MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Cotton Capital: మనదేశంలో పత్తి వ్యాపారానికి రాజధాని ఏదో తెలుసా? ఆసియాలోనే అతిపెద్ద పత్తి మార్కెట్లలో ఒకటి ఇక్కడే ఉంది.

Cotton Capital: మనదేశంలో పత్తి వ్యాపారానికి రాజధాని ఏదో తెలుసా? ఆసియాలోనే అతిపెద్ద పత్తి మార్కెట్లలో ఒకటి ఇక్కడే ఉంది.

Cotton Capital: మన దేశంలో పత్తి పంటకు పేరుగాంచిన స్టేట్స్ లో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. ఇక్కడ పంట మాత్రమే కాదు అమ్మకానికి కూడా అతి పెద్ద మార్కెట్ ఉందని మీకు తెలుసా? ఆసియాలోని అతి పెద్ద కాటన్ మార్కెట్స్ లో ఒకటి మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 29 2026, 08:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తెల్లబంగారం అని పేరు..
Image Credit : ChatGPT

తెల్లబంగారం అని పేరు..

వాణిజ్య పంటలలో పత్తికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి అందరికి తెలిసిందే. టెక్స్ టైల్ పరిశ్రమ మనుగడకు కారణమైన పత్తికి దేశ విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉంటుంది. అందుకే పత్తిని తెల్లబంగారం అంటుంటారు. అటువంటి పత్తి పంటను ఇండియాలో ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రాలలో గుజరాత్ ముందు ఉండగా.. ఆతర్వాత ప్లేస్ లో ఉన్నది మన తెలుగు రాష్ట్రాలే. అంతే కాదు పత్తి వ్యాపారానికి కూడా మన రాష్టం రాజధానిగా నిలిచింది.

ముఖ్యంగా తెలంగాణలోని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పత్తి వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ప్రధాన మార్కెట్ యార్డుల్లో ఒకటి. వేలాది మంది రైతులు తమ పంటలను విక్రయించేందుకు ఇక్కడికి వస్తుంటారు. పత్తి కొనుగోళ్లు, ధరలు, మార్కెట్‌కు వచ్చిన పంట పరిమాణంలో ఈ మార్కెట్ ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది. అందుకే ఎనుమాముల మార్కెట్‌ పత్తి వ్యాపారంలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ మార్కెట్ ఎక్కడ ఉంది ?
Image Credit : Asianet News

ఈ మార్కెట్ ఎక్కడ ఉంది ?

వరంగల్ నగరంలోని ఎనుమాముల ప్రాంతంలో ఈ వ్యవసాయ మార్కెట్ యార్డు ఉంది. వరంగల్, హనుమకొండతో పాటు పరిసర ప్రాంతాల రైతులు ఇక్కడ పత్తి, మిర్చి, పసుపు, ధాన్యం వంటి పంటలను విక్రయిస్తుంటారు. మార్కెట్ నిర్వహణను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఎనుమాముల మార్కెట్‌ను ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పలు వార్తా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఆసియాలో పత్తి వ్యాపారంలో ఇదే ప్రథమ స్థానంలో ఉందనిమాత్రం చెప్పలేము. ఆసియాలోని అతిపెద్ద పత్తి మార్కెట్లలో ఇది కూడా ఒకటి.

పత్తి కొనుగోళ్లలో రికార్డు

ఎనుమాముల మార్కెట్ చరిత్రలో పత్తి కొనుగోళ్ల పరంగా 2024–25 సీజన్‌ ప్రత్యేకంగా నిలిచింది. పలు మీడియా నివేదిక ప్రకారం, ఆ ఏడాది డిసెంబర్ నాటికి మార్కెట్‌లో మొత్తం 9,38,841 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగింది.ఇందులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) 7,45,580 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, ప్రైవేటు వ్యాపారులు 1,93,260 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. అంతకుముందు 2023–24 సీజన్‌లో మొత్తం కొనుగోళ్లు 9,22,268 క్వింటాళ్లుగా నమోదయ్యాయని తెలుస్తోంది. అంటే, 2024 డిసెంబర్ నాటికే అంతకుముందు సీజన్ మొత్తం కొనుగోళ్లను మార్కెట్ అధిగమించింది.

33
రైతులకు ఈ మార్కెట్ ఎందుకు ముఖ్యం?
Image Credit : GeminiAI

రైతులకు ఈ మార్కెట్ ఎందుకు ముఖ్యం?

రైతులు తమ పత్తిని విక్రయించడానికి మార్కెట్‌కు తీసుకొస్తారు. పత్తిలో తేమ శాతం, నాణ్యత, ఇతర లక్షణాలను పరిశీలించిన తర్వాత ధర నిర్ణయిస్తారు. మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులతో పాటు CCI కూడా కొనుగోళ్లు చేపడుతుంది. అర్హత కలిగిన పత్తికి కనీస మద్దతు ధర (MSP) లభించేలా ప్రభుత్వ కొనుగోలు విధానం తోడ్పడుతుంది. పత్తి వ్యాపారంతో పాటు రవాణా, కూలీ పనులు, జిన్నింగ్ మిల్లులు, పత్తి నిల్వ వంటి రంగాలకు కూడా ఉపాధి లభిస్తుంది. దీంతో ఎనుమాముల మార్కెట్ పరిసర ప్రాంతాల ఆర్థిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని వందల మంది కూలీలకు ఈ మార్కెట్ ఉపాధి కలిపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వైరల్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Moon: అమావాస్య నుంచి పున్నమి వరకు.. అసలు రాత్రిపూట చంద్రుడు ఎందుకు మారుతాడు?
Recommended image2
City of Lakes: మనదేశంలో సిటీ ఆఫ్ లేక్స్‌ అని ఏ నగరాలను పిలుస్తారు?
Recommended image3
Death Valley: నేపాల్‌లో ప్రాణాలు తీస్తున్న కర్ణాలి హైవే.. ప్రయాణం ఎందుకంత ప్రమాదకరం?
Related Stories
Recommended image1
Ramya Krishnan: బిగ్ బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్ కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Recommended image2
Gold Road: ప్రపంచంలోనే తొలిసారి బంగారంతో రోడ్డు నిర్మాణం.. మనం నడవచ్చు కూడా, ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved