MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Gold Road: ప్రపంచంలోనే తొలిసారి బంగారంతో రోడ్డు నిర్మాణం.. మనం నడవచ్చు కూడా, ఎక్కడో తెలుసా?

Gold Road: ప్రపంచంలోనే తొలిసారి బంగారంతో రోడ్డు నిర్మాణం.. మనం నడవచ్చు కూడా, ఎక్కడో తెలుసా?

Gold Road: ప్రపంచంలో గోల్డ్ తో చేసిన వింతలు చాలా ఉన్నాయి. గోల్డ్ స్పూన్ దగ్గర నుంచి ఇంట్లో బాత్ రూమ్ లు కూడా గోల్డ్ తో చేయించుకున్నవారు ఉన్నారు. కానీ గోల్డ్ తో వేసిన రోడ్డు గురించి మీరెప్పుడైనా విన్నారా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 28 2026, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బంగారంతో రోడ్డు నిర్మాణం..
Image Credit : Asianet News

బంగారంతో రోడ్డు నిర్మాణం..

బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. పసిడి ధర ఎంత పెరిగినా ఆభరణాలు కొనుగోలు చేసేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇక బంగారంతో రకరకాల వస్తువులు తయారు చేయడం గురించి కూడా మనం వింటూనే ఉంటాం. కానీ బంగారంతో నిర్మించిన రోడ్డుపై నడిచే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? పర్యాటకులకు ఇలాంటి వినూత్న అనుభూతిని అందించేందుకు దుబాయ్ సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే తొలి, అతి పొడవైన 24 క్యారెట్ల బంగారు నడకదారిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎక్కడ నిర్మించనున్నారు?
Image Credit : ‍X

ఎక్కడ నిర్మించనున్నారు?

బంగారం వ్యాపారానికి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దుబాయ్‌లోని గోల్డ్ డిస్ట్రిక్ట్ ఈ ప్రత్యేక ప్రాజెక్టుకు వేదిక కానుంది. పసిడి ఆభరణాలు, వజ్రాలు, విలువైన రాళ్లు, ఖరీదైన గడియారాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి కొత్త ఆకర్షణను జోడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 24 క్యారెట్ల బంగారు నడకదారి అందుబాటులోకి వస్తే పర్యాటకులు దానిపై నడుస్తూ ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు.

ఈ ప్రాజెక్టును 2026 సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ఈ రహదారి ఎంత పొడవు ఉంటుంది? నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది? నిజంగా ఎంత బంగారాన్ని ఉపయోగిస్తారు? వంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు. అలాగే నడకదారి నిర్మాణంలో బంగారాన్ని ఏ రూపంలో ఉపయోగిస్తారనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది.

బంగారం వ్యాపారానికి మరింత ప్రోత్సాహం

దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో ఇప్పటికే బంగారు ఆభరణాల వ్యాపారం విస్తృతంగా సాగుతోంది. ఈ ప్రాంతంలో కొత్త వ్యాపార సంస్థల కార్యకలాపాలు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన బంగారం టోకు వ్యాపార కార్యాలయాల సంఖ్య 20 శాతం పెరిగినట్లు సమాచారం. బంగారు నగలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువుల విక్రయ దుకాణాల సంఖ్య కూడా 15 శాతం పెరిగినట్లు అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చే కంపెనీల సంఖ్య 10 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగారు నడకదారితో పాటు అతిపెద్ద బంగారం, నగల వ్యాపార ప్రదర్శనను నిర్వహించాలనే ప్లాన్ కూడా చేస్తున్నారు. దాంతో దుబాయ్ గోల్డ్ బిజినెస్ లో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

33
భారీ బంగారు జుంకాలతో ప్రపంచ రికార్డులు
Image Credit : joyalukkas/instagram

భారీ బంగారు జుంకాలతో ప్రపంచ రికార్డులు

దుబాయ్‌లో బంగారంతో ముడిపడిన మరో విశేషం కూడా ఉంది. జోయాలుక్కాస్ సంస్థ రూపొందించిన భారీ బంగారు జుంకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 22 క్యారెట్ల బంగారంతో తయారైన ఈ జుంకాల జత బరువు ఏకంగా 16.514 కిలోలు. నెమలి అందాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన ఈ ఆభరణాలు మయూర సహస్ర" (Mayura Sahasra) పేరిట రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను (Guinness World Records) సొంతం చేసుకున్నాయి. వీటిని విక్రయించకుండా దుబాయ్‌లోనే ప్రదర్శనకు ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

మొత్తానికి, బంగారు జుంకాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దుబాయ్, ఇప్పుడు గోల్డ్ రోడ్ ప్రాజెక్టుతో మరో ప్రత్యేక గుర్తింపు పొందాలని చూస్తోంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే బంగారం కొనుగోలు చేయడంతో పాటు, బంగారంతో రూపొందించిన ప్రత్యేక నిర్మాణాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం పర్యాటకులకు లభిస్తుంది. అయితే ప్రాజెక్టు నిర్మాణ వివరాలు, ప్రారంభ తేదీపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Winter Festivals: వింటర్‌ ట్రిప్‌కు ఇదే సరైన సమయం.. పుష్కర్‌ నుంచి గుజరాత్‌ కైట్‌ ఫెస్టివల్‌ వరకు 5 ప్రత్యేక వేడుకలు!
Recommended image2
నువ్వు నీలా ఉంటేనే నిజ‌మైన సంతోషం.. ఈ కాకి క‌థ చ‌దివితే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం
Recommended image3
Interesting Facts: కారు, బస్సు నడిపితే డ్రైవర్, ట్రైన్ నడిపితే లోకో పైలట్ అని ఎందుకు అంటారు?
Related Stories
Recommended image1
Kalisundam Raa Review: బాలకృష్ణను చిత్తుగా ఓడించిన వెంకటేష్ సినిమా.. కలిసుందాం రా రివ్యూ..
Recommended image2
Diamond Village: ఆంధ్రప్రదేశ్ లో మట్టిలో కూరుకుపోయిన వజ్రాల గ్రామం... ఇప్పటికీ అక్కడ వజ్రాల కోసం వెతుకుతున్న ప్రజలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved