- Home
- Entertainment
- Ramya Krishnan: బిగ్ బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్ కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Ramya Krishnan: బిగ్ బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్ కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Ramya Krishnan: బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ.. ఇది ఒకప్పటి మాట కాదు రీసెంట్ గా మరోసారి బిగ్ బాస్ స్టేజ్ పై మెరిసింది శివగామి. తన మాటల తూటాలతో కంటెస్టెంట్స్ కు దడపుట్టించింది. ఇంతకీ హోస్ట్ గా చేసినందకు ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా?

బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ
వెండితెరపై తమదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రమ్యకృష్ణ, బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా ‘బిగ్ బాస్’ వంటి పాపులర్ రియాలిటీ షోలో ఆమె కనిపిస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతుంది. గతంలొ కూడా తెలుగు బిగ్ బాస్ స్టేజ్ పై మెరిసిన రమ్యకృష్ణ.. తాజాగా మరోసారి బిగ్ బాస్ హోస్ట్ గా కనిపించి సందడి చేసింది. అయితే ఆమె తెలుగు బిగ్ బాస్ స్టేజ్ పై కాకుండా.. ఈసారి తమిళ బిగ్ బాస్ సీజన్ 10లో హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమెకు అందుతున్న పారితోషికం గురించి కూడా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్ సేతుపతి స్థానంలో రమ్యకృష్ణ
తమిళ బిగ్ బాస్ కార్యక్రమానికి గత మూడు సీజన్లుగా నటుడు విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్న కారణంగా ఈ వీకెండ్ ఎపిసోడ్లకు దూరంగా ఉన్నారు విజయ్. దాంతో ఆయన స్థానంలో రమ్యకృష్ణ హోస్టింగ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ కి గొంతు సమస్య ఉందని ఆమె స్వయంగా వెల్లడించారు. తనదైన మాటతీరు, గంభీరమైన వ్యక్తిత్వంతో రమ్యకృష్ణ వేదికపై కనిపించడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కంటెస్టెంట్లతో మాట్లాడే విధానం, వారి ఆటతీరుపై స్పందించే తీరు షోకు కొత్త ఆసక్తిని తీసుకొచ్చాయి. అయితే ఆమె హోస్టింగ్ బాధ్యతలు ఎన్ని వారాల పాటు కొనసాగుతాయనే దానిపై నిర్వాహకుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ఒక్క ఎపిసోడ్ కి రెమ్యునరేషన్ ఎంత?
ప్రస్తుతం రమ్యకృష్ణ పారితోషికానికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పలు మీడియా కథనాల ప్రకారం, బిగ్ బాస్ తమిళ్ 10లో హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఆమె ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.15 లక్షలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీకెండ్ ఎపిసోడ్లు సాధారణంగా రెండు రోజుల పాటు ప్రసారమవుతుండటంతో, రెండు రోజుల పారితోషికం కలిపి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ మొత్తాన్ని రమ్యకృష్ణ కానీ, బిగ్ బాస్ నిర్వాహకులు కానీ అధికారికంగా ధృవీకరించలేదు.
బిగ్ బాస్‌కు రమ్యకృష్ణ కొత్త కాదు
రమ్యకృష్ణకు బిగ్ బాస్ కార్యక్రమంతో గతంలోనూ అనుబంధం ఉంది. తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్‌లో నాగార్జున అందుబాటులో లేకపోవడంతో.. ఒక వారం పాటు ఆమె హోస్ట్‌గా వ్యవహరించారు. అలాగే తమిళ బిగ్ బాస్ ఐదో సీజన్‌లోనూ అప్పటి హోస్ట్ కమల్ హాసన్ అందుబాటులో లేని సమయంలో వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మరోసారి తమిళ బిగ్ బాస్ వేదికపైకి రావడంతో ఆమెకు సంబంధించిన పాత జ్ఞాపకాలు కూడా ప్రేక్షకుల్లో చర్చకు వస్తున్నాయి. సుదీర్ఘమైన సినీ అనుభవం, తెరపై తన మార్క్ పెర్పామెన్స్.. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడ్డాయని తెలుస్తోంది. ఇక తర్వాత ఎపిసోడ్స్ కు ఆమె హోస్టింగ్ కొనసాగుతుందా, విజయ్ సేతుపతి ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.