MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Can Dogs See Every Colors : కుక్కలకు కనిపించేవి రెండు రంగులేనా? అవి చూసే అసలైన రంగులేంటో తెలుసా?

Can Dogs See Every Colors : కుక్కలకు కనిపించేవి రెండు రంగులేనా? అవి చూసే అసలైన రంగులేంటో తెలుసా?

Can Dogs See Every Colors : కుక్కలు కేవలం బ్లాక్ అండ్ వైట్ మాత్రమే చూస్తాయనుకుంటే పొరపాటే. సైన్స్ ప్రకారం అవి చూసే అసలైన రంగులు, వాటి కలర్ విజన్ సీక్రెట్స్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 24 2026, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కుక్కల ప్రపంచం బ్లాక్ అండ్ వైట్ కాదు బాసూ.. అవి చూసే అసలైన రంగులేంటో తెలుసా?
Image Credit : Gemini

కుక్కల ప్రపంచం బ్లాక్ అండ్ వైట్ కాదు బాసూ.. అవి చూసే అసలైన రంగులేంటో తెలుసా?

మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్కల ప్లేసే వేరు. మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్‌లా కలిసిపోతాయి. మనం చూపించే ప్రేమకు వంద రెట్లు విశ్వాసాన్ని తిరిగి ఇస్తాయి. అయితే, రోజంతా మనతోనే గడిపే మన కుక్కల గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

అందులో ముఖ్యమైనది వాటి చూపు. సాధారణంగా మనందరం ఉదయం లేచింది మొదలు రంగురంగుల ప్రపంచాన్ని చూస్తాం. నీలి రంగు ఆకాశం, ఎర్రటి సూర్యుడు, పచ్చటి చెట్లు.. ఇలా ఎన్నో కలర్స్ ఎంజాయ్ చేస్తాం. కానీ, మన పక్కనే ఉండే కుక్కలు కూడా ఈ ప్రపంచాన్ని మనలాగే చూస్తాయా? అవి కేవలం బ్లాక్ అండ్ వైట్ మాత్రమే చూడగలవని చాలామంది అనుకుంటారు. కానీ అందులో నిజం ఎంత? సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అపోహలు వద్దు.. కుక్కల చూపు బ్లాక్ అండ్ వైట్ కానే కాదు
Image Credit : Getty

అపోహలు వద్దు.. కుక్కల చూపు బ్లాక్ అండ్ వైట్ కానే కాదు

చాలా కాలంగా జనాలు కుక్కలకు కేవలం నలుపు, తెలుపు రంగులు మాత్రమే కనిపిస్తాయని అనుకుంటున్నారు. కానీ ఈ జనరేషన్ సైన్స్ ఆ అపోహలను పూర్తిగా కొట్టేసింది. కుక్కల ప్రపంచం కేవలం బ్లాక్ అండ్ వైట్ కాదు. అవి కూడా రంగులను చూడగలవు, కానీ మనలా అన్ని రంగులను స్పష్టంగా ఐడెంటిఫై చేయలేవు. వాటి కలర్ విజన్ మనకంటే కొంచెం భిన్నంగా ఉంటుంది.

Related Articles

Related image1
Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Related image2
Vehicle Number Plates: కార్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు ఉంటాయి? అసలు ఈ సిస్టమ్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో తెలుసా?
36
సైన్స్ ఏం చెబుతోంది? ‘డైక్రోమాట్స్’ అంటే ఏంటి?
Image Credit : Getty

సైన్స్ ఏం చెబుతోంది? ‘డైక్రోమాట్స్’ అంటే ఏంటి?

మనుషుల కళ్లలో రంగులను గుర్తించడానికి కోన్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. మన కళ్లలో మూడు రకాల కోన్ కణాలు ఉండటం వల్ల మనం ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు ఇలా ఇంద్రధనస్సులోని అన్ని రంగులను స్పష్టంగా చూడగలుగుతాం. కానీ, కుక్కల విషయానికి వస్తే, వాటి కళ్లలో కేవలం రెండు రకాల కోన్ కణాలు మాత్రమే ఉంటాయి. అందుకే సైన్స్ భాషలో కుక్కలను డైక్రోమాట్స్ అని పిలుస్తారు. దీనివల్ల అవి చాలా పరిమితమైన రంగులను మాత్రమే చూడగలవు.

46
కుక్కల ప్రపంచంలో టాప్ కలర్స్ ఏవి?
Image Credit : AI Meta

కుక్కల ప్రపంచంలో టాప్ కలర్స్ ఏవి?

కుక్కల కళ్లలో ఉండే రెండు రకాల కోన్ కణాలు కేవలం నీలం, పసుపు రంగులను మాత్రమే పసిగట్టగలవు. అందుకే కుక్కల ప్రపంచంలో నీలం, పసుపు అనేవి అత్యంత ప్రకాశవంతమైన, స్పష్టమైన రంగులు. వీటికి ఎరుపు, నారింజ, ఆకుపచ్చ రంగుల మధ్య తేడాలను గుర్తించడం చాలా కష్టం. అందుకే మార్కెట్‌లో లభించే కుక్కల ఆట వస్తువులు, బెల్టులు, ఇతర పరికరాలను ఎక్కువగా బ్లూ అండ్ ఎల్లో కలర్స్‌లోనే డిజైన్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ రంగుల వైపు అవి త్వరగా ఆకర్షితులవుతాయి.

56
వాసనతోనే అసలైన ఆట.. చీకటిలోనూ ఫాస్ట్
Image Credit : Pixabay

వాసనతోనే అసలైన ఆట.. చీకటిలోనూ ఫాస్ట్

రంగులను గుర్తించడంలో కుక్కలు మనకంటే వెనుకబడి ఉండవచ్చు, కానీ వాటికి దేవుడు ఇచ్చిన మరో సూపర్ పవర్ ఉంది. అదే వాటి వాసన చూసే సామర్థ్యం. ఏవైనా వస్తువులు లేదా వ్యక్తుల మధ్య తేడాలను గుర్తించడానికి కుక్కలు వాటి ముక్కునే ఎక్కువగా నమ్ముకుంటాయి. దీనితో పాటు, చీకటిలో చాలా వేగంగా జరిగే కదలికలను కూడా అవి ఈజీగా పసిగట్టగలవు. కంటి చూపుతో సంబంధం లేకుండా కేవలం వాసన, వినికిడి శక్తితోనే అవి ప్రపంచాన్ని శాసిస్తాయి.

66
మీ ఇంట్లోని పెట్‌తో ఇలా ట్రై చేయండి
Image Credit : AI Meta

మీ ఇంట్లోని పెట్‌తో ఇలా ట్రై చేయండి

కుక్కల రంగుల ప్రపంచంపై మీకు ఇంకా డౌట్ ఉంటే.. మీ ఇంట్లో ఉన్న పెట్ డాగ్ ముందర రకరకాల కలర్స్‌లో ఉండే ఆట వస్తువులను, విభిన్న ఆకృతుల్లో ఉండే పరికరాలను ఉంచి ఒక్కసారి అబ్సర్వ్ చేయండి. అవి ఏ రంగు వస్తువును త్వరగా పిక్ చేసుకుంటున్నాయి? దూరంగా ఉన్న వస్తువులను, వాటి షేప్స్‌ను ఎలా ఐడెంటిఫై చేస్తున్నాయో గమనిస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vehicle Number Plates: కార్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు ఉంటాయి? అసలు ఈ సిస్టమ్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో తెలుసా?
Recommended image2
Shankh Mitra: జీతంలో ఎలన్ మస్క్‌తో పోటీ పడుతున్న భారతీయుడు.. ఏడాదికి సాలరీ ఎంతో తెలుసా?
Recommended image3
Motivational Story: ఈరోజు నువ్వు చేసేదే... రేపు నీకు తిరిగి వస్తుంది. మనసును కదిలించే కథ
Related Stories
Recommended image1
Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Recommended image2
Vehicle Number Plates: కార్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు ఉంటాయి? అసలు ఈ సిస్టమ్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved