంబంధించిన అనేక పోషకాలు ఉంటాయి. ఆవులు, గేదెలు, కుక్కలు వంటి పెంపుడు జంతువులే కాదు అడవిలో ఉండే పులులు, సింహాలు కూడా పాలిచ్చే జంతువులే.. చివరకు గాడిదలు, ఒంటెలు కూడా పాలు ఇస్తాయని తెలుసు. అయితే చీమలు కూడా పాలు ఇస్తాయని మీ తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చీమలు పాలు ఇస్తాయా..!
Image Credit : Pixabay

చీమలు పాలు ఇస్తాయా..!

సాధారణంగా పాలిచ్చే జంతువులను క్షీరదాలు అంటారు. కానీ చీమలు క్షీరదాలు కావు కీటకాలు... అయినప్పటికి ఇవి పాలు ఉత్పత్తి చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. అయితే అన్ని జంతువుల్లో పెద్ద జీవులు పాలు ఇస్తే చిన్నజీవులు తాగుతాయి... కానీ చీమల్లో ఇది రివర్స్.. చిన్న చీమలు పాలు ఇస్తే పెద్దచీమలు తాగుతాయి.

చీమలు గుడ్లు పెడతాయి... దీని నుండి అనేక దశల్లో చిన్నచీమలు జీవం పోసుకుంటాయి. ఇందులో మొదటిదశ లార్వా.... తర్వాత ప్యూపా దశ ఉంటుంది. ఈ ప్యూపా దశలో అంటే చిన్నగా ఉండగానే చీమలు పాలలాంటి ద్రవాన్ని విడుదల చేస్తాయి... ఇందులో ఉండే పోషకాలు లార్వా దశలోని చీమలకు ఉపయోగపడతాయట.

35
చీమలు పాలు తాగుతాయా?
Image Credit : Pinterest

చీమలు పాలు తాగుతాయా?

అయితే ప్యూపా దశలోని చీమలనుండి ఎక్కువమొత్తంలో పాలలాంటి పోషక ద్రవాలు విడుదల అవుతాయి. ఈ మొత్తాన్ని లార్వాలు ఉపయోగించుకోలేవు... కొద్దిగా మాత్రమే తాగుతాయి... కాబట్టి ఈ ద్రవాలు అలాగే ఉంటే లార్వా మునిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే పెద్దచీమలు ఈ పాలను తాగేస్తాయి... దీంతో ద్రవాలు బ్యాలెన్స్ అయి చీమ లార్వాకు ప్రమాదం తప్పుతుంది. ఇలా ప్యూపా చీమల అంటే చిన్న చీమల నుండి విడుదలయ్యే పాలలాంటి ద్రవాలను లార్వా, పెద్దచీమలు తాగుతాయన్నమాట.

45
చీమ పాలలో పోషకాలుంటాయా?
Image Credit : stockPhoto

చీమ పాలలో పోషకాలుంటాయా?

తల్లి పాలలో అనేక పోషకాలు ఉంటాయి... అందుకే మనుషులే కాదు ఇతర జంతువులు పిల్లలకు ఈ పాలిచ్చే పెంచుతాయి. ఇలాగే చీమ పాలలో కూడా మంచి పోషకాలు ఉంటాయట.. ఇవి చీమల ఎదుగుదలకు దోహదపడతాయని పరిశోదకులు చెబుతున్నారు.

చీమ పాలలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు చీమల ఎదుగుదలకు ఉపయోగపడే అనేక పదార్థాలు ఉంటాయని పరిశోధనల్లో గుర్తించారు. ముఖ్యంగా లార్వా నుండి చీమలు ప్రాణం పోసుకునే దశలో ఈ పాలనుండే పోషకాలు అందుతాయట... లేదంటే చీమల జాతి నశించిపోయే ప్రమాదం ఉండేదని చెబుతున్నారు.

55
చీమ పాలను సేకరించడం సాధ్యమేనా..?
Image Credit : Freepik

చీమ పాలను సేకరించడం సాధ్యమేనా..?

మనుషులు గేదెలు, ఆవుల నుండి పాలను సేకరించి తాగుతుంటారు... ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గాడిద, ఒంటె వంటి జంతువుల నుండి పాలు సేకరిస్తాయి... వీటిలో అనేక ఔషద గుణాలు ఉన్నాయని చెబుతుంటారు. మరి చీమ పాలలో కూడా పోషకాలు ఉన్నాయంటున్నారు... ఈ పాలను సేకరించడం సాధ్యం అవుతుందా? అంటే అసాధ్యమని పరిశోధకులు చెబుతున్నారు.

చీమలు చాలా చిన్నజీవులు... అందులోనూ ప్యూపా దశలో చీమలు మరింత చిన్నగా ఉంటాయి. సాధారణంగా కంటికి కనిపించవు... ఇలాంటి చీమలు ఎన్ని పాలు ఇస్తాయో ఊహించవచ్చు. ఇలా అతిచిన్న జీవులైన చీమల నుండి పాలను సేకరించడం అసాధ్యమైన పని. అయితే పరిశోధనల కోసం మాత్రం ప్రత్యేక పద్దతిలో ఈ చీమ పాలను సేకరిస్తారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Unique Temples : దేవుళ్లకు నైవేద్యంగా మందు, మటన్, చేపలు.. భక్తులకూ ఇవే ప్రసాదం.. ఎక్కడో తెలుసా?
Recommended image2
Telugu Saying: లోకువ మొగుడికి నూకల జావ! ఈ సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
Recommended image3
గాలి నుంచి కరెంట్ ఎలా తయారవుతుంది.? విండ్ టర్బైన్ వెనుక అసలు ప్రాసెస్ ఇదే
Related Stories
Recommended image1
Milk Benefits: వేడి పాలా? చల్లటి పాలా? ఆరోగ్యానికి ఏది మంచిది?
Recommended image2
Milk: ఈ పొడి చిటికెడు వేస్తే.. పాలు రెండు, మూడురోజులైనా విరిగిపోవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved