MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Vehicle Number Plates: కార్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు ఉంటాయి? అసలు ఈ సిస్టమ్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో తెలుసా?

Vehicle Number Plates: కార్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు ఉంటాయి? అసలు ఈ సిస్టమ్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో తెలుసా?

Vehicle Number Plates: వాహనాలకు నంబర్ ప్లేట్లు ఎందుకు వచ్చాయి? వైట్, ఎల్లో, గ్రీన్.. నంబర్ ప్లేట్లలో ఇన్ని కలర్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి చరిత్ర ఏంటి? ఇండియాలో రూల్స్ ఎలా మారాయో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 24 2026, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మ్యాజిక్ నంబర్ ప్లేట్ వీడియో వైరల్.. అసలు కార్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు పెట్టారో తెలుసా?
Image Credit : Gemini

మ్యాజిక్ నంబర్ ప్లేట్ వీడియో వైరల్.. అసలు కార్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు పెట్టారో తెలుసా?

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. స్టీరింగ్ మీద ఉన్న ఒక బటన్ నొక్కగానే కార్ నంబర్ ప్లేట్ మారిపోయే మ్యాజిక్ లాంటి సీన్ ఆ వీడియోలో ఉంది. ఇది చూసి జనాలు షాక్ అవుతున్నారు. కట్ చేస్తే, సరిగ్గా ఇదే టైమ్‌లో మన దేశంలో ఫేక్, ట్యాంపర్డ్ నంబర్ ప్లేట్లపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు.

రీసెంట్‌గా హైదరాబాద్‌లో పోలీసులు ‘ఆపరేషన్ కవచ్’ నిర్వహించారు. ఇందులో భాగంగా నంబర్ ప్లేట్లను మార్చిన, ఫేక్ నంబర్లు వాడుతున్న 2,100 పైగా వాహనాలను సీజ్ చేశారు. ఒకే నంబర్‌ను వేర్వేరు బండ్లకు వాడటం, క్లోనింగ్ చేయడం లాంటి ఫ్రాడ్స్ బయటపడ్డాయి. రిజిస్టర్డ్ నంబర్ ప్లేట్‌తో ఆటలాడితే క్రిమినల్ యాక్షన్ తప్పదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అసలు నంబర్ ప్లేట్ అంటే ఏంటి? దీని కథ ఎప్పుడు ఎక్కడ మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వాహనాల నంబర్ ప్లేట్ అంటే ఏంటి? చట్టం ఏం చెబుతోంది?
Image Credit : Asianet News

వాహనాల నంబర్ ప్లేట్ అంటే ఏంటి? చట్టం ఏం చెబుతోంది?

మోటార్ వాహనాల చట్టం (Motor Vehicles Act), 1988 లోని సెక్షన్ 41(6) ప్రకారం.. ఒక వాహనానికి ఇచ్చే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది రవాణా శాఖ ఇచ్చే అధికారిక గుర్తింపు. దీన్ని ప్రాంతీయ రవాణా అధికారి (RTO) కేటాయిస్తారు. ఇండియాలో రోడ్లపై తిరిగే ఏ వాహనానికైనా ఇదే లీగల్ ఐడెంటిటీ. సెక్షన్ 39 ప్రకారం.. వాలిడ్ రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా బండి నడపడం చట్టరీత్యా నేరం. వాహనానికి ముందు, వెనుక వైపులా ఈ నంబర్ స్పష్టంగా కనిపించాలని రూల్ చెబుతోంది.

Related Articles

Related image1
Indian Cricketers Padma Shri: రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
Related image2
OPPO Enco Air5 Pro: నాయిస్ క్యాన్సిలేషన్ నెక్స్ట్ లెవెల్ కిర్రాక్ ఇయర్‌బడ్స్.. OPPO నుంచి దుమ్ములేపే Enco Air5 Pro వచ్చేసింది
36
ఆ నంబర్ల వెనుక ఉన్న సీక్రెట్ కోడ్ ఏంటి?
Image Credit : our own

ఆ నంబర్ల వెనుక ఉన్న సీక్రెట్ కోడ్ ఏంటి?

మన దేశంలో నంబర్ ప్లేట్ ఫార్మాట్ ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఉదాహరణకు “TN 06 AB 1234” అనే నంబర్ ఉందనుకుందాం. ఇందులో మొదటి రెండు అక్షరాలు (TN) బండి ఏ స్టేట్‌లో రిజిస్టర్ అయిందో చెప్తాయి. ఆ తర్వాత వచ్చే రెండు అంకెలు (06) ఆ రాష్ట్రంలోని ఆర్టీవో లేదా జిల్లా ఆఫీస్‌ను సూచిస్తాయి. మధ్యలో ఉండే ఆల్ఫాబెట్స్ (AB) ఆ నంబర్ ఏ సిరీస్‌లో వచ్చిందో చెప్తాయి. చివరలో ఉండే నాలుగు అంకెలు (1234) ఆ బండికి మాత్రమే కేటాయించిన యూనిక్ నంబర్. ఇప్పుడు ఇదంతా కంప్యూటరైజ్డ్ కాబట్టి మోసాలు చేయడం అంత ఈజీ కాదు.

46
ఈ ఐడియా ఫస్ట్ ఎక్కడ పుట్టింది?
Image Credit : our own

ఈ ఐడియా ఫస్ట్ ఎక్కడ పుట్టింది?

ప్రపంచంలోనే మొదటిసారిగా ఫ్రాన్స్ దేశం వాహనాలకు గుర్తింపు ప్లేట్లను ప్రవేశపెట్టింది. ఆగస్టు 14, 1893న ప్యారిస్ పోలీసులు ఈ రూల్ తెచ్చారు. రోడ్డు ప్రమాదాలు చేసి పారిపోయే వాహనాలను పట్టుకోవడానికి ఇది స్టార్ట్ అయింది. అప్పట్లో నంబర్‌తో పాటు ఓనర్ పేరు, అడ్రస్ కూడా ప్లేట్ మీద రాయాల్సి వచ్చేది. ఆ తర్వాత 1896లో జర్మనీ, 1898లో నెదర్లాండ్స్ ఈ పద్ధతిని నేషనల్ వైడ్‌గా అడాప్ట్ చేసుకున్నాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో 1901లో నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేశారు. కాకపోతే అప్పట్లో ఓనర్లే లెదర్ లేదా మెటల్ మీద నంబర్లు రాసుకునేవారు. 1903లో మాసచుసెట్స్ స్టేట్ మొదటిసారి అధికారిక ప్లేట్లను ఇచ్చింది.

56
ఇండియాలోకి ఈ సిస్టమ్ ఎలా వచ్చింది?
Image Credit : our own

ఇండియాలోకి ఈ సిస్టమ్ ఎలా వచ్చింది?

బ్రిటిష్ కాలంలో 1914 నాటి ఇండియన్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ద్వారా ఇండియాలో ఈ సిస్టమ్ అధికారికంగా వచ్చింది. కానీ, అంతకంటే ముందే బాంబే (1901), బెంగాల్ (1903), మద్రాస్ (1907), పంజాబ్ (1907), బర్మా (1906) వంటి ప్రావిన్సుల్లో లోకల్ రూల్స్ ఉండేవి. వాహనాలు పెరిగిపోవడంతో 1939లో ఒక పక్కా సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 1988 మోటార్ వెహికల్ యాక్ట్, 1989 సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ద్వారా ఇప్పుడు మనం చూస్తున్న యూనిఫాం స్టేట్ కోడ్స్ సిస్టమ్ అమలులోకి వచ్చింది.

66
మోడ్రన్ రూల్స్, కలర్ కోడింగ్
Image Credit : our own

మోడ్రన్ రూల్స్, కలర్ కోడింగ్

ఇప్పుడు నంబర్ ప్లేట్లలో చాలా రకాల కలర్స్ వచ్చాయి. ప్రైవేట్ వాహనాలకు తెల్లటి ప్లేట్ పై నల్లటి అక్షరాలు, కమర్షియల్ బండ్లకు పసుపు ప్లేట్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఆకుపచ్చ ప్లేట్ వాడుతున్నారు. ఫ్రాడ్స్ జరగకుండా క్రోమియం బేస్డ్ హోలోగ్రామ్స్, లేజర్ కోడ్స్‌తో కూడిన 'హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు' (HSRP) తెచ్చారు. ఇక 2021లో 'BH' అంటే భారత్ సిరీస్ తీసుకొచ్చారు. దీనివల్ల ఉద్యోగాల రీత్యా వేరే రాష్ట్రాలకు బదిలీ అయ్యేవాళ్లు పదే పదే బండిని రీ-రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటి ప్యారిస్ పోలీసుల రూల్ నుండి నేటి డిజిటల్ సిస్టమ్ వరకు నంబర్ ప్లేట్ల ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
80s Look Prompt: ఇన్‌స్టాగ్రామ్‌ను ఊపేస్తున్న కొత్త AI ట్రెండ్.. ఒక్క క్లిక్‌తో 1980ల్లో బాలీవుడ్ హీరో, హీరోయిన్‌లా మీరు మారిపోవచ్చు!
Recommended image2
Motivational Story: నిజమైన బలవంతుడు ఎవరు..? మీ ఆలోచనను మార్చే కథ ఇది..!
Recommended image3
HORN OK PLEASE : లారీల వెనక 'OK' అని ఎందుకు రాస్తారు? దీని అర్థం 'సరే' కాదు, మరేంటో తెలుసా?
Related Stories
Recommended image1
Indian Cricketers Padma Shri: రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
Recommended image2
OPPO Enco Air5 Pro: నాయిస్ క్యాన్సిలేషన్ నెక్స్ట్ లెవెల్ కిర్రాక్ ఇయర్‌బడ్స్.. OPPO నుంచి దుమ్ములేపే Enco Air5 Pro వచ్చేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved