MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • ప్రపంచంలోనే అత్యంత మత్తునిచ్చే మద్యం ఏదో తెలుసా.? ఏకంగా 96 శాతం ఆల్క‌హాల్‌

ప్రపంచంలోనే అత్యంత మత్తునిచ్చే మద్యం ఏదో తెలుసా.? ఏకంగా 96 శాతం ఆల్క‌హాల్‌

Alcohol: చాలామంది బీర్, వైన్, విస్కీ, రమ్, వోడ్కా వాటి గురించి వినే ఉంటారు. అయితే వీటన్నింటితో పోలిస్తే చాలా ఎక్కువ ఆల్కహాల్ ఉన్న మద్యం కూడా ఉంది. ఇందులో ఆల్కహాల్ శాతం ఏకంగా 96 శాతం వరకు ఉంటుంది. ఇంతకీ ఆ మద్యం పేరేంటి?

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 23 2026, 06:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచంలో అత్యధిక ఆల్కహాల్ ఉన్న మద్యం ఏది?
Image Credit : Gemini AI

ప్రపంచంలో అత్యధిక ఆల్కహాల్ ఉన్న మద్యం ఏది?

ప్రపంచంలో అత్యధిక ఆల్కహాల్ శాతం ఉన్న వాణిజ్య స్పిరిట్స్‌లో పోలాండ్‌కు చెందిన స్పిరిటస్ రెక్టిఫికోవానీ (Spirytus Rektyfikowany) ప్రముఖంగా నిలుస్తుంది. ఇందులో సుమారు 96 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అందుకే దీనిని అత్యంత బలమైన వాణిజ్య స్పిరిట్స్‌లో ఒకటిగా పరిగణిస్తారు. సాధారణంగా మనం తాగే విస్కీ, రమ్, వోడ్కాలో సుమారు 40 శాతం ఆల్కహాల్ ఉంటుంది. కానీ స్పిరిటస్‌లో ఈ పరిమాణం దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందులో 96 శాతం ABV అంటే ప్రతి 100 మిల్లీలీటర్ల ద్రవంలో సుమారు 96 మిల్లీలీటర్ల ఇథనాల్ ఉంటుందని అర్థం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
96 శాతం ఆల్కహాల్ అంటే ఎంత బలమైనది?
Image Credit : Gemini AI

96 శాతం ఆల్కహాల్ అంటే ఎంత బలమైనది?

మద్యంలో ఆల్కహాల్ పరిమాణాన్ని తెలుసుకోవడానికి ABV (Alcohol by Volume) అనే కొలమానాన్ని ఉపయోగిస్తారు. ఇది ఒక పానీయంలో ఆల్కహాల్ ఎంత శాతం ఉందో తెలియజేస్తుంది. సాధారణంగా వివిధ మద్యపానీయాల్లో ఉండే ఆల్కహాల్ పరిమాణం ఇలా ఉంటుంది. బీరులో 4 నుంచి 8 శాతం, వైన్ 10 నుంచి 15 శాతం, విస్కీలో సుమారు 40 శాతం ఉంటుంది. అలాగే ర‌మ్‌లో 35 నుంచి 45 శాతం, వోడ్కాలో సుమారు 40 శాతం, స్పిరిటస్ రెక్టిఫికోవానీలో ఏకంగా 96 శాతం ఆల్క‌హాల్ ఉంటుంది. ఇంత ఎక్కువ ఆల్కహాల్ ఉండటం వల్ల దీనిని సాధారణ మద్యం మాదిరిగా నేరుగా తాగే పానీయంగా పరిగణించరు. ప్రధానంగా లిక్కర్లు, పండ్ల ఆధారిత పానీయాలు, ఇతర ప్రత్యేక తయారీల్లో ఉపయోగిస్తారు.

35
రెండో స్థానంలో ఉండే మద్యం ఏది?
Image Credit : Gemini AI

రెండో స్థానంలో ఉండే మద్యం ఏది?

అత్యధిక ఆల్కహాల్ ఉన్న వాణిజ్య స్పిరిట్స్‌లో అమెరికాకు చెందిన ఎవర్‌క్లియర్ 190 (Everclear 190) కూడా ప్రముఖమైంది. ఇందులో సుమారు 95 శాతం ABV ఆల్కహాల్ ఉంటుంది. అంటే స్పిరిటస్ కంటే కేవలం ఒక శాతం మాత్రమే తక్కువ. దీనితో పాటు గోల్డెన్ గ్రెయిన్ 190 (Golden Grain 190) వంటి స్పిరిట్స్‌లో కూడా సుమారు 95 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అలాగే 90 శాతం వరకు ఆల్కహాల్ ఉన్న మరికొన్ని బలమైన స్పిరిట్స్ కూడా మార్కెట్‌లో ఉన్నాయి.

45
ఎక్కువ ఆల్కహాల్ ఉన్న మద్యం ఎలా తయారవుతుంది?
Image Credit : Gemini AI

ఎక్కువ ఆల్కహాల్ ఉన్న మద్యం ఎలా తయారవుతుంది?

మద్యం తయారీలో మొదట కిణ్వ ప్రక్రియ (Fermentation) ద్వారా ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత డిస్టిలేషన్ (Distillation) ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ సాంద్రతను పెంచుతారు. ఈ ప్రక్రియలో ఆల్కహాల్, నీటిని వేరు చేస్తారు. అయితే సాధారణ డిస్టిలేషన్ ద్వారా 100 శాతం స్వచ్ఛమైన ఆల్కహాల్ పొందడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇథనాల్, నీరు ఒక నిర్దిష్ట స్థాయిలో అజియోట్రోప్ (Azeotrope) అనే స్థితికి చేరుకుంటాయి. అందుకే మార్కెట్‌లో లభించే అత్యధిక ఆల్కహాల్ ఉన్న స్పిరిట్స్ సాధారణంగా 95 నుంచి 96 శాతం ABV వరకు మాత్రమే ఉంటాయి.

55
96 శాతం ఆల్కహాల్ ఉన్న మద్యాన్ని నేరుగా తాగవచ్చా?
Image Credit : Gemini AI

96 శాతం ఆల్కహాల్ ఉన్న మద్యాన్ని నేరుగా తాగవచ్చా?

96 శాతం ఆల్కహాల్ ఉన్న స్పిరిటస్‌ను నేరుగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇంత ఎక్కువ సాంద్రతలో ఉన్న ఆల్కహాల్ శరీరంలోకి వేగంగా చేరి తీవ్రమైన ఆల్కహాల్ విషప్రభావం (Alcohol Toxicity) కలిగించే అవకాశం ఉంది. దీని వల్ల స్పృహ కోల్పోవడం, శ్వాస మందగించడం, ప్రాణాపాయం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఇలాంటి స్పిరిట్స్‌ను సాధారణ మద్యంలా నేరుగా తాగకూడదు. తయారీ సంస్థలు కూడా వీటిని ప్రధానంగా ఇతర తయారీల్లో ఉపయోగించాలని సూచిస్తాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
No Capital Country: ప్రపంచంలో రాజధాని లేని ఒకే ఒక్క దేశం ఏదో తెలుసా?
Recommended image2
తెలంగాణలో 6 అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రాలు, తప్పకుండా సందర్శించాల్సిన ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఇవే!
Recommended image3
Paralakhemundi Railway Station: బ్రిటిషర్లు కాదు, ఇండియన్ రైల్వే కాదు...రాజు నిర్మించిన రైల్వేస్టేషన్, ఎక్కడుందో తెలుసా?
Related Stories
Recommended image1
భజ గోవిందం... ఎలా బతకాలో చెప్పే జీవిత సత్యం. ఏమన్నా లిరిక్సా అసలు
Recommended image2
Railway: ర‌న్నింగ్ ట్రైన్‌లో బ్లింకిట్ సేవ‌లు.. ఎలా ఆర్డ‌ర్ చేసుకోవాలంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved